పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు
ఒక శివరాత్రి పండుగ రోజున శివుడిని దర్శించుకునేందుకు కాశీ విశ్వేశ్వరుని ఆలయం దగ్గర బారులు తీరిన జనాల్ని చూసి, పార్వతి శివుడితో "స్వామీ! కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కైలాసానికి వస్తారంటారే, మరి నిజంగా అంతమంది కైలాసానికి వస్తారా ..అని అడిగింది.
శివుడు నవ్వి, " కాదు దేవీ వీళ్ళలో ఏ ఒకళ్లిద్దరు ఉంటారేమో, కైలాసవాసానికి అర్హత ఉన్నవాళ్ళు!" అన్నాడు.
"ఎలాంటి వాళ్ళు?" అడిగింది పార్వతి.
చూద్దాం, రా!" అని శివుడు పార్వతిని వెంట బెట్టుకొని బయలుదేరాడు.
శివపార్వతులు ఇద్దరూ ముసలివాళ్ళుగా మారి విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు.
అక్కడ ముసలమ్మ గా తన భర్త తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్లందరినీ "అయ్యా, భక్తులెవరైనా దయ తలచండి! నా భర్త దాహం తీరేందుకు కొంచెం గంగా జలం పోయండి! నేను వెళ్ళి గంగా జలం తీసుకు రావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు- ఏ క్షణంలోనైనా ప్రాణం .
పోవచ్చు. ఈ స్థితిలో నేను ఆయన్ని విడిచి వెళ్ళలేను. మీరెవరైనా కొంచెం సాయం చేయండి" అని వేడుకుంటున్నది.
గుడిలోకి వెళ్ళే భక్తులంతా అప్పటికే గంగానదిలో స్నానం చేసి, తడి బట్టలతో, చేతిలో ఉన్న పాత్రల్లో గంగా జలం నింపుకొని వస్తున్నారు.
ఆ గంగ నీటితో విశ్వేశ్వరుణ్ని అభిషేకిస్తారు వాళ్ళు.
ఇదేమిటి, విశ్వేశ్వరుని దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది?" అని కొందరు ముసలమ్మను తప్పించుకొని వెళ్ళారు. మరికొందరు "ఉండమ్మా, మేం ఇంకా దేవుడిని దర్శించుకోనే లేదు; అభిషేకం అయిన తర్వాత వచ్చి నీ భర్త సంగతి చూస్తాము" అని చెబుతూ లోనికి వెళ్లిపోయారు.
ఆ సమయంలో ఒక దొంగ "దేవాలయ
సింహద్వారం దగ్గర భక్తులు క్రిక్కిరిసి ఉన్నారు. 'జేబులు కొట్టవచ్చు; అలాగే ఆడవారి మెడలలోని నగలు అపహరించవచ్చు" అనుకుంటూ వచ్చాడు.
అందరినీ అడిగినట్లే ముసలమ్మ ఆ దొంగను కూడా అడిగింది-"అయ్యా! మేం విశ్వేశ్వరుడిని దర్శించేందుకు వచ్చాం. కానీ వయసు పైబడిన నా భర్త అలసిపోయి,
ఇక్కడే కూలబడ్డాడు. ఎవరైనా పుణ్య ప్రభువులు, ఇంత గంగా జలం తెచ్చి ఆయ నోట్లో పోస్తే సేదతీరుతాడేమో. అందరినీ అడుగుతున్నాను నాయనా, నువ్వైనా దయచూడు" అని.
దొంగ చేతిలో ఒక సొరకాయ బుర్రనిండా గంగ నీళ్ళు ఉన్నాయి. అతను "దానిదేముంది అవ్వా, ఇప్పుడే తెచ్చుకున్నాను గంగ నీళ్ళు- ఇవిగో!" అని ఆ
నీళ్ళను ముసలాయన నోట్లో పోసేందుకని మోకాళ్ళపైన కూర్చున్నాడు.
అవ్వ అన్నది- "కాస్త ఆగు నాయనా! ఆయన నోట్లో నీళ్ళు పోసేముందు, నువ్వు చేసిన పుణ్యకార్యాల్లో ఏదో ఒకటి చెప్పి, ఆ పైన నీళ్ళు పొయ్యి బాబూ! నీ పుణ్యంవల్లనైనా ముసలాయన మంచి లోకాలకు పోతాడు" అని.
దొంగకు ఏం చేయాలో తోచలేదు. గుర్తు
ఎరిగిన నాటి నుండీ 'తను చేసిన మంచి పని' అంటూ ఒక్కటీ లేదు! ఇలా తన పుణ్యాన్ని లెక్కించుకునే అవసరమూ ఏనాడూ ఎదురవ్వలేదు! అతను సిగ్గు పడుతూ అన్నాడు ముసలమ్మతో"అమ్మా, నేనొక దొంగను. ఇంతవరకూ నేను ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. ఇదిగో, ఇప్పుడు, ఈయన నోట్లో గంగాజలం పోద్దామనుకున్నానే, ఇదొక్కటే
కావొచ్చు, నేను చేస్తున్న మంచి పని" అని చెప్పి, ముసలాయన నోటిలో నీరు పోశాడు అతను.
మరుక్షణం శివ పార్వతులు ఆ దొంగకు నిజరూపాలతో దర్శనం ఇచ్చారు: "నాయనా, నిజం చెప్పటం ద్వారా నువ్వు ఈనాడు గొప్ప పుణ్యం సంపాదించుకున్నావు. సత్యాన్ని మించిన ధర్మం లేదు. నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పని వల్ల,
ఇంతకాలంగా చేసిన పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఇకపైన చెడు పనులు చేయకు. పవిత్రంగా బ్రతుకు. మానవ సేవే పరమార్థంగా భావించిన నువ్వు, జన్మాంతంలో కైలాసానికి చేరుకుంటావు" అని, వాళ్లు అంతర్థానమయ్యారు.
ఆపైన దొంగ పూర్తిగా మారిపోయాడు. జీవితాంతం మంచిపనులు చేస్తూ గడిపాడు.
చూశావా! ఇలాంటి ఏ కొందరో వస్తారు, కైలాసానికి. పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు" అన్నాడు శివుడు, పార్వతితో. "అవును" అన్నది పార్వతి, అంగీకరిస్తూ🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా
వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ‘ నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని
కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే
శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల అడవిలోకష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పక్షుల కిలకిలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా .
శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన కలుగుతుంది.
ఈ ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతోదర్శనమిస్తుంది. రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతుల్లో జపమాల , శివలింగంధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించబడింది.
అందుకే ఈ అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు.
ఇష్ట కామేశ్వరి అమ్మ వారు నుదురు మెత్తగాఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై బొట్టు పెడితే తమ కోరికలు 41 రోజుల్లో తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించి తమ
తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి
పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్ ఫుడ్ ఆఫ్ గాడ్’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన ఇటీవల
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
🙏ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం🙏
🙏సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి,
ఓం నమో వేంకటేశాయ
సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి.
మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట.
అలా.. శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది.
శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి.
గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు.
శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, 🙏