శ్రీ రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు.
#Arunachalam
#Tiruvannamalai
భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి సూక్తులు...
“కోరికలు మితంగా ఉంటే, బాధలూ తక్కువగానే ఉంటాయి”
“ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు”
“ఆలోచనలు ఉన్నప్పుడే, అది పరధ్యానం.: ఆలోచనలు లేనప్పుడు, అది ధ్యానం”
“అవసరానికి మించిన సంపద అనర్ధదాయకం”
“కల్పితమైన ‘పాము’ అనే అజ్ఞానపు భ్రమ తొలగితే గానీ దానికి ఆధారమైనది తాడు అనే జ్ఞానం ఎలా కలుగదో, అటులనే ‘ప్రపంచం నిజం’
“చెడు వారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది”
“ప్రశాంతత నాలుక నాలుగు రకాల మాటలకు సంబంధించినది, కళ్లకు సంబంధించినది చెవులకు సంబంధించినది, మనసుకు సంబంధించినది, వీటిలో మానసిక ప్రశాంతత ముఖ్యమైనది గొప్పది కూడా”
“చిరునవ్వుల దరహాసంతో వెలిగిపోయే వారితోనే మీరు స్నేహం చేయండి”
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా
భారతీయ జనతా మజ్దూర్ సెల్ జిల్లా కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ ఆరెకటిక సంఘం రాష్ట్ర కార్యదర్శి
కడప జిల్లా ఆరెకటిక సంఘం జిల్లా కార్యదర్శి
#Kadapa