వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్యుల వారి జయంతి ‘ఆదిశంకరాచార్య ప్రతిష్ఠాపిత మూలామ్నాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి” వారి జయంతి. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు,..
నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు.

ఆయన పరమాత్మస్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు.

ఆది శంకరాచార్య స్వామి వారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే,
పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు (20 May 1894 – 8 Jan 1994). ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు.
ఒక్క మాటలో చెప్పలంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి వారే. త్రేతాయుగం లో శ్రీరామచంద్ర మూర్తి ఎంతటి ధర్మమూర్తో ఈ కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మ స్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే రెండు పాదాలతో స్వామి ధర్మస్థాపన చేసారు.
దలైలామ అంతటి వారు ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే అని వేనోళ్ల పొగిడారు. కంచి పీఠాధిపతిగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్యసామన్యం. నిరాడంబరత్వం, అపర కరుణా స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒకా నిముషం చూస్తే చాలు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది.
అంతటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు.

87 చాతుర్మాస్యాలు చేసిన ఒకేఒక్క సన్యాసి, ఆయన నడిచే విశ్వవిద్యాలయం, వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలయందు దిట్ట. గాలిలో విభూతి తీయడం గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు.
ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాము అనే భావన మనకు కలుగచేయడమే పెద్ద మహిమ. అణిమాది అష్టసిధ్ధులు ఆయన వశం. సకల శాస్త్రాల యందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిధ్ధపడ్ద త్యాగి. లక్షల కుటుంబాలను సదాచారం వైపు..
వైదిక అనుష్టానం వైపు మళ్ళించి సనాతన ధర్మాన్ని ఉధ్ధరించారు. ఆయన అవతారం రాకుండా వుండి ఉంటే ఈవాళ మనం ఈమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించేవారం కామేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈ రోజు ఆయాన్ను స్మరించుకోవడం పాప హరణం.

జయ జయ శంకర హర హర శంకర
కాంచి శంకర కామకోటి శంకర

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Brahmasri Samavedam Shanmukha Sarma

Brahmasri Samavedam Shanmukha Sarma Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SriSamavedam

25 May
Nārasimha Vapu:
[21st nāma in Śrī Viṣṇu Sahasranāma stōtra]

Literal meaning of this nāma is one who took the body of man-lion.

#Thread - on Sri Narasimha swaroopam #NarasimhaJayanthi Image
In the first twenty nāmās starting from ‘Viśwam’ to ‘Pradhāna Puruṣēśwara’ only formless parabrahma is expounded. All these elucidate the formless and holistic Brahman. That all pervading supreme consciousness is expressed as a ‘Form’ for the first time in this nāma.
Why only this form is mentioned among many other forms of Viṣṇu?

This implies that this form is the amalgamated form of all the twenty characteristics of formless supreme described in the first twenty nāmās, which embeds in Itself many intricacies of Yōga.
Read 29 tweets
22 May
HINDU TEMPLES ARE EPICENTERS OF ENERGY

Upasana (Worship & Spiritual Practice) and corresponding Sastras such as Mantra, Tantra, Shilpa, and Agama etc. envisioned the ‘Deity ‘in three basic forms.

1. Mantra
2. Yantra
3. Vigraha
1. Mantra – This is the sound form of the deity and is micro

2. Yantra – This is the geometrical form of the deity and is little macro.

3. Vigraha – This is the metaphysical embodiment of the deity that can be experienced by human senses.
It is very important to understand that Idol contains both Mantra and Yantra, just like our body contains both Prana and Buddhi. As many deities, so many Mantras and so many Yantras.
Read 11 tweets
17 May
śambhōrmurtiścarati bhuvanē. #Thread

Maharshi Veda Vyasa’s compassionate contribution towards the upliftment of humanity is incredible. As time is the biggest devourer of everything, few centuries after His advent, around 72 different Anti-Vedic schools appeared on the horizon.
Vedas r thoroughly misinterpreted suiting one’s convenience & such propaganda reached its pinnacle. It’s like the gigantic tree of Sanatana Dharma is encircled in poisonous creepers producing poisonous fruits & covered by thorny bushes, which though r attributed 2 d tree itself.
Chaos prevailed all over. In such dangerous situation, Sanatana Dharma needed one who has clarity in direction, command in Vedas, conviction in Dharma, control over senses, capacity to organize, and courage to establish truth. All the gods decided to seek the help of Lord Siva..
Read 17 tweets
16 Apr
చలల్లోలకల్లోల కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః!
హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!!

ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్.
మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక మత్స్యపురాణము పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది.

పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము మత్స్య పురాణము.
దీనిని బట్టి ఆ పురాణము విలువ, మత్స్యావతారము యొక్క ప్రాధాన్యత అవగతమవుతోంది.
మత్స్యావతారునిగా నారాయణుని ఉపాసిస్తే పరాపర విద్యల నొసగడమే కాక మోక్షాన్ని కూడా కలుగజేస్తాడు. అంతేకాక ఐశ్వర్యానికి ప్రతీకగా మత్స్యాన్ని శాస్త్రాదులు పేర్కొన్నాయి.

నవనిధులలో మత్స్య నిధి చాలా ప్రధానమైనది.
Read 20 tweets
15 Apr
మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం.
కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.

సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.
మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి?

ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు.
Read 12 tweets
19 Feb
శివాజీ జన్మతః నాయకత్వ లక్షణములు, ధైర్యసాహసాలు, దేశభక్తి, దైవభక్తి మెండుగాగల గొప్ప యోధుడు. శ్రీ సమర్ధ రామదాసు వారి శిష్యుడు. సంస్కృత పండితులను ఆదరించి, సత్కరించిన ఉత్తమపరిపాలకుడు. శ్రీ చాణుక్యుని అర్థశాస్త్రము మరియు ధర్మశాస్త్రాల ఆధారముగా తన పరిపాలన కొనసాగించిన ధార్మిక ప్రభువు. Image
జననము, బాల్యము:

శివాజీ ఫిబ్రవరి 19, 1627 పూణేకు 60కి.మీ దూరంలో గల శివ్నేరి కోటలో జన్మించారు. స్థానిక మాత అయిన శివాయి అమ్మవారిని పుత్రుని కొరకు వేడుకొనగా జగదంబ అనుగ్రహ ప్రసాదంగా పుట్టిన బాలునికి అమ్మ పేరుమీదనే, శివాజీ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. Image
తండ్రి బీజాపూర్ రాజ్యములో ఒక జాగిర్దార్. తల్లి పర్యవేక్షణలో పెరిగిన శివాజీకి పసిప్రాయంలోనే శ్రీరామాయణ, మహాభారత ఇత్యాది గాథలను బోధించి దైవభక్తికి మార్గము సుగమము చేసింది.

అంతేకాక దేశభక్తి, విదేశీ శక్తుల విరోధము, మరియు స్వాతంత్ర్య కాంక్ష నూరిపోసింది.
Read 12 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(