నేను #ఎన్టీఆర్ గారిని రెండు సార్లు చూశాను.
మొదటి సారి, తనే స్వయంగా బండి నడుపుతూ, నాతో విహార యాత్ర చేశారు.
ఇది ఎలా జరిగిందంటే... +
అవి మేము హైదరాబాద్ శివార్లలో వనస్థలిపురం కు మారిన కొత్త రోజులు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై, హైదరాబాద్ కు చాలా దూరంలో ఉండడంతో, "విజయవాడ నుంచి ఎప్పుడొచ్చారు?" అని, "అవస్థల పురం" అని గేలి చేసేవారు.
+
ఇంతకీ వనస్థలిపురం కు ఆ పేరు ఎందుకొచ్చిందంటే, ఆ కాలనీ మహావీర్ హరిణ వనస్థలి అనే జింకల ఉద్యానవనం కు సమీపంగా ఉండడంవల్ల. 3600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యానవనంలో పర్యాటకుల కోసం, ఆ యేడు సఫారీ సర్వీస్ ను ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవానికే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి NTR వచ్చారు. +
ఇటువంటి కార్యక్రమాలకి పిల్లమూక అవసరం. ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము అన్నట్టు, ఆ ఊరి శివార్లలో అధికారులకి మా బడి అక్కరుకొచ్చింది. ఇంకేముంది, మమ్మల్ని అందరిని బస్సులో వేసి ఉదయం 6 గంటల కల్లా అక్కడికి తీసికెళ్లారు. +
సఫారీ సర్వీస్ ను లాంఛనంగా ప్రారంభించి, కొంత మంది పిల్లలతో పాటు సఫారీ వాన్ ఎక్కి ఆయన ఒక రౌండ్ వేయాలి. అదీ కార్యక్రమం. అయన వచ్చే ముందరే కొంత మంది పిల్లల్ని ఎంపిక చేసి, సిద్ధంగా ఉంచారు. ఆ బ్యాచ్ లో నేను ఉన్నాను. +
పిల్లలమందరం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాము. ఉ. 7 గం. లకి కాషాయ వస్త్రాల్లో ఆయన వచ్చారు. రిబ్బన్ కట్టింగులు అవి అయిన తర్వాత ముందు ఆయనను వాహనం ఎక్కమన్నారు.
"లేదు. మేమే నడుపుతాం" అని ఆయన గబ్బుక్కుమని డ్రైవర్ వైపు తలుపు తెరచి సీట్ లో కూర్చున్నారు. +
అధికారులు తేరుకుని, సిద్ధంగా ఉంచిన పిల్లల్ని ఎక్కించారు. అందరికన్నా పొట్టి వాడినవటం ముందు నన్ను ఎక్కమని, డ్రైవర్ సీటు పక్కనే మొదటి సీట్లో కూర్చోపెట్టారు (పొట్టితనం సాధారణంగా ప్రతిబంధకమే అయినా, కొన్ని సందర్భాల్లో ఇదిగో ఇలా ప్రయోజనాలుండేవి). +
అలా ఒక 15 నిముషాలు ఎన్టీఆర్ స్వయంగా వాహనం నడుపుతుండగా ఆయనతో విహార యాత్ర చేశాను. ఇది ఎంత విశేషమో పూర్తిగా తెలియని వయస్సు. నాకప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో. +
రెండో సారి. ఆ మరుసటి యేడు, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ జూబిలీ హాల్లో "ఉపాధ్యాయుల దినోత్సవం" సందర్భంగా ఆయన పురస్కారాలు అందజేసి, ప్రసంగించి వేదిక దిగి తిరిగి వెళ్తున్నారు. నాన్నగారు "నమస్కారం పెట్టు" అన్నారు. +
నమస్కారమేమిటి ఆ విహార యాత్ర ఎంత ఆస్వాదించానో కూడా చెప్పాలి అనుకుని నమస్కారంతో మొదలెట్టా, ఇంతకీ ఆయన నన్ను చూడను కూడా చూడలేదు. +
నాకు ఎన్టీఆర్ నటుడిగాకన్నా, రాజకీయ నాయకుడిగా ఎక్కువ ఇష్టం. అన్నిటికన్నా ఎక్కువ అయన తెలుగుతనం, తెలుగు భాషకు, తెలుగు సమాజానికి అయన తెచ్చిన గుర్తింపు చాలా చాలా ఇష్టం. +
భారతరత్న పురస్కారం అర్హుల ఎంపికకు ఒక విస్తృత కమిటి లేదు. కేవలం ప్రధానమంత్రి రాష్ట్రపతికి చేసే సిఫార్సు మీద అది ప్రదానం చేస్తారు. ఇందువల్ల ఒకొకప్పుడు ఒక వ్యక్తి అర్హతల కన్నా ఇతర విషయాలు ఎంపికను ప్రభావితం చేసే ఆస్కారం ఉండవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ నాయకుల విషయంలో. +
#NTR శతజయంతి సందర్భంగా వచ్చిన వ్యాసాలు చదువుతుంటే, #MGR కంటే సినిమా, రాజకీయ రంగాల్లో NTR ప్రభావం ఇంకా ఎక్కువే కదా అనిపించింది. MGR గొప్ప నటుడు రాజకీయ నాయకుడే అయినా, కళలో, రాజకీయాలలో ఆయన ప్రభావం తమిళ రాష్ట్రానికే పరిమితం. +
NTR తమిళ సినిమాల్లోనూ నటించారు. రాజకీయంగా తన పార్టీని దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయి వరకూ తీసుకుని వెళ్లారు. మరి MGR భారతరత్న వచ్చి, NTR కు రాకపోవడానికి కారణం, తెలుగు తమిళ సమాజాల మధ్య ఉన్న వ్యత్యాసమే. వాళ్ళకి భాష సంస్కృతీ అన్నిటికన్నా ముఖ్యం. మనకవి అసలు ప్రాధాన్యతలే కాదు. +
చట్ట సభలలో బలం ఉన్నప్పుడు తమిళ సోదరులు తమ ఉనికిని బలంగా చాటుతారు. ఇక తెలుగు వారు కలిసి ఉన్నప్పుడే చట్ట సభలలో ఏమీ పీకలేదు, మరి ఇప్పుడు #పీవీ#ఎన్టీఆర్ లకు భారతరత్న ఎలా ఇప్పించుకోగలం? ఆంగ్లంలో "Never say never" అంటారు. ఏమో ఒక రోజుకి గ్రహస్థితి మారుతుందేమో!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
తెలుగు భాషా దినోత్సవాన తెలుగు వారందరికీ శుభాభినందనలు.
తెలుగు చదవగలిగి ఉండి, ఇంకా బాగా మాట్లాడాలి అనుకునేవారికి ముందు జోహార్లు.
ఇక్కడ (నేను పాటించిన) కొన్ని చిట్కాలు ఇస్తున్నాను. మీకూ ఉపయోగ పడతాయేమో చూడండి. 1/8
1.
మీ వాక్యాలలో తెలుగు ఎంతుందని కొన్ని రోజుల పరిశీలన తర్వాత నిర్ధారించుకోండి.
అంటే ప్రస్తుతం "వెజిటబుల్స్ ను ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకోండి" అంటున్నారంటే, తెలుగు రమారమి 30 శాతం అన్నమాట.
2/8
2.
మీ వాక్యాల్లో తెలుగు శాతాన్ని 6 నెలల్లో రెండింతలు చేయాలని సంకల్పం బూనండి.
3.
మనం అనాలోచితంగా ఆంగ్ల ఉపయోగించే పదాలకి సులువైన తెలుగు పదాలు ఉన్నాయేమో గమనించండి.
3/8
- ఒకరికి ఒక కష్టం రావడం
- అందరికి ఎదో ఒక కష్టం రావడం
- ఒకే కష్టం అందరికీ రావడం
ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు.
భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు. 1/n
విషాదాన్ని ఒక్కక్కరు ఒకో విధంగా భరిస్తారు. కొందరు పోయిన వారి జ్ఞాపకాలను తలచుకుంటారు. నలుగురితో పంచుకుంటారు. ఇంకొందరు మౌనంగా, ఏకాంతంగా భరిస్తారు.
తల్లితండ్రులు, తోబుట్టువులు, సంతానం పోయినప్పుడు వైరాగ్యం వస్తుందని, లేకపోతే కర్మకాండలు చేయలేరని అంటారు. 2/n
కానీ ఆ వైరాగ్యంలో నిర్వేదం ఉంటుంది.
ఒక మహోన్నత వ్యక్తి పోయినప్పుడు నిర్వేదం తగిన ప్రతిస్పందన కాజాలదు.
బాలు గారు గాత్రంతో పాటను, భాషాభిమానంతో తెలుగు మాటను, తన వ్యక్తిత్వం తో విశాల సమాజాన్ని ప్రభావితం చేశారు.
ఆ ప్రభావపు జ్యోతి, నిర్వేదం కాని, సర్వకాల సర్వావస్థలలోనూ ఉండే..3/n
1981-82 మధ్య #JVSomayajulu, #JVRamana గార్ల నాటక బృందం హైదరాబాద్ 'రైల్ కళారంగ్' లో ఓ నాటకం వేస్తే మా నాన్నగారు తీసుకెళ్లారు. చిన్నవాడిని కనుక నాకేమి అర్థంకాలేదు. సోమయాజులు గారు మంచం మీద నుంచి లేచి ఎదో అనే దృశ్యం ఒకటి లీలగా గుర్తుంది. కానీ చూట్టూ పక్కల జనం నాటకం ఆసాంతం పగలబడి 1/n
నవ్వటం బాగా గుర్తుంది. ఆ తర్వాత ఎప్పటికో గాని తెలియలేదు. ఆ నాటకం #Kanyasulkam అని. అది వ్రాసింది ఒక గొప్ప కవి అని, ఆయన పేరు #gurajadaapparao అని.
ఓ సందేశం పంపారు. గురజాడకి జోహార్లర్పిస్తూ, తాను కన్యాశుల్కం చిత్రం చాలా సార్లు చూసినా, నాటకం చూసే అవకాశం కలగలేదని. ఆ సందేశం చదివిన తర్వాత పైన చెప్పిన నా చిన్ననాటి అనుభవం గుర్తొచ్చింది. రాజా గారు నాకన్నా చాలా పెద్దవారు. ఇపుడు మళ్ళీ ఎవరన్నా కన్యాశుల్కం నాటకం వేస్తే తప్ప, 3/n