ఆంధ్ర రాష్ట్రంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?
రాయలసీమలో మొదటి సిమెంటు పరిశ్రమ అయిన పాణ్యం సిమెంట్స్ వ్యవస్థాపకులు ఎవరో తెలుసా?
సహకార రంగంలో అతి పెద్ద చేనేత సంస్థలలో ఒకటైన YWCS(ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) స్థాపకుడు ఎవరో తెలుసా?
అన్నిటికీ ఒకే సమాధానం-మాచాని సోమప్ప
అయన పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సహకారరంగంలో చేనేత పితామహుడు, జాతీయ స్థాయిలో అనేక హోదాల్లో పనిచేసినవారు
ఐదుగురు అన్నదమ్ములలో పెద్దవాడైన మాచాని గంగప్ప పేరిట 1928లో మాచాని కుటుంబం MG Brothers సంస్థను స్థాపించి, ఆ సంస్థ కింద అనేక పరిశ్రమలు నెలకొల్పారు. వ్యాపారాలు ప్రారంభించారు
పరిశ్రమలు :
రాయలసీమలోని ప్రముఖ స్పిన్నింగ్ మిల్స్ ఎమ్మిగనూరు స్పిన్నింగ్ మిల్స్ (1940),
రాయలసీమలో ఏర్పడిన మొదటి సిమెంటు పరిశ్రమ పాణ్యం సిమెంట్స్ & మినరల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ పరిశ్రమ 1955లో మాచాని సోమప్పగారి MG గ్రూప్ సారధ్యంలో ఏర్పడింది. తదనంతర కాలంలో ప్రస్తుతం నందిగ్రూప్ వారి అధీనంలో ఉన్నది.
1960లో ప్రఖ్యాత జర్మనీ కంపెనీ స్టంప్+షూల్ భాగస్వామ్యంతో సోమప్ప గ్రూప్ (MGB) బెంగళూరులో SSS - స్టంప్, షూల్ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పింది. భారత ఉపఖండంలోనే ఇది తొలి స్ప్రింగ్స్ తయారీ పరిశ్రమ.
YWCS అధ్యక్షుడిగా, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడిగా వివిధ హోదాల్లో చేనేత రంగ అభివృద్ధికి సూచనలు చేశారు సోమప్ప. వారు రచించి YWCS ఆధ్వర్యంలో వెలువడిన Whither Handlooms, Fairdeal to Handlooms, The Voice of the Handlooms వంటి పుస్తకాలు చేనేత అభివృద్ధికి మార్గదర్శకాలు
సమాజ సేవ / విద్యాలయాలు
మాచాని సోమప్ప విద్యావేత్త. విద్యను బాగా ప్రోత్సహించారు.
వీరి పేరుతో ఎమ్మిగనూరులో
దార్శనికులు, ఆధునిక రాయలసీమ తొలితరం పారిశ్రామికవేత్తలలో ఒకరైన సోమప్ప 1978 మార్చ్ 30న పరమపదించారు.
machanigroup.com/others.html
mgbrothers.com/heritage/
గవర్నమెంట్ గజెట్
padmaawards.gov.in
చిత్రం : వికీపీడియా