అనంతపురం జిల్లా విడపనకళ్ మండలంలో ఉన్న గ్రామం గడేకల్. గడేకల్లులో వేములవాడ భీమలింగేశ్వర స్వామి జీవ సమాధి మఠం ఉంది. భీమలింగేశ్వర స్వామి వర ప్రసాదిని నాగిరెడ్డి. భీమలింగేశ్వరుని ‘తాతా’ అని పిలిచేవాడట. నాగిరెడ్డి ఇంటిపేరు బొబ్బిళ్ళ.
ఆ పాట ఇలా సాగుతుంది
"చుట్టుముట్టూ పల్లెల కెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి
డెబ్భై యేడు పల్లెల కెల్ల దేవుడమ్మ భీమలింగా
రామ రామా కోదండరామా
భై రామ రామా కోదండరామా
దిక్కుదిక్కుల పల్లెల కెల్ల దేవుడమ్మ భీమలింగ
రామ రామా కోదండరామా
భై రామ రామా కోదండరామా
...
అంటూ కొనసాగే ఈ పాట నాగిరెడ్డి ధైర్య సాహసాలు, బీదా బిక్కికి సాయం చేసిన విధం, పది మంది నాగిరెడ్డిని చుట్టుముట్టి హత్య చేసిన వివరాలు తెలియజేస్తుంది