వివేకచూడామణి- (3వ భాగం)!
-
#శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- Image
3. మార్పు – ఆధారం :
మార్పును తెలుసుకోవటానికి ఒక మారని వస్తువు ఆధారంగా, ప్రమాణంగా ఉండాలి. నిన్న ఒక చోట చూసిన చెట్టు, నేడు అక్కడ లేకపోతే ఆ మార్పును గ్రహించగలం. ‘నిన్న అక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడ?’ అనే ప్రశ్న పుడుతుంది.
‘ఇక్కడే ఆ పెద్ద భవనం ముందు, ఈ దారికి ఇటువైపు’ అని చెప్తాం. అట్లా చెప్పటంలో మనం మనకు తెలియకుండానే, కొన్ని మారని వస్తువులను ఆధారంగా తీసుకుని, మారిన పరిస్థితిని గ్రహించాము. ‘ఇక్కడ’ అనే స్థలనిర్ణయానికు, నిన్న, ఈ రోజు మారకుండ ఉన్న ఆ భవనం, ఆ దారి ఆధారంగా చేసుకున్నాం అన్నమాట.
ఇట్లా కాక, తెల్లవారిన తరువాత, ఆ భవనం, ఆ దారి కూడా లేకపోతే? అప్పుడు ‘ఇక్కడ’ అని నిర్దేశించటానికి ఏమి ఉంటుంది? దేనితో పోల్చి ఏది మారిందని నిర్ణయిస్తాం?
ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయించటానికి, ఏదో ఒక ఆధారరేఖ, స్థిరంగా ఉండేది – (Fixed Base Line) ఉండాలి.
ఈ విధంగానే, ఒక ప్రత్యేక సమయాన్ని నిర్ణయించటానికి, ఒక నిర్దిష్టమైన సన్నివేశం ఆధారంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆధారాలు ఎప్పటికీ మారనివిగా ఉండాలి.
స్థలానికి (Space) అది ఎక్కడ?
కాలానికి (Time) అది ఎక్కడ?
కారణానికి – మూలకారణమేది?
ఒక వస్తువుకు మరొక వస్తువుకు మధ్య అంతరం స్థలం (దేశం) కాని, వస్తువులే లేని చోట స్థలనిర్ణయం ఎట్లా చేయగలం? ఎట్లాంటి సంకేతాలు (Distinguishable points) లేని మహా ఎడారిలో మనం దూరాన్ని ఎలా కొలవగలం? ఒక చోట బయలుదేరి 100 అడుగులు వేసి ‘నేను 100 అడుగుల దూరంలో ఉన్నాను’ అని మనం అనవచ్చు
. కాని ‘ఎక్కడ నుంచి’ అని ప్రశ్నించేసరికి, మనం బయలుదేరిన బిందువు ఎక్కడున్నదో చెప్పలేం. మనం ఎక్కడున్నా చుట్టూ కనుచూపు మేర వరకు ఎడారే – ఎంత దూరం నడిచినా ఎడారిలోనే ఉంటాం. ఆకాశం మేఘావృతమై, సూర్యుడుగాని, చంద్రుడుగాని నక్షత్రాలుగాని కనిపించనప్పుడు మనం దిక్కులు కూడా మరచిపోతాం.
తూర్పుకు పోవటానికి బదులు ఉత్తరానికి వెళ్తాం. (ఈ విధంగా దారి మరచిపోటానికి ఎడారులే అక్కరలేదు. పెద్ద పెద్ద పట్టణాలలో కూడా, ఒకేరకమైన భవనాలున్న ప్రాంతాలలో కూడా మనం స్థలనిర్ణయం చేయలేం). ఎందుకంటే అంతా ఒకే వస్తువు. విభిన్నత్వం లేని ఒకే వస్తువు. విభిన్నత్వం లేని చోట ‘స్థలం’ అర్థం లేదు.
-
ఇక కాలం – రెండు సంఘటనల మధ్య అంతరాన్ని కాలం అంటున్నాం. ఈ రోజు సూర్యోదయం మొదలుకుని, మరునాడు సూర్యోదయం వరకు మధ్య గల అంతరాన్ని ‘ఒక రోజు’ అంటున్నాం. దానినే గంటలలో,నిముషాలలో, సెకనులలో భాగించాం. ఆ రోజును ఆధారంగా చేసుకునే నెలలు, సంవత్సరాలు, యుగాలు మొదలైనవి నిర్ణయిస్తున్నాం.
కాని సంఘటనలతో ప్రమేయంలేని ‘శుద్ధకాలము’ (Independent Absolute Time) అన్నది ఉన్నదా? అని ప్రశ్నిస్తే, అలాంటి కాలం లేదనే చెప్పాలి. సంఘటనలు ఈ దృశ్యప్రపంచంలోనే వీలవుతాయి. దీనికి వేరైన, విభిన్నత్వం లేని, సంఘటనలు లేని చోట కాలం ఉంటుందా?
గాఢనిద్రలో విభిన్నత్వం లేదు, సంఘటనలు లేవు, కాలం లేదు. ఎదో ఒక దాన్ని గురించి దీర్ఘంగా ఏకాగ్రతతో ఆలోచించే వారికి కూడ, భిన్నత్వం లేకుండటం వల్ల కాలగతి తెలియదు. అంటే కాలం నిలిచిపోతుంది. మనం కాలాన్ని గంటలు, నిమిషాలు అని విభజించాం కాని, కాలపరిమితి అందరికీ ఒక్కలాగ ఉండదు.
ఎన్నో రోజుల తరువాత కలుసుకున్న ప్రేమికులకు గంటలు నిమిషాలలాగా గడిచిపోతాయి. ప్రియుడిని బాసిన ప్రేయసికి, ప్రతి నిముషం ఒక యుగంగా అనిపిస్తంది. చలన చిత్రాన్ని చూసేటప్పుడు కాలానికి ఉన్న వేగం పాఠ్య పుస్తకాలు చదివేటప్పుడు ఉండదు.
ఏకాగ్రతలో, ఆనందానుభవంలో గడియారాలు చూపించే కాలం పరుగెత్తినట్లు అనిపిస్తుంది, నిరీక్షణలో, దుఃఖానుభవంలో గడియారాలు చూపించే కాలం కదలనట్లు అనిపిస్తుంది. కాలం ఊహ మాత్రం, మనోకల్పితం. దానికి స్థిరత్వంగాని, అస్థిరత్వంగాని లేదు.
-
మార్పులు జరుగుతున్నా ఈ ప్రపంచంలో ఆ మార్పులను గ్రహించి, నిర్దేశించగల మారని ఆధారం ఒకటి ఉండాలని చెప్పుకున్నాం. అట్లా కాక మారుతున్న ఆధారం మీద ఉండి, మరొక మారుతున్న వస్తువును చూస్తుంటే కలిగే జ్ఞానం నిజమైనది కాదు – అది మిథ్యా జ్ఞానం.
మనం కదులుతున్న ఒక రైలుబండిలో కూర్చుని, అదే వేగంతో మన పక్క లైనుమీద మనం వెళ్తున్నవైపే వెళ్తున్న మరొక రైలుబండిని చూస్తే, అది కదులుతున్నట్లే ఉండదు. అందులోని ప్రయాణీకులతో మాట్లాడవచ్చు, చేతులు కలపవచ్చు. ఒక బండినుంచి మరొక బండిలోకి మారవచ్చు.
ఏ కారణం వల్లనైనా మన బండి ఒకేసారి ఆగిపోతే, మన పక్కనున్న బండి మహావేగంతో ముందుకు వెళ్తున్నట్లు కనబడుతుంది, లేదా మనం కూర్చున్న బండి మహావేగంతో వెనకకు పోతున్నట్లు కనబడవచ్చు.
మన బండి వేగంగా ముందుకు వెళ్తున్నా, మన పక్క లైనుమీద ఉన్న బండి మనకన్నా వేగంగా మనం వెళ్తున్న వైపుకు వెళ్తుంటే, ఆ బండినే చూస్తున్న మనకు, మన బండి వేగంగా ముందుకు పోయే బదులు నెమ్మదిగా వెనుకకు పోతున్నట్లు అనిపిస్తుంది.
ఈ అనుభూతి ఎంత సహజంగా ఉంటుందంటే, మన బండిలోని ప్రయాణీకులందరూ, ముందుకు పోవలసిన బండి వెనుకకు ఎందుకు పోతున్నదని భ్రాంతి చెందుతారు. ఇంతలో మన ప్రక్కన ఉన్న బండి మన బండిని దాటుకుంటూ ముందుకు పోయి ఆఖరి పెట్టె కూడా మనని దాటిపోయి, లైను పక్కన ఉన్న చెట్లు కనిపించగానే,
అప్పటి వరకు వెనుకకు పోతున్నట్లు అనుభూతి కలిగించిన బండి ఒక్క కుదుపుతో ముందుకు మహావేగంగా పోతున్నట్లు తెలుస్తుంది. మన మనసులో ఆ ‘కుదుపు’ కూడా అనుభవానికి వస్తుంది.
రెండు లైన్ల పక్కన భూమి మీద కదలకుండా నిలబడి రెండు బండ్లను చూస్తున్న వ్యక్తికి, ఈ రెండు షరా వేగంతో ఒక దానిని ఒకటి దాటుకుంటూ వెళ్ళిపోవటం కనిపిస్తుంది. ఇందులో ఏది సత్యం? ఎవరి అబుభవం నిజమైనది? భూమిమీద కదలకుండా నిలబడి రెండు బండ్లను చూసినవాడి అనుభవమే నిజమని మనం చెప్పగలం.
కాని, బండిలోనే కూర్చుని, మన కళ్ళతో మనం చూసి, ఏర్పరచుకున్న అనుభవం? అది అసత్యమా!
తాము చూసినదే నిజమని నమ్మేవారికి, అది నిజంగానే తోచుతుంది. వారి అనుభవానికి వేరైన నిజం ఇంకొకటి ఉన్నదని చెప్పినా వారు గ్రహించలేరు, గ్రహించటానికి ప్రయత్నించరు.
కాని ఆ విధంగా ప్రయత్నించి, ఏది నిజమో తెలుసుకునేవారికి, తార్కికంగా ఆలోచించటం వల్ల అందులోని నిజానిజాలు తెలుసుకోగలరు. నిజం తెలిసిన తరువాత తన అనుభూతి వెనుకకు పోతున్నట్లు చెప్తున్నా, తన విచక్షణా జ్ఞానం తాను ముందుకే వేగంగా పోతున్న సత్యం చెప్తుంటుంది.
అందువల్ల నిజం తెలుసుకోలేని మిగిలిన ప్రయాణీకులు ఆందోళనపడినట్లు, తాను ఆందోళన చెందక నిశ్చితంగా ఉంటారు. మిగిలినవారి అజ్ఞానానికి తనలో తానే నవ్వుకుంటారు.
(ఇంకావుంది) Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -బాషా భారతి .V.V. Apparao

వింజమూరి -బాషా భారతి .V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

4 Feb
🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?*
#తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు.. Image
*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
*మరి అసలైన " సామజవరగమన " ఎవరు ??*...
అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..". వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ...
Read 7 tweets
4 Feb
🔻వివేకచూడామణి -(4 వ భాగం ) !
-
#శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- Image
4. ఆధారం – వస్తుతత్త్వం :
ఈ మారుతున్న జగత్తు వెనుక, మారని ఆధారం, మారని సత్యం మనం గ్రహించగలిగితే, అప్పుడే మనం నిజాన్ని గ్రహించామని చెప్పవచ్చు.
ఆ సత్యం తెలుసుకోనంతవరకు, మన జ్ఞానం నిజమైనది కాదని, భ్రమకు లోనైనదని చెప్పవచ్చు.
ఈ మార్పుల వెనుక ఉన్న సత్యం ఎటువంటిది అన్నది తెలుసుకోవాలి.
ఒక వస్తువు ఒక చోట, ఒక కాలంలో ఒక రూపంలో ఒక పేరుతో ఉండి, వేరొక చోట మరొక కాలంలో ఇంకొక రూపంలో వేరొక పేరుతో ఉంటే అందులో మార్పు జరిగిందన్నమాట. కాని వస్తుతత్త్వంలో మార్పు లేదు. కేవలం నామ, రూపంలోనే మార్పు వచ్చింది.
Read 12 tweets
3 Feb
🌹🌺కుమార సంభవము-మహాకవి కాళిదాసు.🌺🌹
💥💥
#కుమారసంభవం కవికుల గురువుగా ప్రసిద్ధి పొందిన మహాకవు కాళిదాసుచే రచింపబడి ప్రసిద్ధి పొందిన కావ్యము.
తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము, కుమార స్వామి జననం ముఖ్యమైనవి. Image
దక్షుడు యజ్ఞము చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికిఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రమే ఆహ్వానం పంపడు. దీనికి బాధ పడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది.
దానికి పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళడం సముచితం కాదని సతీదేవిని వారిస్తాడు. కాని తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న గాఢమైన కోరిక కలిగిన సతీదేవి వెళతానని పట్టుబడుతుంది. చివరికి భార్య మాట కాదనలేక పరమేశ్వరుడు ప్రమథగణాలను తోడిచ్చి దక్షుని యజ్ఞానికి సతీదేవిని పంపుతాడు .
-
Read 8 tweets
2 Feb
🔻భాగవతము -- పోతన-ప్రహల్లాదుడు !🔻
-
"#మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు
లలితా రసాల పల్లవ ఖాదియైచోక్కు కోయిల సేరునే? కుటజములకు
బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు "!
.
"#అంబుజోదర దివ్య పాదారవింద
చింతనా మృత పాన విశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?
వినుత గుణసీల ! మాటలు వేయునేల ?"
.
ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది.
ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .
భగవంతుడే తప్ప మరో ఆలోచన లేని మనస్సుకి ఇంకొకరు చెప్పడం వినడం ఉండదని., పోతన అభిప్రాయం .అతనూ ఆకోవకు చెడిన వాడే కదా !
.
తన అభిప్రాయాని భక్తుడయిన బాలకుని చే చెప్పించాడు.వృద్యంగా తను చెప్పదలచుకున్నది . ఒకరడిన ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నలే గుప్పించడం
Read 6 tweets
1 Feb
🚩వివేకచూడామణి !👌🏿
#శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- Image
కాలం, దేశం, కారణం :
ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు.
ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది.
Read 10 tweets
8 Nov 20
🚩🚩లటక్కన పెగ్గేసి -చటుక్కున మూతి తుడుచుకుంటాం!🚩🚩
-
#పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!
.
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!