🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?*
#తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు..
*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
*మరి అసలైన " సామజవరగమన " ఎవరు ??*...
అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..". వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ...
వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో ' సామజవరగమన ' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు ..
చాలా మంది " సామజవరగమన " అంటూ పాడేస్తున్నారు .... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో తెలీదు ... వారికి చెప్పేందుకైనా " సామజవరగమన " , దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం.
..
🛑 *సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥*
*సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥*
*వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।*
*స్వీకృత యాదవకులమురళీ !*
*గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥*
.ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది
. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది ... కీర్తన అర్థం ... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో , మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరీ! నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చే కొనియాడ బడతావు ..
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది .. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే , గుణమునకు , దయకు ఉదాహరణ నీవే .. నన్ను కూడా నీవే నడిపించాలి!....
సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ .. గోవులని రక్షిస్తూ .. మురళి గానంతో అందరిని ఆనంద పరుస్తూ ..ఈ త్యాగరాజ వందనములను అందుకో! ..

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -బాషా భారతి .V.V. Apparao

వింజమూరి -బాషా భారతి .V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

4 Feb
🔻వివేకచూడామణి -(4 వ భాగం ) !
-
#శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
-
4. ఆధారం – వస్తుతత్త్వం :
ఈ మారుతున్న జగత్తు వెనుక, మారని ఆధారం, మారని సత్యం మనం గ్రహించగలిగితే, అప్పుడే మనం నిజాన్ని గ్రహించామని చెప్పవచ్చు.
ఆ సత్యం తెలుసుకోనంతవరకు, మన జ్ఞానం నిజమైనది కాదని, భ్రమకు లోనైనదని చెప్పవచ్చు.
ఈ మార్పుల వెనుక ఉన్న సత్యం ఎటువంటిది అన్నది తెలుసుకోవాలి.
ఒక వస్తువు ఒక చోట, ఒక కాలంలో ఒక రూపంలో ఒక పేరుతో ఉండి, వేరొక చోట మరొక కాలంలో ఇంకొక రూపంలో వేరొక పేరుతో ఉంటే అందులో మార్పు జరిగిందన్నమాట. కాని వస్తుతత్త్వంలో మార్పు లేదు. కేవలం నామ, రూపంలోనే మార్పు వచ్చింది.
Read 12 tweets
3 Feb
🌹🌺కుమార సంభవము-మహాకవి కాళిదాసు.🌺🌹
💥💥
#కుమారసంభవం కవికుల గురువుగా ప్రసిద్ధి పొందిన మహాకవు కాళిదాసుచే రచింపబడి ప్రసిద్ధి పొందిన కావ్యము.
తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము, కుమార స్వామి జననం ముఖ్యమైనవి.
దక్షుడు యజ్ఞము చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికిఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రమే ఆహ్వానం పంపడు. దీనికి బాధ పడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది.
దానికి పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళడం సముచితం కాదని సతీదేవిని వారిస్తాడు. కాని తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న గాఢమైన కోరిక కలిగిన సతీదేవి వెళతానని పట్టుబడుతుంది. చివరికి భార్య మాట కాదనలేక పరమేశ్వరుడు ప్రమథగణాలను తోడిచ్చి దక్షుని యజ్ఞానికి సతీదేవిని పంపుతాడు .
-
Read 8 tweets
2 Feb
🔻భాగవతము -- పోతన-ప్రహల్లాదుడు !🔻
-
"#మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు
లలితా రసాల పల్లవ ఖాదియైచోక్కు కోయిల సేరునే? కుటజములకు
బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు "!
.
"#అంబుజోదర దివ్య పాదారవింద
చింతనా మృత పాన విశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?
వినుత గుణసీల ! మాటలు వేయునేల ?"
.
ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది.
ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .
భగవంతుడే తప్ప మరో ఆలోచన లేని మనస్సుకి ఇంకొకరు చెప్పడం వినడం ఉండదని., పోతన అభిప్రాయం .అతనూ ఆకోవకు చెడిన వాడే కదా !
.
తన అభిప్రాయాని భక్తుడయిన బాలకుని చే చెప్పించాడు.వృద్యంగా తను చెప్పదలచుకున్నది . ఒకరడిన ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నలే గుప్పించడం
Read 6 tweets
2 Feb
వివేకచూడామణి- (3వ భాగం)!
-
#శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- Image
3. మార్పు – ఆధారం :
మార్పును తెలుసుకోవటానికి ఒక మారని వస్తువు ఆధారంగా, ప్రమాణంగా ఉండాలి. నిన్న ఒక చోట చూసిన చెట్టు, నేడు అక్కడ లేకపోతే ఆ మార్పును గ్రహించగలం. ‘నిన్న అక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడ?’ అనే ప్రశ్న పుడుతుంది.
‘ఇక్కడే ఆ పెద్ద భవనం ముందు, ఈ దారికి ఇటువైపు’ అని చెప్తాం. అట్లా చెప్పటంలో మనం మనకు తెలియకుండానే, కొన్ని మారని వస్తువులను ఆధారంగా తీసుకుని, మారిన పరిస్థితిని గ్రహించాము. ‘ఇక్కడ’ అనే స్థలనిర్ణయానికు, నిన్న, ఈ రోజు మారకుండ ఉన్న ఆ భవనం, ఆ దారి ఆధారంగా చేసుకున్నాం అన్నమాట.
Read 23 tweets
1 Feb
🚩వివేకచూడామణి !👌🏿
#శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- Image
కాలం, దేశం, కారణం :
ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు.
ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది.
Read 10 tweets
8 Nov 20
🚩🚩లటక్కన పెగ్గేసి -చటుక్కున మూతి తుడుచుకుంటాం!🚩🚩
-
#పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!
.
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!