పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.👇🏻👇🏻
ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.
టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.
‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.
‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.
అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.
‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’
‘ఎందుకంటే...
అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.
‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును,
అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది
చెప్పండి’
డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.
ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.
ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.
‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి
వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’
నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
*మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.
‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’
వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం.
మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!
‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....
“Let us Die Empty”
Recd.from
*లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్*
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*
*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో
గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*
*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది
మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.*_
పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి,
కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_
నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు.
కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_
ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_
పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు
ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి !
ఆ ఇంటిలోని యజమానిని పిలిచి
నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి
పారేయొచ్చు కానీ కొత్తవి !
అందుకే మనసు రావట్లేదు
రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !
అందుకు ఆ ఇంటి యజమాని
అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !
ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!
ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !
అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !
ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !
అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!
వర్షం ఎక్కువగా ఉందండి !
వర్షం ఆగే వరకు శవాన్ని
మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు!
భళిభళిభళిరా దేవా
బాగున్నదయా నీ మాయ..
బహుబాగున్నదయా
నీ మాయ!
ఆ మాయే మాయాబజార్..
ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్..
మహాభారతంలో
శశిరేఖ పరిణయ ఘట్టం
హాస్యానికి పట్టం..
సావిత్రి అనే మొండిఘటం..
కెవిరెడ్డి చేతివాటం..
ఇంతకీ అది సినిమానా..
మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా..
అపురూప దృశ్య కావ్యమా..?
అద్భుతమట స్క్రీన్ ప్లే..
ఘటోత్కచుడిగా
ఎస్వీఆర్ పవర్ ప్లే..
అంతటి మహానటుడి
అభినయానికి సావిత్రి రీప్లే..
కృష్ణుడిగా ఎన్టీఆర్
నట విశ్వరూపం..
అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం..
సుపుత్రా నీకిది తగదురా
అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం..
ఓ చిన్నమయ..లంబు జంబు..
రేలంగి హాస్య విన్యాసం..
పక్కన శాస్త్రి,శర్మ కోరసం..
అంజిగాడి బాబాయిల పద్యం
చెప్పుల నాట్యాలు..
తివాచీ అల్లర్లు..
ఘటోత్కచుడి పదఘట్టనకు
విరిగి పడిన కొండ ముక్క..
పేరు చెప్పి
శరణు కోరమనే వైనం..
సుభద్ర రౌద్రం..