పాఠం చెప్పడం పూర్తయిన తరువాత,
అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు.
🙏🏿“🙏🏿
కొద్దిసేపటి తరువాత ,
నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు.
నేర్చుకున్నాను గురువుగారు అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు.
శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు
తల అడ్డంగా ఆడించారు .
దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.
#శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు.
శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
గురువు గారే మళ్ళీ ఇలా చెప్పారు ......
పుస్తకంలో ఉండే శ్లోకం# స్థూల స్థితి లో ఉంది...
నువ్వు చదివినప్పుడు ......
నీ బుర్ర లోకి అది ##సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది.
అదే స్థితి లో నీ మనస్సులో ఉంది.
అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల
పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి
ఎటువంటి తరుగూ జరగలేదు.
అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి
పూర్ణంగా ఉన్న పరమాత్ముడు #నైవేద్యాన్ని#సూక్ష్మస్థితి లో గ్రహించి,
స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం #ప్రసాదం గా తీసుకుంటున్నాం అని వివరణగా చెప్పారు .
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🚩🚩సుస్వరాల ‘ఠీవి’ రాజు.🚩🚩 #టి.వి.రాజు పుట్టింది రాజమండ్రి దగ్గరలోని రఘుదేవపురం గ్రామంలో. ఆరేళ్ల ప్రాయంలో తండ్రి చనిపోవడంతో చదువు సాగలేదు. శ్రీనల్లాన్ చక్రవర్తుల వద్ద మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకొని, సంగీత పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటకాలు వేసేవారు. కృష్ణుడు, నారదుడు, కనకసేనుడు, భక్తకబీరు, లోహితాస్యుడు వంటి పాత్రల్లో రాణిస్తూ, సురభి కంపెనీకి, అంజనీకుమారి (అంజలీదేవి) నృత్య ప్రదర్శనలకు హార్మోనియం వాయించేవారు.
అలా 1946 వరకు ఆంధ్రా, ఒరిస్సా ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక నాటకాలకు, నృత్య ప్రదర్శనలకు సంగీత సహకార మందించారు. మద్రాసు శోభనాచల స్టూడియోలో రమాజోషి అనే ఆవిడ టి.వి.రాజుకు తెలుసు. ఆ స్టూడియోలో హార్మోనిస్టు ఉద్యోగం ఖాళీ అవడంతో రాజును రమ్మని ఆమె టెలిగ్రాం పంపింది.
#అజఅవ్యయస్వభావా శాశ్వతపురాణస్వరూపా గోవిందా గోవిందా.
శ్రీ గురుభ్యోనమః #పూజ్య ప్రొ. #కుప్పా విశ్వనాథ శర్మ గారు, శ్రీమాన్ #ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనాపాటి గారికి పాదాభి వందనములు.
ఈ రోజు శ్రీమద్భగవద్గీత అధ్యయనం లో మేము గ్రహించినవి,
1. వేదములు ఉపనిషత్తులు మనకు పాఠములు.
శ్రీమద్భగవద్గీత మనకు శిక్షణ ఇస్తుంది, బోధన చేస్తుంది.
జగద్గురువు అగు శ్రీ కృష్ణ పరమాత్మ ముద్దుగా బొధకుడులా బోధించి , ఆచరణలోపం ఉన్నవారిని దండించి సన్మార్గములో నడిపిస్తారు.
2. కఠోపనిషత్తులో ఉన్న కొన్ని మంత్రములను పరమాత్మ 19 మఱియు 20 శ్లోకములలో చిన్న మార్పులతో బోధన చేస్తున్నారు.
ఏ రకమైన ప్రాపంచిక స్వభావం అంటని స్వరూపం ఆత్మ స్వరూపం.
ఆత్మ స్వరూపము సంహరించేవాడు కాడు మరణించే వాడు కాడు.
ఆత్మ స్వరూపము ఎవరినీ చంపదు, చంపబడదు.
#ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను మోగగానే ఆయనకేసి చూశాను జాపుకున్న కాళ్ళకి పతంజలి నూనె రాసుకుంటూ.."పార్వతీ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట, వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు
మావారు శంకర ప్రసాదు గారు.
"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.
"2000ని 74తో గుణించు, రూపాయల్లో వస్తుంది" అన్నారు. విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా "ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి, లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా. "లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి
వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.
చెప్పొద్దూ...అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని. నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .
#వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై
నవ్వుల నయాగరాలా ఉప్పొంగిన హస్యగంగ రేలంగి.
ఆయన ఏం చేసినా నవ్వొస్తుంది.
నవ్వించటం కోసమే ఏమైనా చేస్తాడు కూడా!
కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రతిభకున్న అన్ని కోణాలని అద్భుతంగా ఆవిష్కరించారు రేలంగి.
ఆకారంతోను, ఆహార్యంతోనే కాక అభినయంతో సైతం ప్రేక్షకులను తన నవ్వులతో ఊయలఊగించినహాస్యచక్రవర్తిరేలంగి.ఉర్రూతలూగించారు...
#రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో
1910వ సంవత్సరం ఆగస్టు 9న జన్మించాడు. ఆయన తండ్రి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ.. హరికథలు చెప్తుండేవారు.
అందుకే రేలంగి చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడింది.