ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
!! చేయవలసిన విధానం !!
అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి
నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో )
వుడికిన గుజ్జు అన్నంలో కలిపండి .
బాణలిలో నూనె వేడి చేసి ముందుగా
ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము
3 .! అన్నపూర్ణా దేవి !!
మూడవ రోజు
!! కొబ్బెరన్నం !కావలసినవి !!
బియ్యం 1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బెర 1 కప్
పచ్చిమిర్చి 5
కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .
పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .
జీడి పప్పు 10
నూనె , 1/4 కప్
నెయ్యి 1 టెబల్ స్పూన్
!! చేయవలసిన పద్ధతి !!
అన్నం పోడి పోడి గా వండుకొనిపచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .
అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట చిటపట అనగానేపొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరే పాక్ , కోత్తమిర ,
అందులో వేసి తీసేయండి ఈ
వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .
శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృప కు పాత్రులవుదాము.
4 .లలితా దేవి !!
నాల్గవ రోజు
!! అల్లం గారెలు కావలసినవి !!
మినపప్పు2 కప్స్
అల్లం చిన్న ముక్క
పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి
జీరా 1/4 స్పూన్
ఉప్పు రుచికి తగినంత
కరేపాక్ , కోత్తమిర తగినంత
నూనె గారెలు వేయించేందుకు
!!! చేసే విధానం !!!
మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .
దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో
ఆ శ్రీ లలితాదేవి కి ఆరాధించి నైవేద్యం పెట్టి
ఆశీర్వాదం పొందుదాము
5 .! సరస్వతి పూజ !!
ఐదవ రోజు
!! పెరుగన్నం , దద్ధోజనం !!కావలసినవి !!
బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ
చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు
నెయ్యి 1 స్పూన్
కొత్తమిర , కరివేపాకు
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు 20
ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి
!! చేసే విధానం !!
ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,
అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీవేయండిరుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని
కోరుతూ ప్రార్థించాలి.
6 !! శ్రీ మహాలక్ష్మిదేవి !!
ఆరవ రోజు
!! రవ్వ కేసరి కి కావలసినవి !!
రవ్వ 1 కప్
షుఘర్ 3/4 కప్
నెయ్యి 2 టెబల్ స్పూన్
కేసరి కలర్ / చిటికెడు.
యాలకులు 4
ఎండు ద్రాక్షా 6
జీడిపప్పు 10
మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ 1/2 కప్
!!! చేసే విధానం !!!
ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి .
మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో
కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి నెయ్యి వేస్తూ బాగాకలిపిఅందులోద్రాక్షా ,జీడిపప్పు
,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి
7 .!! కదంబం ప్రసాదం !!
ఏడవ రోజు
!! కావలసినవి !!
కందిపప్పు 1/2 కప్
బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1 వంకాయ 1/4 సొర్రకాయ
1 దోసకాయ
బీన్స్ తగినన్ని
1 పోటాటో
వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు
2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్
2 టోమాటో
తగినంత కరివేపాకు
కోత్తమీర
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప
4 పచ్చి మిర్చి
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .
!!!! చేయవలసిన విధానము !!!!
ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి
కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి
రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతావుడికినరైస్లోవేసి,కోత్తమీర ,కరేపాక్
,నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగావుడికినతరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి
8.మహిషాసుర మర్ధిని !!
ఎనిమిదవ రోజు
!! బెల్లం అన్నం కావలసినవి !!
బియ్యం 100 గ్రాం
బెల్లం 150 గ్రాం
యాలకులు 5
నెయ్యి 50 గ్రాం
జీడిపప్పు 10
!! చేసే విధానం !!!
ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి .
అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి
చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్
Sugar 1,1/2 కప్స్
ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్
ఏలకలుపౌడర్ 1/2 స్పూన్
నెయ్యి 5 టేబల్ స్పూన్స్
!! చేసే విధానం !!
ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి
తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండిఅది పక్కన పెట్టి చిన్న మూకుడు
ష్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష. ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి
ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి
( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )
అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి 10. ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం.పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా ఏట్టాలి .
*ఓం శ్రీ మాత్రే నమః*
🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏
(సేకరణ)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఆ ఇంట్లో అక్కా చెల్లెళ్లు ఐదుగురూ కలెక్టర్లే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలెక్టర్ కావాలన్న తమ తండ్రి కోరిక మేరకు వారంతా సివిల్స్‌కు ప్రిపేర్ అయి.. అనుకున్నది సాధించారు. తమ తండ్రి కోరికను నెరవేర్చేలా చేశారు. అయితే ఆ కుటుంబంలో తొలుత ఇద్దరు..
తర్వాత ఇప్పుడు ఏకంగా ముగ్గురు కలెక్టర్లుగా మారారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రాజస్థాన్‌లోని హనుమాఘర్‌కు చెందిన సహదేవ్ సహరన్ ఒక సాదాసీదా రైతు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు. వీరికి రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్ అని
పేర్లు పెట్టారు. తనకు కొడుకులు లేరని సహదేవ్ ఏనాడూ కుంగిపోలేదు. అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా... ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు
పరగడుపునే నిమ్మరసం తీసుకుంటే....??
చాలా మంది ఉదయాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగి రోజు మొదలు పెడతారు. దీంతో నిద్ర మత్తు వదిలి యాక్టివ్‌గా ఉండవచ్చని వారి భావన. అయితే ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ను తాగడం అంత మంచిది కాదు.
వీటితో జీర్ణ సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే
శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. 2. జీర్ణ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు రావు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.
.
వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.
వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో
సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.
గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని
వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా
చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.
రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం,
ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.
ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను
గుడి అవసరంలేని దేవుళ్ళు !
వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా?
కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి.
వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా
వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి.
1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర , MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తీగా
వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు : '' ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి
ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది..
అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ' చదువు
సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!' అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది.
అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.
మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.
కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది.