గుడి అవసరంలేని దేవుళ్ళు !
వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా?
కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి.

వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా
వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి.

1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర , MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తీగా
వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు : '' ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి
వ్యక్తీ దేశద్రోహియే '' అని మనకు వివేకానందుడు చెప్పలేదా ? '' వివేకానంద , గాంధీ , వినోబా భావేల జీవితాలు , ఆదర్శాలు , ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి.

ఇంటికొచ్చాడు. తల్లితండ్రులతో '' నేను మారుమూల పల్లెల్లోని పేదలను డాక్టరు గా సేవించేందుకు వెళతాను.''
తండ్రి ఆనందం ఆవిరి అయ్యింది. తల్లి సమాధానం మౌనం అయ్యింది. డా.రవీంద్ర, మహరాష్ట్ర లో అత్యంత వెనుకబడిన అయిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామాన్ని ఎన్నుకొన్నాడు. అదే ఎందుకు ? దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దానీ పేరు Where There Is No Doctor. వ్రాసినది David Werner.
ఆపుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూవుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా Hospital 30 kms away అని వ్రాసివుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించివుంటూంది. అలా వైద్య సౌకర్యాలు ఏవీ లేని ఒక నిరుపేదల గ్రామానికివెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన
అనుకొన్నాడు. తరువాత తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు. అపుడు ప్రొ. జూజు అనే ఆయన అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలి : 1. Sonography or Blood Transfusion లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయగలగడం , 2. X-ray లేకుండా న్యుమోనియా
కు వైద్యం చేయడం , 3. డైఏరియా కు వైద్యం చేయడం. 6 నెలలు ముంబాయి లోవుండి వాటిని నేర్చుకొన్నాడు రవీంద్ర. వెంటనే బైరాఘర్ కు వచ్చాడు. ఆ పల్లెకు బస్సులు లేవు. అమరావతి [ మహరాష్ట్ర] నుండి 40 కి.మి. నడచివెళ్ళాలి. అలాగే వచ్చాడు అతను. అక్కడే చిన్న గుడిశె వేసుకొని అక్కడి రోగులకు వైద్యం
చేసేవాడు. ఆ పల్లె పేదరికం , నిరక్షరాస్యత , వ్యాధులతో నిండివుంది. ఒక్కడే అంతమందిని సేవించడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు. డాక్టరు అయిన యువతి కావాలని. కానీ ఆయన 4 షరతులు పెట్టాడు. వాటికి ఒప్పుకొన్న యువతినే తాను
పెళ్ళిచేసుకొంటాను అని. 1. 40 కి.మీ. నడవగలగాలి. 2. 5 రూపాయల పెళ్ళికి ఒప్పుకోవాలి. [ 1989 లో రిజిస్టరు పెళ్ళికి ఫీజు అట అది ] 3. కేవలం 400 వందరూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. [ ఎందుకంటే డా. రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి
తీసుకొంటాడు ]4. అవసరమైతే ప్రజలకోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి. 100 సంబంధాలు వచ్చినా , ఈ షరతులు చూసాక 99 మంది వెళ్ళిపోయారు. ఒక యువతి సరేనంది. ఆమె పేరు డా. స్మిత [ ఫోటో లో వున్న వ్యక్తి]

1991 లో డా. స్మిత ప్రసవ సమయంలో స్వయంగా తానే వైద్యం చేస్తాను అన్నాడు డా. రవీంద్ర.
కానీ ఆమెకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు ఆమెను నగరం తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు. ఆమెను అడిగితే ' మీ ఇష్టం ' అంది. '' ఒకవేళ నేను ఈమెను నగరం తీసుకెళితే , ఇక నేను తిరిగిరాను. మీకు లేని సౌకర్యాలు మేము అనుభవించడం మాకు ఇష్టం లేదు '' అని పల్లెప్రజలకు చెప్పాడు.
డా. స్మిత '' మీరే నాకు వైద్యం చేయండి , నగరం వద్దు , '' అనింది. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి జన్మించాడు. ఆ దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళకు ఆ యువ దంపతులు ఆది దంపతుల్లాగా లాగా కనిపించారు.

నెమ్మదిగా ప్రజలు వీరిద్దరినీ నమ్మడం మొదలుపెట్టారు.
ఏడాది లో ఒక నాలుగు నెలలు మాత్రం పొలం పని ఉంటుంది. మిగిలిన సమయమంతా పనివుండదు. కాబట్టి ఆహారం కొరత , డబ్బు కొరత , దాని కారణంగా రకరకాల వ్యాధులు. ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా వుండవు , అందుకే వాళ్ళకు న్యుమోనియా లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ
ఆలోచించి , ఈ పరిస్థితి మారాలంటే వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండిగింజలు వీళ్ళే పండించుకోవాలి. అందుకోసమని డా. రవీంద్ర నగరంలోవుంటున్న ఒక వ్యవసాయ సైంటిస్టు స్నేహితుడితో సలహాలు తీసుకొని , విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా క్రిమి , కీటకాలను ఎదుర్కొనగలిగే
కొత్త , ఆరోగ్యవంతమైన విత్తనం రకాన్ని కనుక్కొన్నాడు. దాన్ని సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును '' నీవు నగరం లో పై చదువులు వదులుకొని ఒక రైతు కాలేవా ? '' అని అడిగితే '' అలాగే , మీరు ఎలా అంటే అలా, '' అన్నాడు కొడుకు రోహిత్. అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా ఒక చోట
భూమి దున్నితాము తయారుచేసుకొన్న విత్తనాలను నాటి , చక్కటి పంట తీసి పల్లె వాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని , వాళ్ళను హెచ్చరిస్తూ పంట నష్టం కాకుండా చేస్తాడు డా. రవీంద్ర.
ఆ తరువాత పండిన పంటను ప్రజా పంపిణి వ్యవస్థ [ Public Distribution System] ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేసారు.ఇపుడు తిండికి లోటుండదు , రెండుపూటలా తిండి కారణంగా , ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే ఇపుడు
ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లె లో వచ్చిన మార్పు వింటే మనం ఆశ్ఛర్యపోతాం. నగరం లో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండిన యువతీ యువకులు ఏడాది కి సంపాదించే డబ్బుకు సమానంగా ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే
స్థాయికి ఎదిగింది.

ప్రపంచంతో సంబంధాల్లేకుండా వుండిన ఆ పల్లె లో వస్తున్న కొత్త ప్రపంచపు వెలుగులు చూసాక మహరాష్ట్ర ప్రభుత్వపు మంత్రి [ గతంలో - ఇపుడు కాదు ] ఆ పల్లెకు వచ్చాడు. ఆయన డా. రవీంద్ర , డా. స్మిత , వాళ్ళ కుమారుడు రోహిత్ లు చేస్తున్న పని చూసి చాలా సంతోషించి , '' మీరున్న ఈ
చిన్న గుడిశె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తాను '' అంటే అందుకు వాళ్ళు అన్నారు : '' మాకు ఇదే చాలు , కానీ ఈ పల్లె ఇతర ప్రదేశాలతో కలిసేవిధంగాను , పల్లె లోపలానూ రోడ్లు వేయించండి.'' సరే అన్నాడు మంత్రి. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి , ఆ పల్లె ఆధారంగా
నడిచే 6 పాఠశాలున్నాయి , 12 వైద్యకేంద్రాలున్నాయి. కానీ సర్జరీ లు చేసే డాక్టరు కావాల్సివచ్చింది. అపుడు డా. రవీంద్ర తన రెండవకొడుకు రాం ను సర్జన్ కమ్మని ప్రోత్సహించాడు. అతను అది పూర్తీ చేసి ఇపుడు ఆ ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నాడు.

కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు , పేదలగుండెలే
గర్భగుడులు.
మన ఇళ్ళలో , పాఠశాలల్లో , కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పం. చెప్పాలి. మామూలుగా కాదు , హృదయానికి హత్తుకొనేలాగ చెప్పాలి.
అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు.🙏🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Radhika Chowdary

Radhika Chowdary Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

8 Apr
ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది..
అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా‌ అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ' చదువు
సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!' అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది.
అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.
‌‌‌‌‌‌‌‌ మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.
కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది.
Read 7 tweets
6 Apr
మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన Srikanth_Bolla పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా
వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ‘ నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని
కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే
Read 9 tweets
5 Apr
పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు
ఒక శివరాత్రి పండుగ రోజున శివుడిని దర్శించుకునేందుకు కాశీ విశ్వేశ్వరుని ఆలయం దగ్గర బారులు తీరిన జనాల్ని చూసి, పార్వతి శివుడితో "స్వామీ! కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కైలాసానికి వస్తారంటారే, మరి నిజంగా అంతమంది కైలాసానికి వస్తారా ..అని అడిగింది.
శివుడు నవ్వి, " కాదు దేవీ వీళ్ళలో ఏ ఒకళ్లిద్దరు ఉంటారేమో, కైలాసవాసానికి అర్హత ఉన్నవాళ్ళు!" అన్నాడు.
"ఎలాంటి వాళ్ళు?" అడిగింది పార్వతి.
చూద్దాం, రా!" అని శివుడు పార్వతిని వెంట బెట్టుకొని బయలుదేరాడు.
శివపార్వతులు ఇద్దరూ ముసలివాళ్ళుగా మారి విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు.
అక్కడ ముసలమ్మ గా తన భర్త తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్లందరినీ "అయ్యా, భక్తులెవరైనా దయ తలచండి! నా భర్త దాహం తీరేందుకు కొంచెం గంగా జలం పోయండి! నేను వెళ్ళి గంగా జలం తీసుకు రావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు- ఏ క్షణంలోనైనా ప్రాణం .
Read 12 tweets
19 Mar
ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టిన ప్రతిసారి దేవుడు ఆరగిస్తారు. ఇది నిజం… ఒక్కసారిగా అక్కడ ఆ దేవుడికి అర్చకులు ఏకంగా ఏడుమార్లు నైవేద్యం పెడతారు.

ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు ఆశ్చర్యపోవడంలోనూ తప్పులేదు. అలాగని అక్కడ జరుగుతున్న తప్పో, కల్పితమో అస్సలు కాదు.
నిజంగా ఆ దేవుడు నైవేద్యం ఆరగిస్తాడు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడా అనేగా మీరు అడుగుతున్నది.

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా తిరువరపు శ్రీ కృష్ణ దేవాలయం. ఇక్కడ కృష్టుడు చాలా చాలా ఆకలి మీద ఉంటాడు. గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంచుతారు.

ఇక్కడ స్వామికీ అర్చకులు రోజుకు 7 సార్లు
స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నైవేద్యం పెట్టిన ప్రతీమారు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇందులో తలుపులు మూసినప్పుడో లేదా అక్కడ ఎవరు లేనప్పుడో కాదు.

అందురూ చూస్తుండగానే, అర్చకులు అక్కడే ఉండగానే కాస్తంత తగ్గుతుంది. స్వామి స్వయంగా నైవేద్యాన్ని తింటారని ఇక్కడి ప్రజల నమ్మకం.
Read 8 tweets
18 Mar
శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల అడవిలోకష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పక్షుల కిలకిలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా .
శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన కలుగుతుంది.
ఈ ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతోదర్శనమిస్తుంది. రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతుల్లో జపమాల , శివలింగంధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించబడింది.
అందుకే ఈ అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు.
ఇష్ట కామేశ్వరి అమ్మ వారు నుదురు మెత్తగాఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై బొట్టు పెడితే తమ కోరికలు 41 రోజుల్లో తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించి తమ
Read 10 tweets
17 Mar
శుభోదయం..

*నాస్తికునికి.., ఆస్తికునికి మద్య సంభాషణ :

నేను జాతకాలు నమ్మను.
--- అవును అది మీ జాతకంలోనే ఉంది.

నేను దేవుడిని నమ్మను.
---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.

నాకు దేవుడిని చూపించగలరా?
---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలి కదా. Image
ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.

మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం..?
---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు
గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?

దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా.

దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
-నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!