శివాజీ జన్మతః నాయకత్వ లక్షణములు, ధైర్యసాహసాలు, దేశభక్తి, దైవభక్తి మెండుగాగల గొప్ప యోధుడు. శ్రీ సమర్ధ రామదాసు వారి శిష్యుడు. సంస్కృత పండితులను ఆదరించి, సత్కరించిన ఉత్తమపరిపాలకుడు. శ్రీ చాణుక్యుని అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాల ఆధారముగా తన పరిపాలన కొనసాగించిన ధార్మిక ప్రభువు.
జననము, బాల్యము:
శివాజీ ఫిబ్రవరి 19, 1627 పూణేకు 60కి.మీ దూరంలో గల శివ్నేరి కోటలో జన్మించారు. స్థానిక మాత అయిన శివాయి అమ్మవారిని పుత్రుని కొరకు వేడుకొనగా జగదంబ అనుగ్రహ ప్రసాదంగా పుట్టిన బాలునికి అమ్మ పేరుమీదనే, శివాజీ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.
తండ్రి బీజాపూర్ రాజ్యములో ఒక జాగిర్దార్. తల్లి పర్యవేక్షణలో పెరిగిన శివాజీకి పసిప్రాయంలోనే శ్రీరామాయణ, మహాభారత ఇత్యాది గాథలను బోధించి దైవభక్తికి మార్గము సుగమము చేసింది.
అంతేకాక దేశభక్తి, విదేశీ శక్తుల విరోధము, మరియు స్వాతంత్ర్య కాంక్ష నూరిపోసింది.
రాజ్యప్రాప్తి కొరకు తండ్రి చేస్తున్న ప్రయత్నాలనుండి, శివాజీ, శాంతి సమయంలో జరిపే రాయబారములు, ఒప్పందములు, యుద్ధనీతి మొదలైన విషయములపై పట్టు సాధించాడు.
విజయపరంపర:
1644 లో శివాజీ, పూణే సంస్థానముపై పూర్తి పట్టు సాధించి, స్వతంత్ర యువరాజుగా తన నాయకత్వ లక్షణములను ప్రదర్శించారు.
పిన్నప్రాయంలోనే, మంచి యోధునిగా తయారై 16సంవత్సరాల వయస్సులోనే, బీజాపూర్ సామ్రాజ్యానికి చెందినా తోర్నాకోటను సాధించాడు. ఆదిల్ షా మరణానంతరం, ఔరంగజేబు గోల్కొండ మరియు బీజాపూర్ల పై దాడి చేయడం జరిగింది.
శివాజీ గెరిల్లా యుక్తులతో బీజాపూర్ మరియు మొఘల్ రాజ్య భాగాలను కైవసం చేసుకోవడం జరిగింది
తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాలకు, తన రాజ్య విస్తారము గావించాడు. తన నమ్మకస్తుడయిన సేనాని తానాజీ మల్సురే నేతృత్వములో, కొండన దుర్గము కొరకు మొఘలు సైన్యముతో యుద్ధం జరిగింది.
ఈ యుద్ధాన్ని, మరాఠా స్వాతంత్ర్య సంగ్రామము అని పిలుస్తారు. ఈ యుద్ధములో విజయలక్ష్మి మరాఠా వీరులనే వరించింది.
కానీ తానాజీ వీరమరణం పొందినందున, ఆ కోటకు సింహగడ్ అని నామకరణం చేశారు.
హిందూ సామ్రాజ్య స్థాపన:
1674లో, శివాజీ రాయగడ్ కోటలో పట్టాభిషిక్తుడయి ఛత్రపతి శివాజీగా పిలువబడి, హిందూ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది.
శివాజీ, జన్మతః నాయకత్వ లక్షణములు, ధైర్య సాహసాలు, దేశభక్తి, దైవభక్తి మెండుగా గల గొప్ప యోధుడు.
శ్రీ సమర్థ రామదాసు వారి శిష్యుడు. సంస్కృత పండితులను ఆదరించి సత్కరించిన ఉత్తమ పరిపాలకుడు. శ్రీ చాణుక్యుని అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాల ఆధారంగా తన పరిపాలన కొనసాగించిన ధార్మిక ప్రభువు.
గ్రామ పంచాయితీ వ్యవస్థను ఏర్పరచి, పన్నుల విధానములను సవరించి ప్రజల అభివృద్ధికి పాటుపడిన ఆదర్శ పాలకుడు.
తన సేనలో నావికాదళాన్ని ఏర్పరచి 200 యుద్ధ నౌకలను ఉపయోగించి సముద్ర మార్గము గుండా శత్రువులు చొరబడకుండా అరికట్టిన మహామేధావి శివాజీ మహారాజు. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ’గా కీర్తించబడ్డాడు
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి, శ్రీ భవానీమాత అనుగ్రహము, వీర ఖడ్గము పొంది, దేశ రక్షణ గావించిన మహనీయుడు. స్త్రీల మాన ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా హరించే ముష్కరులకు ఎదురు నిలచి పోరాడిన వాడు. హిందూ ధర్మ పరిరక్షణాయజ్ఞములో ఒక సమిధ వలె తనను తాను అర్పించుకున్న ఆదర్శ భారతమాత ముద్దుబిడ్డ.
1680 ఏప్రిల్ 3వ తేదీన శివాజీ మహారాజ్ తనువు చాలించిన పిదప తన తనయుడు శంభాజీ, తదితరులు హిందూధర్మ పరిరక్షణా యజ్ఞ, ఆన్ని కొనసాగించి భారతమాత సేవలోనే, ఆనందం పొందారు.
‘ఆనాడు శివాజీ మహారాజు జన్మించకపోతే, ఈనాడు హిందువులు మిగిలేవారా” అని పూజ్య పరమాచార్యులు ప్రశ్నించారు. అంటే మన ధర్మ పరిరక్షణలో శివాజీ పాత్రయొక్క గొప్పతనము అవగతమవుతుంది. ఇటువంటి మహనీయుల నుండి స్ఫూర్తి పొంది, ధర్మ పరిరక్షణకు కృషి చేయడం మనందరి కర్తవ్యమ్.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
The seventh day of the lunar calendar in the bright half of ‘Magha’ month is called ‘Ratha Saptami’. Worship of Sun on this day grants immense merits equal to the worship of Sun for one complete year.
On this day at the time of brahmi muhurta, all the stars will be in the shape of chariot. Worship of Aditya, the embodiment of all gods, on this day grants brilliance, abundance, health etc. Giving ‘Arghya’ to Sun in copper pot, worshipping with red sandalwood and red flowers..
..should be done and milk pudding cooked using cow dung cakes as fuel should be offered in leaves of green bean tree. Offering of pumpkin is very meritorious, as this time is equivalent to the time when the eclipse of sun is happening.
భారతీయులందరూ ఆదిత్యోపాసకులే. ఇది సనాతన విషయం. గాయత్రీ మంత్ర స్వరూపమే ఆదిత్యహృదయం. సంధ్యలలో ఇది పఠించేవారు గాయత్రీ మంత్రజప ఫలాన్ని పొందుతారు.
సంధ్యాసమయంలో సూర్యుని ఆరాధిస్తే పుణ్యం వస్తుంది, ఆరాధించకుండా ఉంటే పాపం కూడా వస్తుంది.
మానవుడికి కావలసిన ప్రయోజనాలు ప్రధానంగా నాలుగు – ఆరోగ్యంగా ఉండాలి, దరిద్రం ఉండకూడదు, అపకీర్తి రాకూడదు, శత్రుబాధ ఉండకూడదు. ఈ నాలుగూ ధర్మబద్ధమైన కోరికలు గనుక, అడిగితే దోషం లేదు.
రామచంద్రమూర్తి అవతార పురుషుడు అయినప్పటికీ మానవశరీరం ధరించి ఉన్నాడు కాబట్టి తల్లక్షణాన్ని చూపిస్తున్నారు.
రామచంద్రమూర్తికి శారీరకమైన వేదన కలిగి ఆదిత్యుని ఆశ్రయించబోతున్నాడు. ఆదిత్యుడు వేరు, దివాకరుడు వేరు కాదు. కానీ ఏ నామం ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందనేది ఒకటి ఉంటుంది.
significance & worship to be performed on a rare combination occurring Jan 12th
In the culture of Bhāratadēśa, ‘Time’ has great significance. Tithis, days of the week, stars – everything has its own distinction. All the beings are bound by time and time is in the control of God.
With compassion, the Supreme God graced that one performing worship in some special stipulated times acquires special merits. This is true in case of every deity. Worship of a particular deity on a particular tithi bestows the grace of that particular deity quickly and certainly.
Among those, Kr̥ṣṇāṁgāraka Caturdaśi is imp. The combination of Tuesday & Caturdaśi in the dark fortnight is a great occasion.
विरिन्चिशक्रविष्णूनां मनुष्याणां तु का कथा ।
तेन त्वं सर्वसत्त्वेन ग्रहराजो महाबलः॥
Not only present as one among the nine planets, Aṅgāraka..
for the enablement of children to grasp and follow dharmic values & put them into practice with thorough comprehension.
This aids children in amalgamating the morals, customs, traditions, and culture of Sanatana Dharma into their daily lifes with courage, confidence and clarity.
This also channelizes children’s talents in various areas such as writing, oratory, singing etc., and mentoring them to achieve ‘Success with Character’ in all fields and transform into future responsible leaders.
మన భారతదేశ చరిత్రను విదేశీ పాలనలో తప్పుల తడకలతో తయారుచేసి మనవారి చేతనే చదివించారు. స్వాతంత్ర్యానంతరం కూడా అదే తప్పుడు చరిత్రను అధ్యయనం చేస్తూ వచ్చాము. కొద్దిమంది విశాల హృదయులైన పాశ్చాత్యులు సవరించి చెబుతున్నా మనవారికి గానీ, ప్రపంచంలోని ఇతర మేధావులకి గానీ తలకెక్కడం లేదు.
మొదటిగా – ఆర్య, ద్రావిడ సిద్ధాంతం లేవదీయడం ఒక చారిత్రకమైన తప్పిదం. దానితో భారతదేశానికి పరాయివారే ఆర్యులై వచ్చారని, వేదాలు వారి రచనలనే దురభిప్రాయాన్ని వాస్తవంగా భ్రమింపజేయగలిగారు. పాశ్చాత్యులు పలికిందే వేదంగా నాడూ నేడూ కూడా భావిస్తున్న మన మేధావులు దానినే నేటికీ చదివిస్తున్నారు.
వలసవాదులైన విదేశస్థులు తమ వలెనె భారతదేశంలోకి ఆర్యులు వచ్చారని అభూత కల్పనా చేసి తృప్తి చెందారు.
అక్కడితో ఆగలేదు – మొదటి మానవ గ్రంథంగా ఋగ్వేదాన్ని’ పేర్కొన్న చరిత్రకారులు ఇతర వేదాలను అనంతర రచనలుగా చిత్రించారు.
Sri Krishna expounded the entire gamut of spirituality in Srimad Bhagavad Gita as
Karma Yoga,
Bhakti Yoga and
Jnana Yoga.
The very fact that this has been elucidated in the middle of the battlefield demonstrates that these...
eternal values are required for those who are active in life & want to achieve success. Without complete comprehension & practice of these values, one’s spiritual practice is hollow & non-holistic.
Sri Ramakrishna Paramahamsa once told, ‘The Brahman
narrated in Upanishads,...
the Atma described by the Vedantins (philosophers), the Supreme God defined by the devotees & the Kali I worship are one & the same.’