NTV Breaking News Profile picture
Breaking news from NTV reporters and editors.
Mar 13, 2023 4 tweets 4 min read
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్‌పై సీఎం కేసీఆర్‌ హర్షం.. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం-సీఎం కేసీఆర్

#RRRMovie #Oscar #NaatuNaatu #KCR ఆస్కార్ పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయి. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత చంద్రబోస్‌కు సీఎం ప్రత్యేక అభినందనలు

#Oscar #KCR