🚩🚩సుస్వరాల ‘ఠీవి’ రాజు.🚩🚩 #టి.వి.రాజు పుట్టింది రాజమండ్రి దగ్గరలోని రఘుదేవపురం గ్రామంలో. ఆరేళ్ల ప్రాయంలో తండ్రి చనిపోవడంతో చదువు సాగలేదు. శ్రీనల్లాన్ చక్రవర్తుల వద్ద మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకొని, సంగీత పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటకాలు వేసేవారు. కృష్ణుడు, నారదుడు, కనకసేనుడు, భక్తకబీరు, లోహితాస్యుడు వంటి పాత్రల్లో రాణిస్తూ, సురభి కంపెనీకి, అంజనీకుమారి (అంజలీదేవి) నృత్య ప్రదర్శనలకు హార్మోనియం వాయించేవారు.
అలా 1946 వరకు ఆంధ్రా, ఒరిస్సా ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక నాటకాలకు, నృత్య ప్రదర్శనలకు సంగీత సహకార మందించారు. మద్రాసు శోభనాచల స్టూడియోలో రమాజోషి అనే ఆవిడ టి.వి.రాజుకు తెలుసు. ఆ స్టూడియోలో హార్మోనిస్టు ఉద్యోగం ఖాళీ అవడంతో రాజును రమ్మని ఆమె టెలిగ్రాం పంపింది.
రాజు మద్రాసు చేరడం ఆలస్యమవడంతో ఆ పోస్టు భర్తీ అయిపోయింది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తుంటే సంగీత దర్శకులు నాళం నాగేశ్వరరావు పనిచేస్తున్న ‘చంద్రవంక’ సినిమా యూనిట్‌లో పనిచేసే అవకాశం దొరికింది.
సీనియర్ కాంచన, రఘురామయ్య టి.జి.కమలాదేవి నటించిన ఈ సినిమాకు నాళం నాగేశ్వరరావుతో పాటు ఘంటసాల, కళ్యాణరామన్ కూడా పనిచేశారు. అప్పుడే ఘంటసాలతో రాజుకు పరిచయమయింది.
#టింగు రంగాతో బ్రేకు
ఎన్టీఆర్, యస్వీఆర్‌లతో కలిసి రాజు మాంబళంలో ఉండేవారు. వారి సాయంతో బియ్యే సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశారు. ఆ సమయంలోనే నిర్మాత పి.ఎస్.శేషాచలం సుబ్బారావు దర్శకత్వంలో తెలుగులో ‘టింగు రంగా’ పేరుతో,
తమిళంలో ‘శ్యామల’ పేరుతో సినిమాగా నిర్మిస్తూ టి.వి.రాజును సంగీత దర్శకునిగా నియమించారు. యస్.బి.దినకరరావు రాజుకు సహాయ సహకారం అందించారు. హీరోగా తమిళంలో నాటి ప్రసిద్ధ కర్ణాటక విద్వాంసుడు, సూపర్‌స్టార్ యం.కె.త్యాగరాయ భాగవతార్ హీరో పాత్ర ధరించారు.
అందులో టి.వి.రాజు ‘ఉసేని’ (కరహరప్రియ జన్యం) రాగంలో స్వరపరచిన ‘‘రాజా మహారాజా రవికోటి విభ్రాజ సురలోక భూజా’’ పాటను ఘంటసాల పాడగా, అదే పాటను తమిళంలో ‘‘త్యాగరాయ భాగవతార్ పాడడమే కాదు తెలుగు మాతృకలో టి.వి.రాజు స్వరపరచిన విధానాన్ని కొనియాడారు.
చిత్రానికి టి.రామనాధన్ సంగీతం సమకూర్చారు. ఇదే సినిమాలో ‘‘శ్యామలా.. శ్యామలా.. లోకప్రియా హే శ్యామలా’’ అనే ఘంటసాల పాట కూడా చాలా పాపులర్ అయింది. ఈ పాటకు ప్రభావితమైన ఘంటసాల తన కూతురుకు ‘శ్యామల’ అని పేరు పెట్టారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు.
ఈ సినిమా విడుదలయ్యాక టి.వి.రాజుకు మంచి పేరొచ్చింది. తరవాత ఎన్టీఆర్ స్వంత బ్యానర్ నేషనల్ ఆర్ట్స్ స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ (53) నిర్మిస్తే దానికి సంగీతం టి.వి.రాజు సమకూర్చారు.
ఆ తరవాత వచ్చిన ‘నిరుపేదలు’, ఎన్టీఆర్ సొంత సినిమాలు ‘తోడుదొంగలు’ (1954), ‘జయసింహ’ (1955)కు ఆయనే పనిచేశారు. ఇందులో పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా ‘‘ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి’’ సూపర్‌హిట్‌గా నిలిచి టి.వి.రాజు పేరును పాపులర్ చేసింది.
‘1957లో వచ్చిన ఎన్టీఆర్ సొంత సినిమా ‘పాండురంగ మహత్యం’లో రాజు అందించిన సంగీతం అజరామరమై నిలిచింది. ముఖ్యంగా ‘‘#జయ కృష్ణా ముకుందా మురారీ’’, ‘‘అమ్మా అని అరచినా ఆలకించవేవమ్మా’’, ‘‘కనవేరా మునిరాజ మౌళీ’’, ‘‘తరంతరం నిరంతరం ఈ అందం’’, ‘‘వన్నెల చిన్నెల నెరా’’, ‘‘నేనని నీవని తలచితిరా...
’’ పాటలకు జనం పట్టం కట్టారు. #‘జయ కృష్ణా ముకుందా మురారీ’’ పల్లవి బాణీని త్యాగరాయ భాగవతార్ తన ‘హరిదాస్’ సినిమాలో ఉపయోగించుకోవడం రాజు సంగీత కిరీటంలో ఒక కలికి తురాయిగా మిగిలింది.
టి.వి.రాజు పేరు ఎంతలా ప్రభావితమైనదంటే ఆయన సంగీత దర్శకత్వంలో సినిమా తీస్తున్నామని నిర్మాత చెబితే చాలు ఎన్టీఆర్ కాల్షీట్లు ఇచ్చేవారట. టి.వి.రాజు వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. నిర్మాతగా (స్లీపింగ్ పార్ట్‌నర్) ‘బాలనాగమ్మ’ సినిమా నిర్మించారు. ‘
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#అజఅవ్యయస్వభావా శాశ్వతపురాణస్వరూపా గోవిందా గోవిందా.
శ్రీ గురుభ్యోనమః #పూజ్య ప్రొ. #కుప్పా విశ్వనాథ శర్మ గారు, శ్రీమాన్ #ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనాపాటి గారికి పాదాభి వందనములు.
ఈ రోజు శ్రీమద్భగవద్గీత అధ్యయనం లో మేము గ్రహించినవి,
1. వేదములు ఉపనిషత్తులు మనకు పాఠములు.
శ్రీమద్భగవద్గీత మనకు శిక్షణ ఇస్తుంది, బోధన చేస్తుంది.
జగద్గురువు అగు శ్రీ కృష్ణ పరమాత్మ ముద్దుగా బొధకుడులా బోధించి , ఆచరణలోపం ఉన్నవారిని దండించి సన్మార్గములో నడిపిస్తారు.
2. కఠోపనిషత్తులో ఉన్న కొన్ని మంత్రములను పరమాత్మ 19 మఱియు 20 శ్లోకములలో చిన్న మార్పులతో బోధన చేస్తున్నారు.
ఏ రకమైన ప్రాపంచిక స్వభావం అంటని స్వరూపం ఆత్మ స్వరూపం.
ఆత్మ స్వరూపము సంహరించేవాడు కాడు మరణించే వాడు కాడు.
ఆత్మ స్వరూపము ఎవరినీ చంపదు, చంపబడదు.
#ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను మోగగానే ఆయనకేసి చూశాను జాపుకున్న కాళ్ళకి పతంజలి నూనె రాసుకుంటూ.."పార్వతీ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట, వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు
మావారు శంకర ప్రసాదు గారు.
"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా.
"2000ని 74తో గుణించు, రూపాయల్లో వస్తుంది" అన్నారు. విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా "ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి, లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా. "లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి
వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.
చెప్పొద్దూ...అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని. నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .
#వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై
నవ్వుల నయాగరాలా ఉప్పొంగిన హస్యగంగ రేలంగి.
ఆయన ఏం చేసినా నవ్వొస్తుంది.
నవ్వించటం కోసమే ఏమైనా చేస్తాడు కూడా!
కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రతిభకున్న అన్ని కోణాలని అద్భుతంగా ఆవిష్కరించారు రేలంగి.
ఆకారంతోను, ఆహార్యంతోనే కాక అభినయంతో సైతం ప్రేక్షకులను తన నవ్వులతో ఊయలఊగించినహాస్యచక్రవర్తిరేలంగి.ఉర్రూతలూగించారు...
#రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో
1910వ సంవత్సరం ఆగస్టు 9న జన్మించాడు. ఆయన తండ్రి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ.. హరికథలు చెప్తుండేవారు.
అందుకే రేలంగి చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడింది.