🔻వివేకచూడామణి -(4 వ భాగం ) !
- #శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
-
4. ఆధారం – వస్తుతత్త్వం :
ఈ మారుతున్న జగత్తు వెనుక, మారని ఆధారం, మారని సత్యం మనం గ్రహించగలిగితే, అప్పుడే మనం నిజాన్ని గ్రహించామని చెప్పవచ్చు.
ఆ సత్యం తెలుసుకోనంతవరకు, మన జ్ఞానం నిజమైనది కాదని, భ్రమకు లోనైనదని చెప్పవచ్చు.
ఈ మార్పుల వెనుక ఉన్న సత్యం ఎటువంటిది అన్నది తెలుసుకోవాలి.
ఒక వస్తువు ఒక చోట, ఒక కాలంలో ఒక రూపంలో ఒక పేరుతో ఉండి, వేరొక చోట మరొక కాలంలో ఇంకొక రూపంలో వేరొక పేరుతో ఉంటే అందులో మార్పు జరిగిందన్నమాట. కాని వస్తుతత్త్వంలో మార్పు లేదు. కేవలం నామ, రూపంలోనే మార్పు వచ్చింది.
ఆ మార్పు దేశ, కాలాల పరిధిలో జరిగింది.
ఒక ఇల్లాలు తన పెళ్ళికి ముందు తన పుట్టింటివారు పెట్టిన రెండు జతల బంగారపు గాజులును పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తరువాత, వాటిని చేరిపించి, పుస్తెల నానుగా చేయించుకుంది.
ఆమె తిరిగి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి ‘నీ బంగారపు గాజులు ఏవి?’ అని అడిగినప్పుడు పుస్తెలనాను చూపించి ‘ఇవిగో, అవే ఇది’ అని చెప్తుంది. ‘అవి’ బహువచనం. ‘ఇది’ ఏకవచనం. గాజుల రూపం వేరు, పేరు వేరు. పుస్తెల నామరూపం వేరు, పేరు వేరు.
అట్లాంటి సందర్భంలో ‘అవే ఇది’ అనటంలో ఔచిత్యం ఏమున్నది? ‘అవే ఇది’ అనే మాటలో గాజులలో ఉన్న వస్తుతత్వమే, వాటిలోని బంగారమే పుస్తెల నానులో కూడ ఉన్నదని భావం. నామరూపాలు మారినా వస్తుతత్త్వంలో మార్పు లేదు కాబట్టి విచారించ వలసిన పనిలేదు అని తల్లికి ధైర్యం చెప్పిందని భావం.
నగలు వేరువేరైనా బంగారం అంతా ఒకటే.
కుండలు, గోళాలు, వేరువేరైనా వాటిలో వస్తుతత్త్వం అయిన మట్టి అంతా ఒక్కటే.
కర్ర వస్తువులు (Furniture) వేరువేరైనా, వాటి అన్నిటిలో ఉన్నది కలప మాత్రమే.
మనం ప్రతి వస్తువులో దానికి నామ, రూపాలు సమకూర్చిన వస్తుతత్వాన్ని గురించి, తెలుసుకోవటం మొదలుపెడితే అప్పుడు కనిపిస్తున్నంత వివిధత్వం కనిపించదు, ఆ వస్తువులలో మనం ఏర్పరచుకున్న విలువలలో కొంత
మార్పు వస్తుంది
. వాటిలో మనం ఏర్పరచుకున్న మమకారంలో కొంత మార్పు వస్తుంది. మనం మన వస్తువులలో (అవి విలువైనవి కాకపోయినా) మనం ఏర్పరచుకున్న గర్వం, పరులకున్న వస్తువులలో (అవి కూడ విలువలేనివే అయినా), మనం ఏర్పరచుకునే ఈర్ష్యాభావంలో, చాలావరకు తరుగుదల కనిపిస్తుంది.
ఈ మమకారాలు, ఈ గర్వాలు, ఈ ఈర్ష్యలు, ఈ వస్తువులు సమకూర్చుకోవటంలోని తాపత్రయం ఇవే కదా జీవితం. ఇవి లేకపోతే జీవితంలో ఆనందం (Thrill) ఎలా ఉంటుంది? అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇదే ఆనందం అనుకోవటం ఒక భ్రమ. ఆ మిథ్యానందం కోసం నిజాన్ని కప్పిపుచ్చి భ్రమలో పడిపోనక్కరలేదు.
నిజం గ్రహిస్తూనే ఆనందం పొందవచ్చు. అసలు నిజం తెలుసుకోవటంలో ఉన్న ఆనందం భ్రమలో ఉండదు. కాని నిజాన్ని మరచిపోరాదు.
చిన్నపిల్లలు గల ఇంట్లో, పెద్దవారు కూడ చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లలలాగనే పాలకోసం ఏడుస్తూ, అన్నం పెట్టమని అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు.
ఆ దుఃఖములో, ఆ మారాం చేయటంలో వారికి ఆనందమే కలుగుతుంది. ఎట్లా అంటే, అది వట్టి ఆట మాత్రమే అని, ఆ పెద్దవారికి తెలుసు, పిల్లలకి కూడ తెలుసు.. అట్లాకాక, ఆట అయిపోయిన తరువాత కూడా, పెద్దవారు చిన్న పిల్లలుగా ప్రవర్తిస్తే, వారికి మతి స్థిమితం పోయిందని మనం చెప్పవచ్చు.
-
(ఇంకా వుంది )-
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?* #తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు..
*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
*మరి అసలైన " సామజవరగమన " ఎవరు ??*...
అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..". వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ...
🌹🌺కుమార సంభవము-మహాకవి కాళిదాసు.🌺🌹
💥💥 #కుమారసంభవం కవికుల గురువుగా ప్రసిద్ధి పొందిన మహాకవు కాళిదాసుచే రచింపబడి ప్రసిద్ధి పొందిన కావ్యము.
తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము, కుమార స్వామి జననం ముఖ్యమైనవి.
దక్షుడు యజ్ఞము చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికిఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రమే ఆహ్వానం పంపడు. దీనికి బాధ పడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది.
దానికి పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళడం సముచితం కాదని సతీదేవిని వారిస్తాడు. కాని తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న గాఢమైన కోరిక కలిగిన సతీదేవి వెళతానని పట్టుబడుతుంది. చివరికి భార్య మాట కాదనలేక పరమేశ్వరుడు ప్రమథగణాలను తోడిచ్చి దక్షుని యజ్ఞానికి సతీదేవిని పంపుతాడు .
-
"#అంబుజోదర దివ్య పాదారవింద
చింతనా మృత పాన విశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?
వినుత గుణసీల ! మాటలు వేయునేల ?"
.
ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది.
ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .
భగవంతుడే తప్ప మరో ఆలోచన లేని మనస్సుకి ఇంకొకరు చెప్పడం వినడం ఉండదని., పోతన అభిప్రాయం .అతనూ ఆకోవకు చెడిన వాడే కదా !
.
తన అభిప్రాయాని భక్తుడయిన బాలకుని చే చెప్పించాడు.వృద్యంగా తను చెప్పదలచుకున్నది . ఒకరడిన ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నలే గుప్పించడం
వివేకచూడామణి- (3వ భాగం)!
- #శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
-
3. మార్పు – ఆధారం :
మార్పును తెలుసుకోవటానికి ఒక మారని వస్తువు ఆధారంగా, ప్రమాణంగా ఉండాలి. నిన్న ఒక చోట చూసిన చెట్టు, నేడు అక్కడ లేకపోతే ఆ మార్పును గ్రహించగలం. ‘నిన్న అక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడ?’ అనే ప్రశ్న పుడుతుంది.
‘ఇక్కడే ఆ పెద్ద భవనం ముందు, ఈ దారికి ఇటువైపు’ అని చెప్తాం. అట్లా చెప్పటంలో మనం మనకు తెలియకుండానే, కొన్ని మారని వస్తువులను ఆధారంగా తీసుకుని, మారిన పరిస్థితిని గ్రహించాము. ‘ఇక్కడ’ అనే స్థలనిర్ణయానికు, నిన్న, ఈ రోజు మారకుండ ఉన్న ఆ భవనం, ఆ దారి ఆధారంగా చేసుకున్నాం అన్నమాట.
🚩వివేకచూడామణి !👌🏿 #శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
-
కాలం, దేశం, కారణం :
ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు.
ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది.
🚩🚩లటక్కన పెగ్గేసి -చటుక్కున మూతి తుడుచుకుంటాం!🚩🚩
- #పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!
.