అనగనగా.... ఒక రాత్రి గుంటూరు వైపునుంచీ వస్తున్న ఓ కారును పోలీసులు ఆపారు.
కారు నడుపుతున్న మహిళ నోటి దగ్గర గొట్టం పెట్టి ఊదమన్నారు. ఆవిడ పక్కన కూర్చున్న భర్తవైపు చూసి... మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఊదారు.
మీటరు గిర్రున తిరిగింది. భర్త చాలా రాష్గా డోరు తెరుచుకుని దిగాడు.
మీ మిషన్ పనిచేయడం లేదు... తాగింది నేను... ఆవిడ కాదు అని అరుస్తూ మిషన్ లాక్కుని కిందేసి కొట్టాడు.
పిచ్చగా మాట్లాడకు ఆవిడా తాగే ఉన్నారు అన్నాడు కానిస్టేబుల్.
న్నో.. న్నో... అని అరిచాడు భర్త. ఆవిడ్నే అడిగన్నాడు ఏ మాత్రం బెదరకుండా కానిస్టేబుల్.
భర్త భార్య వైపు చూసాడు....
ఆవిడ సజల నయనాలతో భర్త పాదాలకు నమస్కరించి ఇలా
"ఇందాక మీరు... ఆ హోటల్ గదిలో ఫుల్లు తాగలేదండి... సహమే తాగి పడిపోయారు. ఆ మిగిలింది వేస్టు చేయడం ఎందుకని నేను తాగేసానండి"...
అని ముగించింది.
హాఫ్ తాగి ఆయన పడిపోతే మిగిలింది తాగి ఆయన్ని తీసుకుని ఇంతదూరం కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారా
అమ్మా అని దణ్ణం పెట్టాడు కానిస్టేబుల్.
మందు వృధా కాకూడదు... ఆయనకేం కాకూడదు... అంతే ఆ క్షణంలో నా మనస్సులో ఉంది... ఆ మనో నిశ్చయమే ఇక్కడదాకా తీసుకొచ్చింది... నేనే కాదు నా స్తానంలో ఏ పతివ్రత ఉన్నా ఇలానే చేస్తుంది అంటూ మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది.
ఆవిడ మాటలకు కళ్ళు చెమర్చిన కానిస్టీబు దణ్ణం పెట్టి మీరు వెళ్ళండమ్మా... ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఓ మహా పతివ్రత దర్శనం అయ్యింది పొద్దున్నే అని అనుకున్నాడు. కారు సర్రున దూసుకెళ్ళిపోయింది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఒకప్పుడు…. నా ఇల్లు నవ్వులు, వాదనలు, అరుపులు, కేకలు, అల్లరితో హడావిడిగా ఉండేది.ఇల్లంతా పెన్నులు, పుస్తకాలు, ఆట సామాన్లు, మడత పెట్టని దుప్పట్లు, విసిరేసిన చెప్పులు, ఆరేయని తడి తువ్వాళ్ల తో చిందరవందర గా ఉండేది.నా రోజువారీ పని అరవడం, వాళ్ళని కోప్పడ్డం, క్రమ శిక్షణ చెప్పడం,
చివరికి అన్నీ నేనే సద్దుకోవడంలా ఉండేది..
ఉదయరాగం:
పొద్దున్న లేచిన దగ్గరనుండీ అమ్మా నా బ్రష్ ఎక్కడ, అమ్మా నా స్కూల్ బాగ్ ఎక్కడ? నా బూట్ లేసు పోయింది! నా హోమ్ వర్క్ బుక్ పోయింది! హోమ్ వర్క్ చెయ్యలేదు, స్కూల్ మానేస్తాను. ఇవీ మా ఇంట్లో ఉదయ రాగాలు!
నా దినచర్య విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వడం, “మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోవాలి, పెద్దవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు?” ఇదే నా అరిగిపోయున రికార్డు.
సంధ్యారాగం:
“అమ్మా, ఏదైనా పెట్టు, ఆడుకోడానికి వెడుతున్నా,నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్న”
తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవటం అలవాటు అయిపోయింది. మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని జిద్దు చేస్తున్నది. కొడుకుకు ఈమధ్యే పెళ్లయింది. కోడలిది వైద్య వృత్తి. నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్త గారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది.
కానీ అత్తగారు వినటం లేదు. 'మీరు ఎంత అరిచి గీపెట్టినా మాత్రలు ఇవ్వను.' అని కోడలు తేల్చి చెప్పేసింది.
చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది. కొడుకు వస్తూనే 'అమ్మా నోరు తెరువు' అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు. ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి
హాయిగా నిద్రపోయింది.
ఆ అమ్మాయి కోపంగా 'ఎందుకు ఇట్లా చేశారు?' అని భర్తను అడిగింది. అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు. అది విటమిన్ మాత్రలు అని చూస్తూనే అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది. నెమ్మదిగా, 'అమ్మని మోసం చేస్తున్నారా?' అని అడిగింది.
చిన్నపిల్లలకి పెద్దలు చెప్పే కథ, "రాజుగారికి ఏడుగురు కొడుకులు -వేటకివెళ్ళి ఏడు చేపలు తేవడం" చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ, మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. ఈకథలోని వేదాంత తాత్వికత, పరమార్ధం, భగవద్గీత మూలంనుండి:
ఎవరో పంపితే అందరికీ పంచాలనిపంచింది.
ఓపికగా చదవితే మీకు కూడ పంచాలనిపించుతుందేమో!
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.
ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
వేటాడిన చేపలను ఎండబెట్టారు.
అందులో ఒక చేప ఎండలేదు.
చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు.
గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.
గడ్డిమేటూ, గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్ అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.
ఆవా, ఆవా ఎందుకు మేయలేదు అని అడిగారు
గొల్లవాడు నన్ను మేపలేదు అంది.
గొల్లవాడా, గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.
నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
పుల్లమామిడి,నిమ్మ, ఉసిరి ,ఉప్పు,కారం,మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకుని తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్,బి.పి బహుమతిగా ఇస్తున్నావు.
నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
పంచదార, బెల్లం,తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.
నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...
మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.
నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.
నువ్వు తక్కువ వాడివి కావు సామీ...
వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామి దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.
పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ..... ఈర్షగా చూస్తుండగా .....
లాయర్ : " ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు (తాను చేయలేని పని చేసిన అతడిని ... మనసు లోపల మెచ్చుకుని) : " కోర్టు వారు అతడిని ... మొదటి తప్పిదం గా భావించి మందలించి వదిలేస్తున్నారు " అని తీర్పునిచ్చారు.
మూడో రోజు ..... అదే దీరోదాత్తుడిని .... అదే కారణంతో .... అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈసారి జడ్జి గారు అతడిని ... ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు
ముద్దాయి : " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
జడ్జి గారు తన నల్ల కళ్ళజోడు లోంచి చూస్తూ " సరే ... ఏమన్నా చెప్పదలచుకుంటే ... సూటిగా చెప్పండి "