🚩🚩మధ్య తరగతి మనో "గతం"🚩🚩

#ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను మోగగానే ఆయనకేసి చూశాను జాపుకున్న కాళ్ళకి పతంజలి నూనె రాసుకుంటూ.."పార్వతీ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట, వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు
మావారు శంకర ప్రసాదు గారు.
"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.
"2000ని 74తో గుణించు, రూపాయల్లో వస్తుంది" అన్నారు. విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా "ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి, లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా. "లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి
వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.

చెప్పొద్దూ...అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని. నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .

రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది .
"ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా"
అనేవారు పిల్లలు.
పుట్టుకతో వచ్చిందిమా ఊరికినే పోతుందా ?

కరివేపాకు కట్ట 70 రూపాయలట!
అందుకే.. కూరల్లో, చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ...
ఎందుకో పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి.
ఈయన మూడేళ్ళ కిందట రిటైర్ అయ్యాక మరీను !
ఇప్పుడు నా రెండో కొడుకు ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకుని, నా పుట్టిన రోజుకి ఏదైనా కొనుక్కోమని లక్ష చిల్లర డబ్బులు పంపిస్తే ఆనందమే...కానీ....

అప్పట్లో మా మావయ్య నాపుట్టిన రోజుకని ఇచ్చిన యాభై రూపాయలకి ఎంత సంబర పడిపోయానో..
ఎంత మందితో చెప్పుకున్నానో! అంత సంతోషించడానికి కారణం ఆ వయసా? అప్పటి పరిస్థితులా? లేక అవసరాలా? ఏమో!

ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,
ఏసీలు, సోఫా సెట్లు, కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా....
ఎందుకో..ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో
మా అత్తగారు, మేవిద్దరం, ముగ్గురు పిల్లల్తో ఉన్నా
ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !
సెకండు హ్యాండు స్కూటర్ మీద ఆయన అలా..
గోదారి గట్టు మీదకి తీసుకెడితే...‘ఇదే’ వేరు! ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీలో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !
మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !
మా అత్తగారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ, "ఇంక చాలు, పడుకోండి, తెల్లారి పోతోంది,మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు.
మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,…
ఎవర్నీ నిద్దరోనీకుండా.
మా ఆడపడుచులు ఎంతో మంచివాళ్ళు, ఇప్పటి టీవీ, సినిమా ఆడపడుచుల్లా కాదు.

అప్పట్లో ఈయన పినతల్లి కొడుకు పెళ్లికి వెళ్ళాలంటే మంచి పట్టు చీరలే ఉండేవి కావు.
ఇప్పుడు మూడు బీరువాల నిండా ఎవరెవరో పెట్టినవి, పెట్టించుకున్నవి,కొనుక్కున్నవి చాలా ఉన్నాయి.
పట్టు చీరలైతే లెక్కే లేదు…. ఫాన్సీ చీరలు ఉన్నా ...
ఏం కట్టుకుంటాం ?

అటూ, ఇటూ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి.
అందరి కుటుంబాలనించీ ఒక్కళ్ళైనా అమెరికాయో,
లండనో చెక్కేశారు.
మా రోజుల్లో కొంపకి ఒక్కళ్లు హైదరాబాద్ వెడితే
‘అబ్బో’ అనుకునే వాళ్ళం.
శ్రావణ మాసం పేరంటంలో ఎవరైనా "మావాడు హైడ్రాబాడ్ లో చార్మినారు, ట్యాంకు బండూ చూపించాడు" అంటే, మనం ఎప్పుడు చూస్తామో అనుకునే వాళ్ళం.
ప్రస్తుతం మా పిల్లలు, ఇద్దరబ్బాయిలూ,
ఒకమ్మాయి అమెరికాలో స్థిరపడ్డారు. శతమానం భవతి సినిమాలో లాగ.

నేనూ, ఈయనా ఇక్కడే భాగ్య నగరంలోనే ఉండి పోయాం, జయసుధా, ప్రకాష్ రాజుల్లాగా.

కొడుకులు ఫోను చేసినప్పుడల్లా "గ్రీన్ కార్డు" అంటూవుంటారు..
స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మాటిమాటికి
"నా ఉజ్జోగం?" అన్నట్టు!

ఎందుకో అమెరికా వెళ్లాలంటే ఇంకా మనసు
రావడం లేదు,

ఇక్కడే పాత స్నేహితులు, చుట్టాలతో వాట్సాప్, ఫోనులతో కాలక్షేపం చేయడమే ఇష్టం.
తరవాత్తరవాత భగవంతుడెలా నిర్ణయిస్తాడో మరి!
నాకు మాత్రం, ఆ టీవీ సీరియళ్లు, చాగంటి వారి ప్రవచనాలు చూసుకుంటూ వేళకి ఇంత ఉడకేసిపడేస్తే
హాయిగా గడిచిపోతుంది.

అన్నట్టు మొన్న వేసంకాలం మా అమ్మాయి, పెద్ద మనవరాలు, మనవడు వచ్చినపుడు వేలకి వేలు తగలేసి నాకోసంట
స్మార్టు ఫోను, టాబ్ కొన్నారు...చెప్పాచెయ్యకుండా.
వాటిల్లో వాట్సాప్, యూట్యూబు పెట్టి నన్ను చూసుకోమన్నారు. మా పెద్ద మనవరాలు మా హై స్కూల్ సైన్సు మాష్టారి లాగ అన్నీ నేర్పించి వెళ్ళింది.
ఈయన నేర్పితే రాదుకానీ... అది నేర్పితే బాగానే అలవడ్డాయి నాకు.
నిజంచెప్పొద్దూ..అవన్నీ నేర్చుకున్నాక, రోజూ పిల్లలందరి మెసేజీలు, ఫోటోలు, వీడియోలు,
రక రకాల విశేషాలు చూస్తుంటే మాటాడుతుంటే
టైమే తెలియడంలేదు.

అదే నా పెళ్ళైన కొత్తలో నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న మా అమ్మ కోసం ఎంత బెంగెట్టుకునేదాన్నో!
ఏమాటకామాటే చెప్పుకోవాలి, పాపం ఈయన వారానికి రెండుసార్లు పుట్టింటికి పంపించేవారు బడ్జెట్ ఇబ్బందులున్నా !
తనికెళ్ళ భరణి తీసిన "మిధునం" చూస్తుంటే మా కధే తీసినట్టు అనిపిస్తుంది.
కాకపోతే లక్ష్మి, బాలు గార్లు పల్లెటూళ్ళో ఉంటారంతే.
పిల్లలు వారానికి రెండు మూడు సార్లు వీడియో కాల్సు చేస్తే
వంట డ్యూటీ తనదేనని పాపం శంకర ప్రసాద్ గారికి తెలుసు.

ఆయనక్కూడా వాట్సాప్, యూట్యూబు, ఫేసు బుక్కు ఉన్నా, ఆయన రూటే సెపరేటు. ఎప్పుడూ రాజకీయాల గొడవే !
"వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు " అని ఆవేశపడిపోతూ ఉంటారు.
ఆ ఫేసు బుక్కులో వ్యాసాలకి వ్యాసాలు రాసేస్తుంటారు,
తానే సమాజాన్ని మార్చెయ్యాలన్నట్టు !

ఇంక టీవీ చూడ్డం మొదలెడితే స్నానమవదు,
అన్నానికి లేవరు.
పొద్దుకుంగే దాకా ఆ దిక్కుమాలిన ఛానళ్ళలో వాదనలే వింటుంటారు.
పది మందీ కలిసి ఒక్క సారే అరిచేస్తుంటారు,
ఒకడు చెప్పేది ఇంకోడు వినిపించుకోడు. ఈయన, "నువ్వునోరుముయ్యరా" అని అరిచేస్తుంటారు !
రోజూ ఇదో ప్రహసనం !
నేను మాత్రం, నా గదిలోకి వెళ్లి, ఏసీ వేసుకుని,
సుమ ఆడవాళ్ళ చేత ఆడించే ఆటలు చూస్తూ,
వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు, నగలు చూస్తూ, ఈటీవీలో 'అభిరుచి' లోని రకరకాల వంటల కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తుంటాను.
ఆయనకి ఇవేమీ నచ్చవు.
ఎప్పుడూ రాజకీయాలు, వార్తలు, ట్రంపు, మోడీ,
చంద్రబాబు, కేసీయారు, జగన్ను, పవన్ను...లేక పోతే ఆ జంతువులు ఒకదాన్నొకటి పీక్కుతినే 'విజ్ఞాన' చానళ్ళుట.... అవే చూస్తుంటారు.
మా దాంపత్య జీవితంలో నగలు, చీరలకోసం ఎన్నడూ ఆయన్ని వేధించలేదు కానీ..చిన్న టీవీ ఉన్నప్పుడు మాత్రం, సీరియళ్ల టైముకి ఛానల్ మారిస్తే మాత్రం గొడవలే.
మొన్నామధ్య మా చిన్నబ్బాయి వచ్చినపుడు, రాజీమార్గం గా నా కోసం ఒకటి, వాళ్ళ నాన్నకి ఒక పేద్ధ టీవీ కొని పారేశాక, కొంపలో శాంతి నెలకొంది...
అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ముగ్గురు పిల్లలు, నేను, మా ఆయన, మా అత్తగారు
ఉన్నపుడు ఇల్లు ఇరుకనిపించ లేదు, డబ్బు లేదనిపించలేదు. (ఈయన జీతం ఏ నెల్లో ఎంత వచ్చేదో నేను ఎప్పుడైనా పట్టించుకుంటేగా!)

చుట్టాలు, పక్కాలు వచ్చి మూడు, నాలుగు రోజులుండి పోయినా ఇబ్బందనిపించేది కాదు.
ఎన్నిసార్లు డికాషన్ తీసేదాన్నో.. ఎన్నిసార్లు కుక్కర్ పెట్టేదాన్నో !
సమయానికి గ్యాస్ అయిపోతే, పక్క వాటా వాళ్ళ సిలిండెర్ ఉమ్మడి ఆస్తి అయిపోయేది.

ఫ్రిజ్ లేని రోజుల్లో అధాట్టుగా ఎవరైనా వస్తే,
పాలు, పంచదార, కాఫీ పొడికి పక్కింటి
రాధమ్మ గారే మాకు క్రెడిట్ కార్డు.
ఇప్పుడేమో లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరమే. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగ. ఎవరి ఫోన్లు, డెబిట్ కార్డులు, బాంక్ అకౌంట్లు,
ఫేసుబుక్ అకౌంట్ లు వాళ్లవే.
పిల్లలు వారంలో ఐదారు సార్లు ఫోను చేసినా ఆయనతో మాట్లాడేది తక్కువే. ఎప్పుడైనా ఆయన ఫోను తీస్తే, "ఎలా ఉన్నార్రా?" అంతే. మాటలే ఉండవు. అదే మాకయితే డైలీ సీరియళ్ళే !

మా చిన్న కోడలు ఫోను చేసిందంటే బీబీసీ దగ్గరినించీ అన్ని చానళ్ల న్యూస్ చెప్పాక,
మా బుల్లి మనవడి బొమ్మల టెంటులోకి తీసుకెళ్లి వాడితో మాట్లాడించే లోపు
వాడు "నానమ్మ, బాయ్" అంటాడు. వాడు బాయ్ ఎంత బాగా చెప్తాడో !

మాపెద్ద కోడలైతే వీకెండ్ లోనే మాట్లాడుతుంది,
ఉద్యోగ భారం కారణంగా .
ఈ లోగా మా పెద్దాడు వచ్చి, "అమ్మా, గ్రీన్ కార్డు విషయం ఏంచేశారు?" అంటాడు సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటనలాగ.

"మీ నాన్ననడుగు" అని ఆయన మీదకి తోసేస్తాను.
ఆయనతో ఈ విషయం మాట్లాడ్డానికి వాడికెందుకో
చాలా 'ఇది'.
మా అమ్మాయి అయితే ఈటీవీ జబర్దస్తు లెవెల్లో
జోకులు వేస్తూనే ఉంటుంది. ఈ లోగా మా పెద్ద మనవడు, మనవరాలు వచ్చి, వాళ్ళకొచ్చిన గిఫ్టులు, సర్టిఫికెట్లు చూపించేస్తారు.

“అంతసేపు మాట్లాడ్డానికి ఏముంటాయి?"
అంటారీయన.!
ఈయనకేంతెలుసు, పిల్లల్తో మాట్లాడాక నాకు టానిక్ తాగినట్టుంటుందని ?
మా అబ్బాయిలు "అమ్మా, వచ్చే సమ్మర్ కి మీరు
ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేస్తున్నాం " అంటే
"మీ నాన్న తో చెప్పండి" అని ముక్తాయిస్తా .

వాళ్ళ నాన్నని అడిగితే "మొన్ననే కదరా వచ్చాం"
అంటారని వాళ్లకి తెలుసు.
ఎందుకో రాను రాను అమెరికా ప్రయాణాలు బోరు కొడుతున్నాయి .
అదే చిన్నప్పుడు విమానం శబ్దం వినిపిస్తే చాలు,
బయటికి పరుగెత్తి,
విమానం కనుమరుగయ్యేదాకా చూస్తే ఎంత బాగుండేదో !

అదే ఇప్పుడు .. ఎయిరిండియాలూ, లుఫ్తాన్సాలు,
ఎతిహాద్ లు ఆనట్లేదు.
చిన్నప్పుడు పిల్లల్తో ఎర్ర బస్సెక్కి పుట్టింటికి వెడుతుంటే ...
కిటికీలోంచి ఆ పచ్చటి పొలాలు, కాలువలు, చెట్లు ఎంత అందంగా ఉండేవని !
(అప్పట్లో ఈయన జోకు...
నేను పుట్టింటికెళ్లేటప్పుడు
ఎర్ర బస్సు వికార పెట్టదుట
అదే బస్సు తిరుగు ప్రయాణంలో
ఎంత వికారం పెడుతుం
ఇప్పుడేంటి ?
హాంగ్ కాంగు, దుబాయి, ఫ్రాంక్ ఫర్టు,అబుదాబీలు మామూలుగానే కనిపిస్తున్నాయి?

పుట్టింటినుంచి వచ్చేస్తుంటే అమ్మ కొన్న చుక్కల
కాటన్ చీర ఎంత బాగుండేది !
(ఇప్పటికీ దాచుకున్నా)

ఇప్పుడు ఈయన, పిల్లలు ఎన్ని వేలో పోసి కొన్న పట్టు చీరలు ఎందుకు అంత గ్లామరస్ గా అనిపించట్లేదు?
ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో, ఎన్నెన్నో!

మా చిన్నాడి పెళ్లికి మొదలయిన టీవీ సీరియల్,
"జిగట కాంభోజి రాగాలు" ఇప్పటికీ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతున్నట్టు, ఎప్పటికీ పూర్తి కాదు.

నా ఈ మధ్య తరగతి మనోగతంలోని కొన్నిఅనుభవాలు
మీవే అనిపిస్తే మాత్రం,
ఒక లైక్ వేసుకోండి.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -V.V. Apparao

వింజమూరి -V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

28 Oct
🚩🚩ఒక శిష్యుడికి సందేహం వచ్చి, గురువు గారిని ......
#దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు ....

గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా,
పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం......
#ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .

పాఠం చెప్పడం పూర్తయిన తరువాత,
అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు.
🙏🏿“🙏🏿
కొద్దిసేపటి తరువాత ,
నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు.

నేర్చుకున్నాను గురువుగారు అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు.

శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు
తల అడ్డంగా ఆడించారు .
Read 7 tweets
27 Oct
🚩కుక్కతోక ..!

(నెట్ నుండి ...సేకరణ.)

సుమారు డబ్భై అయిదేళ్ళక్రితం పిచ్చమ్మకు ఆమె మూడో ఏటనే పెళ్ళి

అయింది. పదమూడో ఏడు వచ్చేసరికి ఆమె ఐదోతనం కాస్తా బుగ్గయింది.

ఇహనేం ఆచారం ప్రకారం సకల లాంఛనాలతో ఆమెని విధవను చేసారు.

క్షమించాలి మరీ పచ్చిగా చెప్తున్నందుకు

లాంఛనాలంటే గుండుతో సహా.
ఆపైన ఆమె జీవితం వంటింటికే పరిమితం అయింది.

ఎవరకీ కనపడకూదదు. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా ఉదయం లేవగానే

వారి కళ్ళా బడకూడదు.

అల్లాగే ప్రయాణం చేసేవారికి ఎదురురాకూడదు మరి అపశకునంకదా

ఒకపూటే భోజనం.

రాత్రి విధిగా వుప్పుపిండే ఆహారం.

ఏకాదశులు వుపవాసం

వంటింటి పని ఆమెదే

మడి మడి
తద్దినాలలో వంట ఆమేచెయ్యాలి

భర్తపోయిన ఏయువతినైనా వితంతువు చేసినప్పుడు కర్మ పదోరోజున

ఈమెనే పిలిచేవారు ఆకార్యక్రమ నిర్వహణకు

ఆవితంతువును మంచి ముహూర్తం వచ్చేవరకూ

ఎవరూ చూడరు గనుక, అంతవరకూ ఆమెను ఈమే కనిపెట్టుకొని వుండాలి
** ** **

మా తర్వాత తరం వచ్చేసరికి
Read 6 tweets
27 Oct
🚩🚩సుస్వరాల ‘ఠీవి’ రాజు.🚩🚩
#టి.వి.రాజు పుట్టింది రాజమండ్రి దగ్గరలోని రఘుదేవపురం గ్రామంలో. ఆరేళ్ల ప్రాయంలో తండ్రి చనిపోవడంతో చదువు సాగలేదు. శ్రీనల్లాన్‌ చక్రవర్తుల వద్ద మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకొని, సంగీత పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటకాలు వేసేవారు. కృష్ణుడు, నారదుడు, కనకసేనుడు, భక్తకబీరు, లోహితాస్యుడు వంటి పాత్రల్లో రాణిస్తూ, సురభి కంపెనీకి, అంజనీకుమారి (అంజలీదేవి) నృత్య ప్రదర్శనలకు హార్మోనియం వాయించేవారు.
అలా 1946 వరకు ఆంధ్రా, ఒరిస్సా ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక నాటకాలకు, నృత్య ప్రదర్శనలకు సంగీత సహకార మందించారు. మద్రాసు శోభనాచల స్టూడియోలో రమాజోషి అనే ఆవిడ టి.వి.రాజుకు తెలుసు. ఆ స్టూడియోలో హార్మోనిస్టు ఉద్యోగం ఖాళీ అవడంతో రాజును రమ్మని ఆమె టెలిగ్రాం పంపింది.
Read 14 tweets
27 Oct
🙏🏿🙏🏿ఓం నమో వేంకటేశాయ. 🙏🏿🙏🏿

#అజఅవ్యయస్వభావా శాశ్వతపురాణస్వరూపా గోవిందా గోవిందా.
శ్రీ గురుభ్యోనమః
#పూజ్య ప్రొ. #కుప్పా విశ్వనాథ శర్మ గారు, శ్రీమాన్ #ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనాపాటి గారికి పాదాభి వందనములు.
ఈ రోజు శ్రీమద్భగవద్గీత అధ్యయనం లో మేము గ్రహించినవి,
1. వేదములు ఉపనిషత్తులు మనకు పాఠములు.
శ్రీమద్భగవద్గీత మనకు శిక్షణ ఇస్తుంది, బోధన చేస్తుంది.
జగద్గురువు అగు శ్రీ కృష్ణ పరమాత్మ ముద్దుగా బొధకుడులా బోధించి , ఆచరణలోపం ఉన్నవారిని దండించి సన్మార్గములో నడిపిస్తారు.
2. కఠోపనిషత్తులో ఉన్న కొన్ని మంత్రములను పరమాత్మ 19 మఱియు 20 శ్లోకములలో చిన్న మార్పులతో బోధన చేస్తున్నారు.
ఏ రకమైన ప్రాపంచిక స్వభావం అంటని స్వరూపం ఆత్మ స్వరూపం.
ఆత్మ స్వరూపము సంహరించేవాడు కాడు మరణించే వాడు కాడు.
ఆత్మ స్వరూపము ఎవరినీ చంపదు, చంపబడదు.
Read 6 tweets
27 Oct
🚩🚩నిగమ శర్మ అక్క గారు.🚩🚩

(శ్రీ పాండురంగ మాహాత్మ్యం.. తెనాలి రామకృష్ణ కవి.)

👉🏿తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు అక్షర రూపాన్ని

సంతరించుకున్నాయి.

అలాటి పాత్రలలో #నిగన శప్మ అక్కగారి పాత్ర చిరస్మరణీయం!

తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానమట్టిది.
ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది

పాండురంగ మాహాత్మ్యం..

#నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ.

పరమ నిష్ఠారిష్టుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ

ణోత్తముని కొమరునిగాృనిగమశర్మ యుదయిచయించెను.

వేదాది సర్వ విద్యలను నేర్చెను.ఉపవీతుడైన యనంతరము

వివాహితుడయ్యెను.
విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడెను.

దానివలనృసర్వభ్రష్ఠుడయ్యెను. జూదమాడుట,వ్యభిచరించుట,

పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యయ్యెను.

ఈవ్యసనములకు వలసిన ధనమునకై యింటనే చౌర్యమారంభించెను.

మాన్యములను తెగనమ్మసాగెను."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా

సంచరించుచుండెను.
Read 17 tweets
26 Oct
🚩🚩తనదైన హాస్యానికి చిరునామా -రేలంగి.🚩🚩

#వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై
నవ్వుల నయాగరాలా ఉప్పొంగిన హస్యగంగ రేలంగి.
ఆయన ఏం చేసినా నవ్వొస్తుంది.
నవ్వించటం కోసమే ఏమైనా చేస్తాడు కూడా!
కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన ప్రతిభకున్న అన్ని కోణాలని అద్భుతంగా ఆవిష్కరించారు రేలంగి.
ఆకారంతోను, ఆహార్యంతోనే కాక అభినయంతో సైతం ప్రేక్షకులను తన నవ్వులతో ఊయలఊగించినహాస్యచక్రవర్తిరేలంగి.ఉర్రూతలూగించారు...
#రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో
1910వ సంవత్సరం ఆగస్టు 9న జన్మించాడు. ఆయన తండ్రి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ.. హరికథలు చెప్తుండేవారు.
అందుకే రేలంగి చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడింది.
Read 22 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!