గుత్తి, పామిడి, గండికోట, ఒంటిమిట్ట క్షేత్రాల మధ్య సామీప్యం ఏమిటి?
ఒంటిమిట్టకి ఆ పేరు ఎలా వచ్చింది?
రఘువీరా! జానకీనాయకా! అనే మకుటంతో శ్రీమదొంటిమిట్ట రఘువీర శతక కర్త ఎవరు?
ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం రాత్రిపూట ఎందుకు జరుగుతుంది?
(1/n)
#Vontimitta #Kadapa
త్రేతాయుగంలో వనవాస సమయంలో దండకారణ్యలో సీతారామలక్ష్మణులు సంచరిస్తుండగా, సీతమ్మవారి దప్పిక తీర్చడానికి రాములవారు ఎక్కుపెట్టిన బాణం వాళ్ల భూమిలోనుంచి ఉబికి వచ్చిన నీరు వల్ల ఇక్కడ రెండు మడుగులు ఏర్పడ్డాయి. అవే రామ తీర్థం మరియు లక్ష్మణ తీర్థం.
3/n
విజయనగర సామాజ్య్ర స్థాపకులు అయిన హరిహరరాయలు, బుక్కరాయల సోదరుడు కంపరాయలు ఈ ప్రాంతంలో పర్యటించినపుడు స్థానిక బోయ నాయకులు ఒంటడు, మిట్టడు రాజుకు సదుపాయాలు కల్పింఛి, నీటి వసతి కోసం రామతీర్థాన్ని చూపించగా, ఆ ప్రాంతాలో కంపరాయలు వారి పేరుతో ఒక గ్రామం కట్టించారు.
4/n
5/n
#Rayalaseema_Temples
ఒంటడు, మిట్టడు అను బోయ నాయకుల పేరు మీద ఒంటిమిట్ట వచ్చిందనీ, ఆలయ దేవతామూర్తులు ఒకే శిల మీద చెక్కబడి ఉండటంతో సంస్కృతంలోని ఏకశిలా నగరం ప్రాకృతంలో ఒంటిమిట్ట అయ్యిందని ఒక కథనం కాగా
6/n
#Kadapa_Temples #Ravishing_Rayalaseema #Rayalaseema_Tourism
7/n
విజయనగర రాజులచే సత్కారాలు పొందిన అయ్యలరాజు తిప్పయ్య / త్రిపురాంతక కవి రఘువీరా! జానకీనాయకా! అనే మకుటంతో శ్రీమదొంటిమిట్ట రఘువీర శతకం రచించారు. వీరి ప్రపౌత్రుడే (మునిమనవడు) శ్రీకృష్ణదేవరాయల లోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు.
8/n
శ్రీకృష్ణదేవరాయల భువనవిజయం లోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అను కావ్యాన్ని రచించి శ్రీకృష్ణదేవరాయల అల్లుడు (అలియ) రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చారు. ఈయనా ఒంటిమిట్టకు చెందినవారే
9/n
ఒంటిమిట్టలోని రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా చేసి, ఎంత ధనం దానిలో పడినా ఏదీ ఉంచుకోక రామునకిచ్చి తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి "నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా" అంటూ వావికొలనువారు 'టెంకాయ చిప్ప శతకం' రచించారు.
15/n
17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రఖ్యాత ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించి భారాతావనిలోనే అత్యంత గొప్ప ఆలయాల్లో ఒకటని (One of the Greatest Pagodas in the whole of India) ఒంటిమిట్ట క్షేత్రాన్ని కొనియాడారు.
20/n
ఇమాంబేగ్ కడపను ఏలిన నవాబుల ప్రతినిథి. ఇతను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటానికి ఆయా గుడులకు వెళ్లి ఆ దేవుని పేరుని పిలిచి, తనకు తిరిగి జవాబు రాకపోతే ఆ విగ్రహాలను అక్కడి నుండి పీకించి ఆ ఆలయాలను ధ్వంసం చేసేవాడు. అలా కొన్ని ఆలయాలను ధ్వంసం చేసాక-
21/n
ఇమాంబేగ్ బావి. (మూలం : శ్రీమదొంటిమిట్ట కోదండరామ మహాత్మ్యము – శ్రీ వావికొలను సుబ్బారావు)
22/n
మామూలుగా కళ్యాణం చైత్ర శుద్ధ నవమి (రాములవారి జన్మదినం ) రోజు జరుపుతుండగా, ఒంటిమిట్టలో మాత్రం మిగతా ఆలయాలకు భిన్నంగా శ్రీసీతారాముల కళ్యాణం, వశిష్ట మహర్షి వారి కళ్యాణానికి నిర్ణయించిన ముహూర్తంలో ( చైత్ర మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రం) రాత్రిపూట జరుగుతుంది
23/n
25/25