*శ్రీ గాయత్రి దేవి..
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః!!
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్!! గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్!! శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే!!
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం.తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటారు.. అవి..ముక్త, విద్రుమ,
హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తారు.
పురాణాల ప్రకారం.. ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపలో రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింప బడుతుంది.
గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత
. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగు వేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.
ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
..ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు
ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది.
ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే
తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి
, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది...🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాధిక

రాధిక Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

10 Oct
ప్రతిరోజూ అన్నపూర్ణా దేవిని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదు.
అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం, అన్నపూర్ణా దేవి అనుగ్రహం వలననే మనకు అన్నపానీయాలు లభిస్తున్నాయి, ఇవే కాక జ్ఞానాన్నీ, వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి. Image
శ్రీ అన్నపూర్ణాష్టకం(ఆది శంకరాచార్య విరచితం)
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
Read 9 tweets
8 Oct
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼
లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ
నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం
కోసం బాలార్చన చేస్తారు.
అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.
Read 6 tweets
7 Oct
నవ దుర్గా స్తోత్రమ్
ఈ స్తోత్రము ను ప్రతివారు ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రులలో సాయంకాల సమయమందు పఠించిన విశేష ఫలితములు సమకూరును .
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ
చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
Read 5 tweets
7 Oct
మాతర్మే మధుకైట భఘ్ని మహిషప్రాణాపహారోద్యమే
*హేలానిర్మిత ధూమ్రలోచన వథే , హేచండ ముండార్దినిృ*
*నిశ్శేషీకృత రక్తబీజ దనుజేృ నిత్యేృ నిశుంభావహే*
*శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే - నమస్తేంబికృే'*

దసరా శరన్నవరాత్రోత్సవాలలో ఆది పూజలందుకునే అమ్మవారు.🙏 Image
. *స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవి రూపంలో* భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ధర్మం నాలుగుపాదాల ఉండేటట్లుగా అత్యంత జనప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. ఒక రోజు రాజకుమారుడు నగర సందర్శనం
చేస్తుండగా అతని రథచక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తూ పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు దుఃఖించి రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడంతో పాటూ
Read 6 tweets
6 Oct
మాతృదేవో భవ! పితృదేవో భవ!
నేడు మహాలయ అమావాస్య నేడు పితృదేవతలకు తర్పణం విడిచి పితృదేవతల అనుగ్రహానికి పాత్రులు అవుదాము🙏
మాతాపితరలను కలిపి పితరులు అంటాము. వారిని సరిగ్గా చూసుకుని ఆనందపరిస్తే వారు ఆనందించడమేకాక పితృదేవతా వ్యవస్థ ఆనందిస్తుంది. మరి దేవతలకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి.మరి Image
పితృదేవతలకు.?ఉంది. బ్రుహద్ధర్మ పురాణంలొ పితృస్తుతి అనేది ఉంది.ఇది చాలా మహిమాన్వితమైనది.సాక్షాత్తు బ్రహ్మదేవునిచే చేయబడిన స్తోత్రరాజము. దీనిని ప్రతిరోజూ లేదా శ్రాద్ధ దినములందు చదువవలెను. మన పుట్టినరోజునాడు తప్పక చదువవలసినది. పితృదేవతల అనుగ్రహం ఉంటే అందరు దేవతల అనుగ్రహం ఉన్నట్లే.
1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ; సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే.

2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గీయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయచ

3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయతే నమ: సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయచ
Read 4 tweets
4 Oct
దేవీ నవరాత్రులు సమీపించుచున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం

1.! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !!

మొదటి రోజు.

!! పొంగల్ !!!! కావలసినవి !!

పెసరపప్పు 150 గ్రాం
కొత్త బియ్యం 100 గ
మిరియాలు 15
పచ్చిమిరప కాయలు 6
పచ్చి కొబ్బెర 1 కప్
కాచిన నెయ్యి 1/4 కప్
జీడిపప్పు 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కోత్తమిర , కరేపాకు , తగినంత
ఉప్పు రుచిని బట్టి
ఇంగువ 2 చిటికెళ్ళు.

!! చేయవలసిన విధానము !!

దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి
పెసరపప్పుని దోరగా ఏయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ
తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 నిమిషాలు
వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు,

అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చిపచ్చికొబ్బెర కోరి , జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం
Read 28 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(