#Thread

మన భారతదేశ చరిత్రను విదేశీ పాలనలో తప్పుల తడకలతో తయారుచేసి మనవారి చేతనే చదివించారు. స్వాతంత్ర్యానంతరం కూడా అదే తప్పుడు చరిత్రను అధ్యయనం చేస్తూ వచ్చాము. కొద్దిమంది విశాల హృదయులైన పాశ్చాత్యులు సవరించి చెబుతున్నా మనవారికి గానీ, ప్రపంచంలోని ఇతర మేధావులకి గానీ తలకెక్కడం లేదు.
మొదటిగా – ఆర్య, ద్రావిడ సిద్ధాంతం లేవదీయడం ఒక చారిత్రకమైన తప్పిదం. దానితో భారతదేశానికి పరాయివారే ఆర్యులై వచ్చారని, వేదాలు వారి రచనలనే దురభిప్రాయాన్ని వాస్తవంగా భ్రమింపజేయగలిగారు. పాశ్చాత్యులు పలికిందే వేదంగా నాడూ నేడూ కూడా భావిస్తున్న మన మేధావులు దానినే నేటికీ చదివిస్తున్నారు.
వలసవాదులైన విదేశస్థులు తమ వలెనె భారతదేశంలోకి ఆర్యులు వచ్చారని అభూత కల్పనా చేసి తృప్తి చెందారు.

అక్కడితో ఆగలేదు – మొదటి మానవ గ్రంథంగా ఋగ్వేదాన్ని’ పేర్కొన్న చరిత్రకారులు ఇతర వేదాలను అనంతర రచనలుగా చిత్రించారు.
సామగానం వంటివి అర్వాచీనాలుగా చూపించి, మనకంటే పూర్వమే సంగీతవిద్య ఇతర నాగరికతలతో ఉన్నట్లుగా భావించారు.

కానీ ఋగ్వేదంలోనే సంగీత సంబంధమైన అంశాలు గోచరించాయి.

వాటి విషయమేమిటి?
ఖగోళ విజ్ఞానంలో, ధాతులోహ నిర్మాణంలో మనదేశపు అత్యంత ప్రాచీనత స్పష్టంగా గోచరిస్తున్నా వాటిని చెప్పకుండా ఏ చైనాయో, గ్రీకో మొదటివిగా చెప్తున్నారు.

ఆర్ధిక శాస్త్ర చర్చలో ఆడం స్మిత్ లాంటి వారిని పేర్కొంటున్న చరిత్రకారులు, మన కౌటిల్యాదుల్ని విస్మరిస్తున్నారు.
వేదాంత శాఖలనుండి, వైదికమైన పునర్జన్మ, ఆత్మ – వంటి విజ్ఞానాల నుండి ఆవిర్భవించి ప్రత్యేక శాఖలుగా ఉనికిని పొందిన బౌద్ధ, జైనాలు కాలగతిలో భారతీయ సంస్కృతిలో ప్రధానాలై పరస్పరాదాన ప్రదానాలతో ఏకమై హిందూధర్మంగా పటిష్టమౌతుంటే ఆ ఐక్యాన్ని తట్టుకోలేక చీలికలను తెచ్చారు.
ఆ ధోరణి నేటికీ క్షుద్ర రాజకీయులు వాడుకుంటున్నారు.

ప్రాంత – వర్గ – మతాది వైషమ్యాలను రాజుకోనేలా చేయడంలో సాఫల్యాన్ని సాధించిన విదేశీ బుద్ధులకు బద్ధులై ఈ దేశపు విశ్వవిద్యాలయాల అధ్యయనాలు సాగుతున్నాయి. అవే ప్రపంచవ్యాప్త విద్యా సంస్థలలో ప్రమాణాలుగా గుర్తింపబడుతున్నాయి.
గణితాది రంగాలలో, నిర్మాణ – జ్యోతిర్విజ్ఞానంలో – వ్యవసాయ రీతుల్లో యుగాల క్రితమే అద్భుతమైన సార్వకాలిక జ్ఞానాన్ని సాధించిన భారతీయ ప్రాచీనతను మరుగున పెట్టే ప్రయత్నాలు జరిగాయి.

ఆసేతుశీతాచలం భిన్నభిన్న ప్రాంతాలలో ఆలయ, దుర్గాది నిర్మాణాల విజ్ఞానం ఘనంగా కీర్తించబడలేదు.
పరిపాలనా విధానాలలోని నాగరిక రీతుల్ని ప్రస్తావించడం లేదు. మన మంత్ర – యంత్ర – తంత్రాలలో కనిపించే వైశ్విక విజ్ఞానం గుర్తించబడలేదు.

వాటికి విద్యా సంస్థల గ్రంథాలలో చోటు కల్పించడం లేదు. పైగా – వాటిని అధ్యయనం చేయబోతే ‘మతవాదం’ పేరుతో అణచడానికి ప్రయత్నిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోని కొందరు మేధావులు పరిశోధించిన ‘సరస్వతీ నాగరికత’పై మనదేశపు పురాతత్త్వ శాఖ శోధించి కొన్ని సత్యాలను వెలికి తీసింది.
కానీ వెంటనే ప్రభుత్వం మారిపోయి, ఆ శాఖ శోధనను మూసివేసింది. కానీ విదేశీయులు కొందరు పూర్తి ఆధారాలతో వైదిక నాగరికత భారతదేశంలోని నైసర్గికమైనదే
కానీ, పరాయివారి భిక్ష కాదని ఋజువు చేస్తూ పుస్తకాలు వ్రాశారు. సరస్వతీ నాగరికతను ప్రస్తావించారు.

సింధునాగరికతతో పాటు ఆనాటికి, అంతకంటే ప్రాచీనంగాను ఎన్నో నాగరికతలు వైదిక నాగరికతా స్వరూపాలుగా బైటపడిన వైనాలను సతార్కికంగా నిరూపిస్తున్నారు.
కానీ ఏదో విపరీతోద్దేశాలను కడుపులో దాచుకున్న విశ్వవిద్యాలయాలు, రాజకీయాలు వాటిని మనవారి చేత అధ్యయనం చేయనివ్వడం లేదు.

మన సంస్కృతిపై ప్రాచీనతపై అగౌరవం కలిగే విధంగానే నేటికీ విద్యాసంస్థలు తప్పుడు పాఠాలు చదివిస్తున్నాయి.
కనీసం – ఈ కొత్త పరిశోధనల ద్వారా తేలిన మన దేశ ఔన్నత్యాన్ని ‘మరికొందరి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి’ అనియైనా పేర్కొనడం లేదు.

కాలం మీద జరుగుతున్న అన్ని పరిశోధనలను చెప్పవలసిన బాధ్యత నాగరిక మానవ సమాజంపై ఉంది.

ఆ బాధ్యత గుర్తించడం లేదు.
మన పౌరులకు మన దేశంపై, మన ధర్మంపై ఆత్మాభిమానం కలిగే విధంగా తగిన చర్యలు తీసుకోవడం లేదు.

ఇటీవల ఒక యూరప్ దేశంలో జరిగిన మత, నాగరికత సదస్సులో హిందూధర్మంపై, మనదేశ చరిత్రపై మనవారు సమర్పించిన పత్రాలలోనే ఎంతో అవహేళన, దురవగాహన కనబడింది...
దానికి ఒక విదేశీయుడు చింతిస్తూ పెద్ద వ్యాసాన్ని ఒక పత్రికలో వ్రాశాడు.

ఇంత వైపరీత్యం జరుగుతున్నా, రాజకీయ నాయకుల చలువవల్ల ఛిన్నాభిన్నమైన మన మేధావులు మేల్కొనడం లేదు.

భారత సత్యచరిత్ర నేటికైనా రూపుదిద్దుకోకపోతే అది శాశ్వతంగా అసత్యాన్ని ప్రతిష్ఠించినట్లే.
కొన్ని దశాబ్దాల క్రితం మన చరిత్రను ఖగోళాది విజ్ఞానాల సమన్వయంతో ఆంగ్లంలోనే శ్రీ కోట వెంకటాచలం వంటి మేధావులు వ్రాశారు.

కనీసం ‘ఇలా ఒక వ్యక్తి అభిప్రాయ పడ్డారు’ అనియైనా, మన పాఠ్యాంశాలలో ఆ యదార్దాలను ఉటంకించలేదు.
విద్యా సంస్థలకు దూరంగా జరుగుతున్న పరిశోధనలను, స్వచ్ఛంద సంస్థలు, దేశభక్తులు అధ్యయనం చేసి మాధ్యమాల ద్వారానో, విడిగా సదస్సుల ద్వారానో నేటి తరానికి అందించే బాధ్యతను చేపట్టాలి. ప్రజలలో, ప్రభుత్వాలలో చైతన్యాన్ని ఉద్దీపనం చేయాలి.

Editorial by @SriSamavedam garu in Rushipeetham magazine

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Brahmasri Samavedam Shanmukha Sarma

Brahmasri Samavedam Shanmukha Sarma Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SriSamavedam

24 Dec 20
20 Eternal Values from Bhagavad Gita - #Thread

Sri Krishna expounded the entire gamut of spirituality in Srimad Bhagavad Gita as

Karma Yoga,
Bhakti Yoga and
Jnana Yoga.

The very fact that this has been elucidated in the middle of the battlefield demonstrates that these...
eternal values are required for those who are active in life & want to achieve success. Without complete comprehension & practice of these values, one’s spiritual practice is hollow & non-holistic.

Sri Ramakrishna Paramahamsa once told, ‘The Brahman
narrated in Upanishads,...
the Atma described by the Vedantins (philosophers), the Supreme God defined by the devotees & the Kali I worship are one & the same.’

अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः॥ १३-८॥

1. amānitvaṁ – Humility without the sense of I & my.
Read 37 tweets
18 Dec 20
The distinction of measuring the time in a scientific manner is achieved only by Bhāratīyas. Time has been measured from the smallest dimension to infiniteness. Even Time is envisioned as God and venerated. Paramēśvara was extolled as ‘Mahākāla’, the very embodiment of Time.
Nārāyaṇa Upaniṣad envisages Nārāyaṇa as ‘Kālaśca Nārāyaṇa:’, the very embodiment of Time, ages ago. The measurement of Time by Bhāratīyas is as ancient as the very God Himself. Count of many future ages has also been done even from very ancient times.
Since these calculations aren't dependent upon the birth & death of any individual, but are done based on astronomical science, they are thoroughly scientific. Unfortunately, during the British rule, the Bhāratīya way of Time measurement was casted as an illusion...
Read 32 tweets
8 Dec 20
Nakṣatra Vijñānaṁ (#Thread)

Bhāratadēśa Jyōtirvijñānaṁ:

The science and knowledge about stars have been part of astrology since ages, which has its spread not only all over Bhāratadēśa, but also across the world.
There is No dispute that Vēdic Astrology is the basis for many other forms currently prevalent in other parts of the world because of the presence of many common aspects. Even historical evidences prove the veracity and ancientness of Bhāratadēśa Jyōtirvijñānaṁ beyond any doubt.
Jyōtiṣa is Vēdānga :

Jyōtiṣa is one among the Ṣaḍangās of Vēda, the other five being Śikṣa, Vyākarana, Candassu, Nirukta, and Kalpa. Many mantras related to stars are seen in Vēdās such as the mention of ‘Śaptaviśati Nakṣatrāni’ i.e. 27 stars.
Read 28 tweets
1 Nov 20
The indwelling Sapta Mātr̥ukās in us (#Thread)

Vēdās, Āgamās & Purāṇās envisioned the great energy orchestrating this entire universe as the ‘Mother of the Universe’, unfolded the different forms of the same from different viewpoints & stipulated methods of worship accordingly.
Dēvī Māhatmyam narrated that at the time Divine Mother was vanquishing the demons Śumbha, Niśumbha &
others, the power of Brahma & other Gods also emanated out & took diff forms to kill the demons.

The energy of Brahma is Brāhmi;
Viṣṇu is Vaiṣṇavi;
Mahēśwara is Mahēśwari;
Skanda is Kaumāri
Yajña Vārāhaswāmi is Vārāhi
Indra is Aindri

The energy of Time that emanated from the center of
Divine Mother’s eyebrows that is ‘Kāli’ - Cāmunḍā;

Abov r called Sapta Mātr̥ukās. All these are 7 diff
types of super energies that conduct this entire universe.
Read 16 tweets
29 Oct 20
How to Remove the Negatives within us ? (#Thread )

Śrī Lalitā Sahasranāma Stōtra is a treasure trove of invaluable gems. However, the devout reading of entire stōtra bestows everything here and hereafter, clusters of some nāmās yields highly potential and specific benefits.
Below's 1such cluster of 17 nāmās, when recited with concentration & devotion, removes the 17 dōṣas present within. All these words contain the ‘Ni’ Upasarga.

नीरागा रागमथनी निर्मदा मदनाशिनी ॥
निश्चिन्ता निरहंकारा निर्मोहा मोहनाशिनी ।
निर्ममा ममताहन्त्री निष्पापा पापनाशिनी ॥
निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी ।
निस्संशया संशयघ्नी निर्भवा भवनाशिनी ॥

निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी ।
निर्नाशा मृत्युमथनी निष्क्रिया निष्परिग्रहा ॥

The 17 dōṣas present within

1. rāgā – Attachment
2. mada – Haughtiness
3. cinta – Worry
4. ahaṅkāra – Ego
Read 13 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!