ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ
.
దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది .
.
"దయచేసి చదవండి" అని రాసి ఉంది.
ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను .
.
ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు.
మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి" అని రాసి ఉంది.

నాకు ఎందుకో ఆ అడ్రస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది.

అడ్రస్ గుర్తుపెట్టుకున్నాను .

అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక.
దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లోనుండి ఒక వృధ్ధురాలు వచ్చింది.
ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు.
ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది.
చేతి కర్ర సహాయంతో తడుము కుంటూ బయటకు వచ్చింది.
.
.
"ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది. అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను.

ఆమె ఏడుస్తోంది.
"బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ
ఒక 50 రూపాయలు ఇస్తున్నారు . నాకు కళ్ళు కనబడవు.
నాకు చదవడం రాయడం రాదు. నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !"
.
.
" పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో ! "
.
.
బాబూ ! అది నేను రాయలేదు. నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు.
వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ ! అంది.
.
.
ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది .
ఒక్కరూ చించెయ్యలేదు. ఆమె రాయలేదు.
ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు .
.
.
ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు.
అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయ పడాలని అనుకుంటారు. అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వఛ్చి ఆమెకు సహాయ పడతారు. నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను.
ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు.
.
అది చింపెయ్యనా ?
ఉంచెయ్యనా ?
.
నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు.
అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు.
మరి నేను ఎందుకు అది చింపెయ్యడం.
ఇలా అనుకుంటూ వస్తున్నాను.
.
.
ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు.
.
.
.
సర్ ! ఈ అడ్రస్ చెప్పగలరా ? నాకు ఒక 50 నోటు దొరికింది.
వాళ్లకి ఇచ్ఛేద్దామని అడ్రస్ అడుగుతున్నాను.
.
.
.
ఆమె అడ్రస్
.
.
.
నాకు అనిపించింది "మానవత్వం చచ్చిపోలేదు" .
.
అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు.
ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను. ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడం లో నాకు సందేహం లేదు.
.
.
అది చింపడం భావ్యం కాదు .అనిపించింది .
.
.
.
నేను అది చింపేయాలా ?
అలా వదిలేయాలా ?
.
.
వదిలేశాను.
.
.
.
.
.
వదిలేసి నేను మంచి పని చేశానా ? లేదా ?
.
.
మీరే చెప్పండి. . . . .
ఇది కధ అయి ఉండొచ్చు. . . .
కానీ ఈ పరిస్థితి ఎదురయితే. . . . .
.
.
పనికి రాని మెస్సేజ్ లు చాలా పోస్ట్ చేస్తాం.
ఇలాంటివి కనువిప్పు కలిగించే పోస్ట్ లు మాత్రం వదిలెయ్యకండి.
.
పై రచన రాసిన వ్యక్తికి నా హ్రుదయ పూర్వక నమస్కారం.

🌷🙏🙏🙏🙏🌷
.
(సేకరణ)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

4 Apr
*The time has come when a pan-India organization of taxpayers should be formed*

*Which will be the largest organization in the world !!*

*A Tax Payers Union should now be formed in the country. No matter what the government may be, without the approval of that union, neither
free electricity, free water, free distribution, or loan waiver can announce anything, and nothing else can implement it.*

*If money is our tax, then we should also have the right to know how to use it.*

*The parties will continue to covet anything for votes,*
*Which one is going out of his pocket?*

*Regardless of the blueprint of whatever scheme is made, take consent from us and it should also be applicable to their salary and other facilities.*

*Is democracy limited to just voting ??*
*What rights do we have after that ??*
Read 4 tweets
4 Apr
👉🏿ఇది చదవండి చాలా బాగుంటుంది.*

🌷మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ... ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!!*

🌹మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు*

🌷*1.తల్లి*

*మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...
👩‍🦱తల్లి మొదటి అద్భుతం.*

🌷 *2.తండ్రి*

*మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.*
🌷 *3.తోడబుట్టిన వాళ్ళు*
*మన తప్పులను వెనకేసుకురావాడానికి మనతో పోట్లాడడానికి...మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺*

🌷
Read 8 tweets
4 Apr
2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది. కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేం.
ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.
ఒఖ్ఖ రెండు రూపాయలు (కథ)

రచన: శ్రీమతి జి యస్ లక్ష్మి.
"నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"
గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.
"ఆ!...ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే.
పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా?

పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా?

ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ పెరిగి పోతున్న ధరలతో,

నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు.
Read 23 tweets
3 Apr
👉Chief Electrical Engineer of a Public Sector Undertaking sent a proposal for the import of a 440 volts, 500 HP, 50 cycles squirrel cage induction motor to the finance manager, Accounts department

After going through the proposal the finance manager turned down the proposal
with the following remarks:

1. Cycles are manufactured in India by many companies and what is the necessity to import them?

2. Even if it has to be imported, why 50 cycles. Can you manage with 15 cycles?
3. Squirel cages can be purchased from any hardware store. Why it should be imported?

4. What is the need of double voltage (440v) when 220 v is easily available everywhere.
Read 5 tweets
2 Apr
*మనిషి తన భావనలతో ఏకీభవించినవారిని, మనసుకు నచ్చినవారిని*— ఆత్మీయులంటాడు...

*తనమాట కాదన్నవారిని*— శత్రువులుగా భావిస్తాడు...

*నమ్మించి మోసం చేయడం, ప్రేమించి ద్వేషించడం,అభి మానిస్తూనే అనుమా నించడం, మాటలతో కవ్వించడం, ఆవేశంతో కక్ష కట్టడం*—మనిషి నేర్చిన కళ...
మనసు మాయకు లొంగిపోవడం మానవ బలహీనత...

ప్రశాంతంగా జీవించగల శక్తియుతుడు అశాంతితో అలమటిస్తుంటాడు.నిలకడ లేని మనస్తత్వం మనిషి తత్వం.మరుక్షణంలో జరగబోయేది తెలుసుకోలేనివాడు కాలాన్ని శాసించ గలనన్న భ్రమలో బతుకుతాడు...

సృష్టిలోని ఒకే జాతికి చెందిన జీవులన్నీ ఒకే రకమైన లక్షణాలు,
అలవాట్లు కలిగి ఉంటాయి. కానీ మనిషి తత్వం విచిత్రం.

మనిషి ముఖం చూసి సన్మార్గుడో, దుర్మార్గుడో నిర్ణయించడం కష్టం... ఒకే ఆకారంలో కనిపించినా మనుషుల మధ్య గోముఖ వ్యాఘ్రాలుంటాయి...

జ్ఞానులు, అజ్ఞానులు,
మంచివారు, చెడ్డవారు,
శాకాహారులు మాంసాహారులు,
ధర్మవర్తనులు, అధర్మ చింతనులు,అమాయకులు
Read 9 tweets
31 Mar
గుడికెందుకెళ్ళాలి?

*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*

*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో
గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*

*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది
Read 25 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!