చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశాన్ని అమ్ముతున్నాడంటూ కేసీఆర్ అనుచితంగా మాట్లాడటం దుర్మార్గం. ప్రధాని శ్రీ @narendramodi గారిపై @TelanganaCMO కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ కచరా బుద్ధులు మానుకోవాలి.
(1/11)
ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అంటారు. ఆ తరువాత టెంట్ ఎత్తేస్తారు. హీనమైన, నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కచరాది. తెలంగాణలో కచరాను ఊడ్చేవేస్తాం...అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
(2/11)
దేశం కోసం...ధర్మం కోసం, సమాజం కోసం పరితపించే వ్యక్తి, తల్లి భారత్ ను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించేందుకు సంకల్పం తీసుకున్న మహోన్నత వ్యక్తి @narendramodi.
గౌరవప్రదమైన ప్రధాని మోదీ గారిని అవమానించడం సిగ్గుచేటు.
(3/11)
కేసీఆర్, నీకోసం చాయ్ పే చర్చ కాకుండా.. మందు పే చర్చ పెట్టమంటవా..?
నీ తాగుబోతు వ్యవహారం ప్రజలకు తెలియజేయమంటవా..?
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు బార్లు, పబ్బులే పరిమితమైతయ్. గత ఆరేళ్ల మోదీ పాలనలో ఆర్టికల్ 370 ని రద్దు చేసి భారత్ లో కశ్మీర్ అంతర్భాగమని చాటిచెప్పాం.
(4/11)
సిటిజన్ షిప్ యాక్ట్ ను అమలు చేసి పాక్, బంగ్లా, ఆప్ఘన్ దేశాల్లో మతపీడనకు గురై భారత్ కు వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించింది. ముస్లిం మహిళల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, రైతులకు ఆర్థిక సాయం, మహిళలకు రుణాలు మంజూరు చేశాం.
(5/11)
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటించి దేశ ప్రజలను ఆదుకున్నాం. రామజన్మభూమిలో దివ్యమైన, భవ్యమైన రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ స్వహస్తాలతో అంకురార్పణ చేశారు.
మరి గత ఆరేళ్లలో @trspartyonline ఏం చేసిందో చెప్పాలి.
(6/11)
టీఆర్ఎస్ గత ఎన్నికల మ్యానిఫెస్టో వెబ్‌సైట్‌లో లేకుండా చేసినా మా దగ్గర ఉంది.
30 కోట్ల హిందువుల గురించి మాట్లాడే కేసీఆర్ కు..తెలంగాణలో 80 శాతం మంది హిందువుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు..?
కేసీఆర్ మతవిద్వేషాలు రగిల్చే ఎంఐఎంకు వంతపాడుతూ ఉగ్రవాదులతో సంబంధం నెరుపుతున్నారు.
(7/11)
నా పేరుతో ఫేక్ లెటర్స్ సృష్టించి, నా సంతకాన్ని ఫోర్జరీ చేయించింది సీఎం కేసీఆరే.
స్వయానా ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పి సంతకాన్నే ఫోర్జరీ చేస్తే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల ఆస్తులకు భద్రత ఎలా ఉంటుంది..?
(8/11)
వరద సాయం నిలిపివేతకు కారణమంటూ ఆరోపిస్తున్న కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా.
రేపు మ. 12 గం.లకు భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వస్తా. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు నిజమైన హిందువైతే వచ్చి ప్రమాణం చెయ్. లేకుంటే నీ తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరు.
(9/11)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి మేయర్ పీఠం కట్టబెడితే వరద బాధితులకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తాం.
చలాన్ల పేరుతో ప్రజలను పీడించి వసూలు చేస్తున్న పైసలను జీహెచ్ఎంసీ నుంచే కట్టించే బాధ్యతను మేం తీసుకుంటం.
(10/11)
హైదరాబాద్ ను కాపాడే విషయంలో మీకు సేవ చేసే అవకాశాన్ని బిజెపికి ఇవ్వండి.. నిండు మనసుతో ఆలోచించి మాకు అండగా నిలవండి.
(11/11)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @bandisanjay_bjp

31 Aug
ఎన్నో పోరాటాల ఫలితంగా 1952 ఆగస్టు 31న ప్రభుత్వం సంచార జాతుల్ని విముక్త జాతులుగా ప్రకటించింది. అందుకే ఆ రోజును సంచార జాతుల ప్రజలకు చాలా ప్రత్యేక రోజుగా, నిజమైన స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణిస్తారు.ఈ సందర్భంగా సంచార జాతుల సోదరులకు శుభాకాంక్షలు.
గ్రామీణ సమాజంలో సంచార జాతులది కళాత్మకమైన జీవనశైలి. పల్లెపల్లెలు తిరుగుతూ పొట్ట పోసుకునే సంచార జాతుల్లో చాలా మంది శాశ్వత చిరునామా లేకుండా జీవిస్తుంటారు. పూర్వం సంచార జాతులైన బుడబుక్కల, గంగిరెద్దులు, బాలసంతల వాళ్లు కళల్ని, ధర్మాన్ని, తత్వాల్ని ప్రదర్శించేవారు, ప్రచారం చేసే వారు.
ఒక చోట నుంచి మరోచోటకు సంచరిస్తూ అద్భుతమైన,భావయుక్తమైన సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేవారు.ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి,భాష,సాహిత్యం వాడుకలో ఉంటాయి.సంచార జాతులు తమ కళారూపాల ద్వారా వాటి విస్తృత వ్యాప్తికి కృషి చేశారు.
Read 8 tweets
7 Jul
కెసిఆర్ ఓ తుగ్లక్..ఓ నీరో చక్రవర్తి.
సెక్రెటరీయేట్ కే రానోడికి సెక్రెటరీయేట్ ఏందుకు? ఇదే 500 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేది.చరిత్ర కలిగిన కట్టడం సెక్రెటరీయేట్.
(1/7)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సరిపోయే విధంగా కట్టిన కట్టడాన్ని,కెసిఆర్ పిచ్చి చాదస్తంతో,భూతాలు,ప్రేతాలు పట్టిన మానసిక రోగిలాగా ప్రవర్తిస్తూ,రాత్రికి రాత్రే సెక్రెటరీయేట్ ను కూలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణాలో నిజాం పాలన,నిరంకుశ,నియంతృత్వ పాలన కొనసాగుతోంది.
(2/7)
తెలంగాణ సెక్రెటరీయేట్ ను కూలగొట్టాలని,కెసిఆర్ కేబినేట్ తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైన చర్య.మతిలేని కేబినేట్ నిర్ణయాలవల్ల ఈ రోజు 500 కోట్ల ప్రజా ధనం వృధా అవుతోంది.గతంలో ఉస్మానియా ఆసుపత్రిని కూలగొట్టి,అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ కడతానని మాటిచ్చారు.
(3/7)
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!