- ఒకరికి ఒక కష్టం రావడం
- అందరికి ఎదో ఒక కష్టం రావడం
- ఒకే కష్టం అందరికీ రావడం
ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు.
భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు. 1/n
విషాదాన్ని ఒక్కక్కరు ఒకో విధంగా భరిస్తారు. కొందరు పోయిన వారి జ్ఞాపకాలను తలచుకుంటారు. నలుగురితో పంచుకుంటారు. ఇంకొందరు మౌనంగా, ఏకాంతంగా భరిస్తారు.
తల్లితండ్రులు, తోబుట్టువులు, సంతానం పోయినప్పుడు వైరాగ్యం వస్తుందని, లేకపోతే కర్మకాండలు చేయలేరని అంటారు. 2/n
కానీ ఆ వైరాగ్యంలో నిర్వేదం ఉంటుంది.
ఒక మహోన్నత వ్యక్తి పోయినప్పుడు నిర్వేదం తగిన ప్రతిస్పందన కాజాలదు.
బాలు గారు గాత్రంతో పాటను, భాషాభిమానంతో తెలుగు మాటను, తన వ్యక్తిత్వం తో విశాల సమాజాన్ని ప్రభావితం చేశారు.
ఆ ప్రభావపు జ్యోతి, నిర్వేదం కాని, సర్వకాల సర్వావస్థలలోనూ ఉండే..3/n
భావ సమతౌల్యత అనే దీపాన్ని వెలిగించాలి.
ఈ సమతౌల్యాన్నే జ్ఞానులు 'స్థితప్రజ్ఞత' అన్నారు. నిజానికి ఈ స్థితిని సాధించడం, ఒకింత ఆధ్యాత్మిక దృక్పధం ఉన్న భారతీయులందరీ జీవిత లక్ష్యం.
శ్రీ నిసర్గదత్త మహారాజ్ ఇలా అంటారు, “మరణం సంభవించినప్పుడు దేహం మాత్రమే మరణిస్తుంది. జీవితం...4/n
చైతన్యం, యథార్థం ఇవేవి మరణించవు. ఇక జీవితమైతే, మరణించిన తర్వాత, మున్నెన్నడూ లేనివిధంగా సజీవంగా ఉంటుంది.”*
ఆ విధంగా ఆలోచిస్తే మనందరమూ చిరంజీవులమే. ఇక బాధ ఎందుకు. 5/n
ఇది నమ్మకపోయినా అందరికీ అనుభవైక్యమైన సత్యం ఒకటుంది.
అంతిమంగా, కాలం అన్ని సుఖదుఃఖాలను సమానం చేస్తుంది.
‘దాసు’ కిరణ్
*గమనిక:*
Sep 25 నుంచి నేను సాంత్వన కోసం స్వీయ నిర్బంధం లోకి వెళ్లిపోయాను. దిన పత్రికలు, టీవీ చూడలేదు, YouTube, Facebook, Twitter జోలికి వెళ్లలేదు.... 6/n
వాట్సాప్ లో ఈ విషయం మీద వచ్చే ఏ సందేశమూ చూడలేదు. ఆఖరికి దాసుభాషితం క్కూడా విరామం ఇచ్చాను. అందుకనే మీ సందేశానికి ప్రతిస్పందించకపోయుంటే, క్షమించండి.
*మూలం: “అనాయాసంగా ఆత్మజ్ఞానమా” నిసర్గదత్త సంభాషణలు - శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్. 7/7
1981-82 మధ్య #JVSomayajulu, #JVRamana గార్ల నాటక బృందం హైదరాబాద్ 'రైల్ కళారంగ్' లో ఓ నాటకం వేస్తే మా నాన్నగారు తీసుకెళ్లారు. చిన్నవాడిని కనుక నాకేమి అర్థంకాలేదు. సోమయాజులు గారు మంచం మీద నుంచి లేచి ఎదో అనే దృశ్యం ఒకటి లీలగా గుర్తుంది. కానీ చూట్టూ పక్కల జనం నాటకం ఆసాంతం పగలబడి 1/n
నవ్వటం బాగా గుర్తుంది. ఆ తర్వాత ఎప్పటికో గాని తెలియలేదు. ఆ నాటకం #Kanyasulkam అని. అది వ్రాసింది ఒక గొప్ప కవి అని, ఆయన పేరు #gurajadaapparao అని.
ఓ సందేశం పంపారు. గురజాడకి జోహార్లర్పిస్తూ, తాను కన్యాశుల్కం చిత్రం చాలా సార్లు చూసినా, నాటకం చూసే అవకాశం కలగలేదని. ఆ సందేశం చదివిన తర్వాత పైన చెప్పిన నా చిన్ననాటి అనుభవం గుర్తొచ్చింది. రాజా గారు నాకన్నా చాలా పెద్దవారు. ఇపుడు మళ్ళీ ఎవరన్నా కన్యాశుల్కం నాటకం వేస్తే తప్ప, 3/n