రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #Almond 🌰
రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #Almond 🌰
బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్ డల్సిస్ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి.
తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు. బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును.
బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
బాదం పప్పులో ఐరన్(ఇనుము),కాల్షియం,మెగ్నిసియం,జింకు,ఫాస్పరసు మరియు సోడియం ఖనిజాలు విరివిగా ఉన్నాయి.
బాదంపాలును బాదంపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
బలవర్ధకం కూడా.బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి.
మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది. రుచి కొరకు, ఆకర్షణ కొరకు ఇతర పదార్థములను కలుపుట వలన రంగు మారుతుంది.
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.
బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది.వీటి లో ఉండే 'ఫైటో కెమికల్స్' - కాన్సర్ ను నిరోధించును .
దీని లోని పీచు పదార్థము మలబద్దకం ను నివారించును .
ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మసంరక్షణకు దోహదం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ నాలుగు తీసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది.పిండి పదార్థము చాలాతక్కువ ..
బాదం.. పోషకాహారం.
గుండెకు : గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో లబించే విటమిన్ "ఇ" యాంటి ఆక్షిడేంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు.
కొలెస్ట్రాల్ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్, పాలీశాచ్యురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.
రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది.
బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.
తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్నిపెంచుతుంది.
మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది.
బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది.అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.
భారతీయ తత్త్వ శాస్త్రము మొత్తం భారతదేశములో ముఖ్యముగా బెంగాల్ లో సమాజ ఉద్ధరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము ఈ దిశలో ముఖ్య భూమిక వహించి ఆ తరువాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితము చేసింది.
రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవచేసేవారు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది.
రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి అందించగల సాధనాన్ని ఇంగ్లీషులో "సెల్" (cell) అనిన్నీ, తెలుగులో ఘటం అని కానీ కోష్ఠిక అని కానీ అంటారు. వీటినే పూర్వం గాల్వానిక్ సెల్ అని కూడా అనేవారు. ఇలాంటి ఘటాలని వరసగా అమర్చినప్పుడు వచ్చే ఉపకరణాన్ని ఘటమాల అని తెలుగులోనూ #BatteryDay 🔋
"బేటరీ" అని ఇంగ్లీషులోనూ అంటారు. ఒక వరసలో అమర్చిన ఫిరంగి మాలని కూడా బేటరీ అంటారు. దండకి పువ్వు ఎలాగో, తోరణానికి ఆకు ఎలాంటిదో అదే విధంగా బేటరీకి సెల్ అలాంటిది. కానీ సాధారణ వాడుకలో వ్యష్టిగా ఉన్న ఒక సెల్ ని కూడా బ్యాటరీ అనే అనేస్తున్నారు.
స్థూలంగా విచారిస్తే ఈ కోష్ఠికలు (ఘటాలు) రెండు రకాలు. ఈ కోష్ఠికలు పని చెయ్యడానికి కావలసిన ముడి పదార్థాలని కోష్ఠికలోనే నిల్వ చేసినప్పుడు వచ్చే ఉపకరణాలని మామూలుగా - విశేషణం తగిలించకుండా - సెల్ అని కాని, బేటరీ అని కాని, ఘటం అని కాని, కోష్ఠిక అని కాని అంటారు.
#HumanSpiritDay 🧘♀️
ప్రియమైన మిత్రులారా అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది జ్ఞానం మాత్రమే. అన్ని జీవరాశులలో ఆత్మ ఒక్కటే ఐనప్పటికి మానవ శరీరానికి మాత్రమే ఆలోచన జ్ఞానం ఉంది. ఆలోచన వేరు ఆలోచన జ్ఞానం వేరు.
సృష్టిలో ప్రతి జీవి ఆలోచిస్తుంది కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది. ఆహరం కోసం పులులు, సింహాలు మొదలైన జంతువులు ఎంతో నేర్పుతో వేటాడతాయి, మరి కొన్ని మగ ప్రాణులు ఆడ ప్రణులతో సంభోగం జరపడానికి వాటిని ఆకర్షించడానికి ఎన్నో విన్యాసాలు వేరే ప్రాణులతో పోరాటాలు కూడా చేస్తూ ఉంటాయి,
వేటాడటం పోరాటాలు చేయడం కూడా ఆలోచనే మరి అప్పుడు జంతువులు కూడా ఆలోచిస్తున్నయి కదా మరి. నిజమే ఆలోచిస్తున్నాయి కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది ప్రతి జీవి ఆహరం, నిద్ర, మైదునం(సంభోగం) కోసమే ఆలోచిస్తుంది అంతకు మించి అది ఆలోచించలేదు కాని మనిషి అలా కాదు దేని గురించైనా ఆలోచించగలడు.
#InnovationDay 💡😇
ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, నవకల్పన.మారుతున్న పరిస్థితులకు సాంకేతికతను అన్వయిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు.. స్వీయ అనుభవంలోంచి కావచ్చు, ఏదైనా సంఘటన నుంచి ప్రేరేపితమై కావచ్చు. మంచి మంచి ఆవిష్కరణలు చేయొచ్చు..
ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం. కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు.
కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.
మీ పిల్లలు ఎప్పుడు చూసినా సంగీతం ఇష్టపడుతున్నారా? డ్యాన్స్ అనగానే స్టెప్పులేస్తున్నారా? పెయింటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారా? అయితే అవి కాలయాపన కోసం మాత్రం అనుకోకండి. అవి తమ అభిరుచుల్ని వ్యక్తపరచే స్వభావాలు అని గ్రహించాలి. #KidInventorsDay 💡
పిల్లలు పిడుగుల దినోత్సవం💡🚸
పిల్లల ప్రతిభను ఎలా గుర్తుంచుకోవాలో ముందు తెలుసుకోండి!
పర్యవేక్షణ:
మొక్కై వంగనిది మానై వంగునా? అందుకే పిల్లలకు ఏదైనా చెప్తే వినే స్టేజ్‌లోనే అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెప్పడమంటే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం కాదు. వారిని నిరంతరం పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ..
సూక్ష్మ పరిశీలన:
ఏదో కాలయాపనకోసం కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తే.. వాళ్లు ఏ దారిన నడిచేందుకు ఇష్టపడుతున్నారో.. ఏ పనులంటే ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది.