చిన్నపిల్లలకి పెద్దలు చెప్పే కథ, "రాజుగారికి ఏడుగురు కొడుకులు -వేటకివెళ్ళి ఏడు చేపలు తేవడం" చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ, మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. ఈకథలోని వేదాంత తాత్వికత, పరమార్ధం, భగవద్గీత మూలంనుండి:
ఎవరో పంపితే అందరికీ పంచాలనిపంచింది.
ఓపికగా చదవితే మీకు కూడ పంచాలనిపించుతుందేమో!
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.
ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
వేటాడిన చేపలను ఎండబెట్టారు.
అందులో ఒక చేప ఎండలేదు.
చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు.
గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.
గడ్డిమేటూ, గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్ అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.
ఆవా, ఆవా ఎందుకు మేయలేదు అని అడిగారు
గొల్లవాడు నన్ను మేపలేదు అంది.
గొల్లవాడా, గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.
అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు.
పిల్లవాడు ఏడ్చాడు అంది.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్ అని అడిగారు.
చీమ కుట్టింది అన్నాడు.
చీమా చీమా ఎందుకు కుట్టావ్ అన్నారు.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.
ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
కారణాలు అడగకుండా, ఆలోచించకుండా చెప్పే, వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.
నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.
అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా! అని ఎవరూ తర్కించరు. మీరు చెప్పినపుడు మీరూ ఆలోచించి ఉండరు.
చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.
వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా, అనే సందేహం కూడా రాదు.
ఎవ్వరూ అడగలేదు కదా అని వివరించక పోవడం విజ్ఞుల లక్షణం కాదట.
అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనించమంటున్నారు. అలా గమనిస్తే,
అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.
రాజుగారు అంటే మనిషి.
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడం అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే!!
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి?
ఆవు వచ్చి మేయాలి.
ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి?
ఆవు అంటే జ్ఞానం.
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు
(*జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం*)
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
ఈ గోవును ఎవ్వరు మేపాలి?
గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు?
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా!!
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా, ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు?
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు?
ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు?
వాడికి చీమ కుట్టింది.
ఎక్కడిది చీమా? దానికి ఇంకోపేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా?
లేదు.
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట?
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఒకప్పుడు…. నా ఇల్లు నవ్వులు, వాదనలు, అరుపులు, కేకలు, అల్లరితో హడావిడిగా ఉండేది.ఇల్లంతా పెన్నులు, పుస్తకాలు, ఆట సామాన్లు, మడత పెట్టని దుప్పట్లు, విసిరేసిన చెప్పులు, ఆరేయని తడి తువ్వాళ్ల తో చిందరవందర గా ఉండేది.నా రోజువారీ పని అరవడం, వాళ్ళని కోప్పడ్డం, క్రమ శిక్షణ చెప్పడం,
చివరికి అన్నీ నేనే సద్దుకోవడంలా ఉండేది..
ఉదయరాగం:
పొద్దున్న లేచిన దగ్గరనుండీ అమ్మా నా బ్రష్ ఎక్కడ, అమ్మా నా స్కూల్ బాగ్ ఎక్కడ? నా బూట్ లేసు పోయింది! నా హోమ్ వర్క్ బుక్ పోయింది! హోమ్ వర్క్ చెయ్యలేదు, స్కూల్ మానేస్తాను. ఇవీ మా ఇంట్లో ఉదయ రాగాలు!
నా దినచర్య విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వడం, “మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోవాలి, పెద్దవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు?” ఇదే నా అరిగిపోయున రికార్డు.
సంధ్యారాగం:
“అమ్మా, ఏదైనా పెట్టు, ఆడుకోడానికి వెడుతున్నా,నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్న”
తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవటం అలవాటు అయిపోయింది. మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని జిద్దు చేస్తున్నది. కొడుకుకు ఈమధ్యే పెళ్లయింది. కోడలిది వైద్య వృత్తి. నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్త గారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది.
కానీ అత్తగారు వినటం లేదు. 'మీరు ఎంత అరిచి గీపెట్టినా మాత్రలు ఇవ్వను.' అని కోడలు తేల్చి చెప్పేసింది.
చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది. కొడుకు వస్తూనే 'అమ్మా నోరు తెరువు' అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు. ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి
హాయిగా నిద్రపోయింది.
ఆ అమ్మాయి కోపంగా 'ఎందుకు ఇట్లా చేశారు?' అని భర్తను అడిగింది. అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు. అది విటమిన్ మాత్రలు అని చూస్తూనే అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది. నెమ్మదిగా, 'అమ్మని మోసం చేస్తున్నారా?' అని అడిగింది.
నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
పుల్లమామిడి,నిమ్మ, ఉసిరి ,ఉప్పు,కారం,మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకుని తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్,బి.పి బహుమతిగా ఇస్తున్నావు.
నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.
నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.
నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.
నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామి దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.
పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ..... ఈర్షగా చూస్తుండగా .....
లాయర్ : " ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు (తాను చేయలేని పని చేసిన అతడిని ... మనసు లోపల మెచ్చుకుని) : " కోర్టు వారు అతడిని ... మొదటి తప్పిదం గా భావించి మందలించి వదిలేస్తున్నారు " అని తీర్పునిచ్చారు.
మూడో రోజు ..... అదే దీరోదాత్తుడిని .... అదే కారణంతో .... అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈసారి జడ్జి గారు అతడిని ... ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు
ముద్దాయి : " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
జడ్జి గారు తన నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ " సరే ... ఏమన్నా చెప్పదలచుకుంటే ... సూటిగా చెప్పండి "