1. ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు
(అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టు)
2. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటు
3. రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.
4. దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు
ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి..
కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి