సరస్వతీదేవి ని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.
ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది.
వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.
మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.
అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా.ఈ తల్లిని తెల్లని పూవులతోను,శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు.
పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.
‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.
సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు.వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు.పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.
భారతీయ తత్త్వ శాస్త్రము మొత్తం భారతదేశములో ముఖ్యముగా బెంగాల్ లో సమాజ ఉద్ధరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము ఈ దిశలో ముఖ్య భూమిక వహించి ఆ తరువాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితము చేసింది.
రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవచేసేవారు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది.
రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి అందించగల సాధనాన్ని ఇంగ్లీషులో "సెల్" (cell) అనిన్నీ, తెలుగులో ఘటం అని కానీ కోష్ఠిక అని కానీ అంటారు. వీటినే పూర్వం గాల్వానిక్ సెల్ అని కూడా అనేవారు. ఇలాంటి ఘటాలని వరసగా అమర్చినప్పుడు వచ్చే ఉపకరణాన్ని ఘటమాల అని తెలుగులోనూ #BatteryDay 🔋
"బేటరీ" అని ఇంగ్లీషులోనూ అంటారు. ఒక వరసలో అమర్చిన ఫిరంగి మాలని కూడా బేటరీ అంటారు. దండకి పువ్వు ఎలాగో, తోరణానికి ఆకు ఎలాంటిదో అదే విధంగా బేటరీకి సెల్ అలాంటిది. కానీ సాధారణ వాడుకలో వ్యష్టిగా ఉన్న ఒక సెల్ ని కూడా బ్యాటరీ అనే అనేస్తున్నారు.
స్థూలంగా విచారిస్తే ఈ కోష్ఠికలు (ఘటాలు) రెండు రకాలు. ఈ కోష్ఠికలు పని చెయ్యడానికి కావలసిన ముడి పదార్థాలని కోష్ఠికలోనే నిల్వ చేసినప్పుడు వచ్చే ఉపకరణాలని మామూలుగా - విశేషణం తగిలించకుండా - సెల్ అని కాని, బేటరీ అని కాని, ఘటం అని కాని, కోష్ఠిక అని కాని అంటారు.
#HumanSpiritDay 🧘♀️
ప్రియమైన మిత్రులారా అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది జ్ఞానం మాత్రమే. అన్ని జీవరాశులలో ఆత్మ ఒక్కటే ఐనప్పటికి మానవ శరీరానికి మాత్రమే ఆలోచన జ్ఞానం ఉంది. ఆలోచన వేరు ఆలోచన జ్ఞానం వేరు.
సృష్టిలో ప్రతి జీవి ఆలోచిస్తుంది కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది. ఆహరం కోసం పులులు, సింహాలు మొదలైన జంతువులు ఎంతో నేర్పుతో వేటాడతాయి, మరి కొన్ని మగ ప్రాణులు ఆడ ప్రణులతో సంభోగం జరపడానికి వాటిని ఆకర్షించడానికి ఎన్నో విన్యాసాలు వేరే ప్రాణులతో పోరాటాలు కూడా చేస్తూ ఉంటాయి,
వేటాడటం పోరాటాలు చేయడం కూడా ఆలోచనే మరి అప్పుడు జంతువులు కూడా ఆలోచిస్తున్నయి కదా మరి. నిజమే ఆలోచిస్తున్నాయి కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది ప్రతి జీవి ఆహరం, నిద్ర, మైదునం(సంభోగం) కోసమే ఆలోచిస్తుంది అంతకు మించి అది ఆలోచించలేదు కాని మనిషి అలా కాదు దేని గురించైనా ఆలోచించగలడు.
#InnovationDay 💡😇
ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, నవకల్పన.మారుతున్న పరిస్థితులకు సాంకేతికతను అన్వయిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు.. స్వీయ అనుభవంలోంచి కావచ్చు, ఏదైనా సంఘటన నుంచి ప్రేరేపితమై కావచ్చు. మంచి మంచి ఆవిష్కరణలు చేయొచ్చు..
ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం. కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు.
కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.
రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #Almond 🌰
రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #Almond 🌰
బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్ డల్సిస్ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి.
మీ పిల్లలు ఎప్పుడు చూసినా సంగీతం ఇష్టపడుతున్నారా? డ్యాన్స్ అనగానే స్టెప్పులేస్తున్నారా? పెయింటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారా? అయితే అవి కాలయాపన కోసం మాత్రం అనుకోకండి. అవి తమ అభిరుచుల్ని వ్యక్తపరచే స్వభావాలు అని గ్రహించాలి. #KidInventorsDay 💡
పిల్లలు పిడుగుల దినోత్సవం💡🚸
పిల్లల ప్రతిభను ఎలా గుర్తుంచుకోవాలో ముందు తెలుసుకోండి!
పర్యవేక్షణ:
మొక్కై వంగనిది మానై వంగునా? అందుకే పిల్లలకు ఏదైనా చెప్తే వినే స్టేజ్‌లోనే అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెప్పడమంటే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం కాదు. వారిని నిరంతరం పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ..
సూక్ష్మ పరిశీలన:
ఏదో కాలయాపనకోసం కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తే.. వాళ్లు ఏ దారిన నడిచేందుకు ఇష్టపడుతున్నారో.. ఏ పనులంటే ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది.