🚩🚩సామజిక దృక్పధం !
#గ్రామం లో కి వెళ్లి ఒక రైతు ని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి అని అడగండి . వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు . పట్టణం లో వెళ్లి ఒక హోటల్ యజమాని ని అడగండి .. కూక్స్ వైటర్స్ ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు ."
అసలు ఈశాన్య భారత దేశం వారు ఉండబట్టి సరిపోయింది .. లేక పొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని మొన్న కేరళ లో ఒక హోటల్ యజమాని అన్నాడు . భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు .
నేను మారిషస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు పురోహితుడు , కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడిగారు .
ఒక పక్క దేశం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు . మరో పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు .
ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి .
హోటల్స్ లో దోస మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది . అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యు లో నిల్చుంటున్నారు .
సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి . జీతం ఎక్కువ వస్తుంది అని కాదు .
చాల సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది . ఈ రోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు . అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు . మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు .
ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని. ప్లంబర్ ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే అమ్మాయి కూడా దొరకని పరిస్థితి . అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది .
అయినా పురోహిత్యం అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి . కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు . అదే హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ . తల తీసి నట్టు ఫీల్ అవుతారు .
ఇదే మన వారు అమెరికా కు వెళితే అక్కడ హోటల్ లో పని చెయ్యడానికి సిద్ధ పడుతారు.
అంటే ఇక్కడ మారాల్సింది సామజిక దృక్పధం . దొంగ తనం , అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు . అన్ని పనులు గొప్పవే . మన సీనియర్స్ అమెరికా వెళ్లారు .. మనకు ట్రంప్ అడ్డుపడ్డాడు ..
ఇక్కడ ఉద్యోగం లేదు ... దారిన పొయ్యే వారు ఎం బాబు ఉద్యోగం లేదా అంటూ కాకుల్లా పొడుచుకొని తింటున్నారు అని ఫీల్ కానక్కర లేదు .
మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి . అతి చిన్న ఉద్యోగమైనా పరవా లేదు . చేతినిండా పని ఉండాలి ... ఎంతో కొంత ఆదాయం ఉండాలి . చేస్తున్న పని పై మనసు లగ్నం చెయ్యాలి .
అంచెలంచెలుగా ఎదగాలి . పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి . పాన్ డబ్బా పెట్టుకొన్న పరవా లేదు . కర్రీ షాప్ పెట్టుకొన్న పరవా లేదు . మీరే రాజు. .. మీరే మంత్రి ... డిప్రెషన్ శుద్ధ అనవసరం .
ఆత్మ విశ్వాసం ... కృషి .. పట్టుదల .. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం ... కావలసింది ఇది . వీడియో గేమ్స్ ఆడుతూ ... కాల్సక్షేపం కోసం నెట్ పై సంచరిస్తూ .. ట్రంప్ కరుణిస్తాడు ... అవకాశం వస్తుంది అని చూడ్డం కాదు ... అవకాశాన్ని వెతుకొంటూ మీరే వెళ్ళాలి .
ఒకటి చెప్పనా ... అమెరికా లో వెళ్ళగానే ఏదో భువిలోక స్వర్గం సాక్షత్కారం కాదు . అంతకు పది రెట్లు ఇక్కడే హ్యాపీ గా బతక వచ్చు . ఎక్కువ చెబితే అక్కడ ఉన్న మిత్రులు ఫీల్ అవుతారు . వద్దు లెండి.. అక్కడి అవకాశం వస్తే వెళ్ళండి ... కానీ దాని కోసమే ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు .
జీవితం లో స్థిరపడి పొయ్యారు ... మీరు ఏదైనా చెబుతారు అనుకొంటున్నారా ? మల్లి జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చెయ్యాల్సి వస్తే సిటీ లో ఒక మూల లక్ష ఖర్చుతో చిన్న రెస్టురెంట్ పెట్టి నేను కుక్ చేసి .. తింటే ఇక్కడ తిండి తినాలి అని లెవెల్ కు తీసుకుని వెళుతా . గ్రోత్ ఎలాగూ వస్తుంది .
ఎందుకంటే నేను డబ్బు వెనక పరుగెత్తను. పని వెంట నాణ్యత వెంట పరుగెత్తుతా. చేసే పని ని ఎంజాయ్ చేస్తా ... నా వంట తిన్న వారి ఆనందం నాకు ముఖ్యం .. పేరు డబ్బు చచ్చినట్టు వెనక వస్తుంది .. రాక ఎక్కడ చస్తుంది . వంద శాతం నిజాయతి గా గుండెల పై చెయ్యి వేసుకొని చెబుతున్న మాట .

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -V.V. Apparao

వింజమూరి -V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

5 Oct
🚩కల భాషిణి!
-
ప్రబంధాలు అపురూప కవితాకళాఖండాలు.చదవండి .అడుగడుగునా రసధునులే!
కల భాషిణి యంద చందాలు!
ప్రబంధయుగంలో కవులు ఒకరినిమించినవారు మరొకరు.హేమాహేమీలు. వారిలో పింగళిసూరనయొకడు.
.
కలభాషిణి సూరన సృష్టించిన యొక యందారభరణి!
విటజనహృదయమనోహారిణి. ద్వారకా నగరమునందలి యొకవేశ్య!
ఆపాత్రను కళాపూర్ణోదయంలో పరిచయంచేస్తూ,కవియీపద్యంవ్రాశాడు.
.
ఉ: కూకటి వేణితో కురులు కూడకమున్నె, కుచ ప్రరోహముల్
పోకల తోటి సామ్యమును పొందకమున్నె, నితంబ సీమకున్
వ్రేకఁ దనంబొకింత ప్రభవింపక మున్నె, బ్రసూనబాణు డ
ర్రాకల బెట్టె, దా నరవ నామెత బాలికకై విటావళిన్;
.
Read 6 tweets
5 Oct
మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడ ైనా ఆలోచించారా………?
గధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి,
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.
కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడైనా ఆలోచించారా………?
మైదా పిండి ఎలా వస్తుంది……..
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
Read 5 tweets
4 Oct
🚩🚩మరపు రాని మధురగీతం..🚩🚩
.
‘’చిగురాకులలో చిలకమ్మా ‘’
.
హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట
పెండ్యాల నాగేశ్వర రావు త న సంగీత సరళ స్వరాలతో

హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,
పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత సరళ స్వరాలతో
మనసు గిలి గింతలు పెట్టాడు.
అలా విరిసినఒక పుష్ప గీతమే
సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం
.
ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది
తన మనసులో ఉన్నది చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .
వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .
ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ
అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత
.ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .
Read 9 tweets
4 Oct
ముగురమ్మల మూలపుటమ్మ!

(పోతనామాత్యుడు..భాగవతం)
.
"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"

.
As requested by some friends ..The Meaning in english.

The mother of all mothers,

the mother who is the source of the three goddesses

(Sarasvati, Lakshmi and Parvati), very noble mother,

the mother who caused heartburn to the mother of gods

' foes
(she's a slayer of demons),
the mother who resides in the heart of all divine women

that believe in her, Durga, our mother, in her sea of

compassion, may grant us the wealth of great poetic

prowess!

Notes: This too is an utpala maala.

However, in contrast to the first poem,
Read 4 tweets
4 Oct
🚩 బామ్మగారు-బస్సు ప్రయాణం !

😀😀😅

హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ

వైజాగ్ వెళ్లే బస్సు ఎక్కింది,

ఎక్కగానే డ్రైవర్ తో... బాబు నేను నిద్రపోతానేమో,

విజయవాడ రాగానే నన్ను లేపుతావా అన్నది...?

డ్రైవర్: సరే పడుకోండి
ఆ ముసలావిడకు నమ్మకం లేక పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు

కూడా చెప్పింది, అందరూ సరే అన్నారు

చాలా దూరం ప్రయాణం తరువాత ముసలావిడ నిద్ర లేచింది,

విజయవాడ ఇంకా రాలేదా బాబు?
అయ్యో సారీ బామ్మగారు మర్చిపోయాను, విజయవాడ దాటేసి100కి.మీలు వచ్చేశాము..
ఆమె ఏడవడం మొదలుపెట్టింది, మర్యాదగా వెనక్కి తిప్పి

విజయవాడ తీసుకెళ్ళమని గోల చేసింది, ఆమెకు తోటి ప్రయాణికులుకూడా ఆమెకు సపోర్ట్ చేశారు, డ్రైవర్ వెనక్కి తిప్పి విజయవాడతీసుకొచ్చి ఆమెను దింపడానికి ట్రై చేశాడు.

డ్రైవర్.. బామ్మగారు విజయవాడ వచ్చేసింది దిగండి...
.
Read 4 tweets
4 Oct
🚩🚩చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు .🚩🚩

(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)

"మా ఇంగ్లీష్ టీచరు #పబ్బరాజు సుబ్బారావు గారు

ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు.

చాలా కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది

తెలుగు మీడియం.
ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని పరిస్తితి..

నా మీద నాకే సిగ్గేసింది.

"ఐదో ఫారంలో మా క్లాసు టీచరు #జుల్ఫ్ కార్ ఆలీఖాన్.

మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు.

కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు.

అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని పిల్లలు దిద్దుతుండేవారు.
"మా క్లాసు పిల్లలు నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి

ఎం.ఏ. వారికన్నా బాగుండేది.

ముఖ్యంగా #నరసింహన్ అయ్యంగార్, #రామచంద్రారెడ్డి,

#అబ్దుల్ అజీజ్, #ఆజ్మల్ ఖాన్, #రాఘవన్ - వీళ్ళు ఇంగ్లీష్

మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది.

రాఘవన్ #బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు వచ్చేవాడు.
Read 14 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!