#నేను_తాత
తాత కి చివరి రోజుల్లో మతి చలించింది. ఎప్పుడు గేట్ లాక్ చేసి పెట్టే వాళ్ళం. చనిపోయే కొన్ని రోజుల ముందు, ఊరికి వెళ్ళడానికి తాళం తీసి,లోపల సామాన్లు సర్డే లోపల తాత బయటికి వెళ్లి పోయారు. (1/n)
#నేను_తాత.
చాలా టెన్షన్ పడ్డాము, lucky గా పాలు పోసే అబ్బాయి,మీ తాత బ్రిడ్జి మీద కన్పించారు అని చెప్పాడు. వెళ్లి తీసుకొచ్చాను. ఏడుస్తూ,ఎక్కడికి వెళ్ళా వూ, ఇంకెపుడు ఇలా చేయకు అన్నాను.
తాత నా తల మీద చెయ్యి పెట్టి ,నిన్ను వదిలి ఎక్కడికీ పోను, నీ మీద ఒట్టు అన్నారు.
(2/n)
#నేను_తాత.
అన్నం వేరు గా, కర్రీ వేరుగా తినే వారు.
ఎప్పుడు అన్నం పెట్టినా, నువ్వే అన్నం కూర కలిపి పెట్టు అని అమ్మ కి చెప్పే దాని.
అన్నిట్లో చిన్న పిల్లాడి లా మారాం చేసే వారు.
ముసలి వారు అయ్యాక,మళ్ళీ పసితనం వస్తది అన్నది,మా తాత లో కళ్ళారా చూసాను.
(3/n)
#నేను_తాత
నేను హాస్టల్ లో ఉన్నపుడు తాత చని పోయారు. ఊరికి వెళ్ళడానికి
చైతన్య పురి బస్ స్టాప్ లో అక్క నేను wait చేస్తున్నాం. ఒక 50 to 55 years అతను,లాల్చీ పైజామ వేసుకున్నారు. బడి పంతులు మోడల్ cloth bag వేసుకున్నారు. నన్నే చూస్తున్నారు. నేను గమనించాను. (4/n)
#నేను_తాత
కొంచెం సేపటికి అక్క కుడా,గమనించి,అతను నిన్నే చూస్తున్నాడు అంది. తెలుసు, ignore చెయ్యి అన్నాను.
కొంచెం సేపటికి అతను నా ఎదురు గా వచ్చి నిలబడ్డారు..
(5/n)
#నేను_తాత.
షాక్ అవ్వడం తో పాటు,ఆశ్చర్య పోయాను. నా కళ్ళ లోకి చూస్తూ, నువ్వు సంతోషం గా ఉన్నావా,అని అడిగారు.
తాత చనిపోయిన బాధ లో ఉన్నాను. అయినా, సంతోషం గానే ఉన్నాను అని చెప్పను. (6/n)
#నేను_తాత.
ఆయన నా తల మీద చెయ్యి పెట్టీ, నువు ఎప్పటికీ ఇలాగే సంతోషం గా ఉండాలి, అని చెప్పి వెళ్లి పోయారు..
నమ్మిన వారికి,ఆ వచ్చింది మా తాత...
నమ్మని వారికి......ఏమో....
.
మా వైపు ఒక నమ్మకం. చనిపోయిన వాళ్ళు,వాళ్ళు బాగా ఇష్ట పడే వాళ్ళ కి పుడతారు అని.(7/n)
#నేను_తాత.
తాత చని పోయిన 4 సంవత్సరాల కి నాకు బాబు పుట్టాడు. అప్పటి వరకు మా కజిన్స్ అందరికీ అమ్మాయిలే తప్ప అబ్బాయిలు పుట్ట లేదు.. మా సొంత అక్క తో సహ. ఊరంతా వెంకట్రామయ్య మళ్ళీ పుట్టాడు అనుకున్నారు.(8/n)
#నేను_తాత.
తాత కి జాగ్రత ఎక్కువ. & పిసినారి.
మా బాబు 2 years కూడ రాక ముందే, నేను వేసిన తాళం సరిగా పడిందా,లేదా అని లాగి చెక్ చేసే వాడు.
బయటికి వెళ్లినప్పుడు, రాత్రి పడుకున్నపుడు లైట్లు,టీవీ అన్నీ ఆఫ్ చేశానా లేదా,అని check చేసేవాడు..
ఇంత కన్నా ఇంకేమి సాక్ష్యం కావాలి.(9/n)
#నేను_తాత
తాత చివరి రోజుల్లో చిన్నాన కోసం. మా నాన్న కి అన్యాయం చేసా అని బాధ పడే వారు.
ఇప్పుడు మా నాన్న గారికి పిండం , నా కొడుకు (నాన కి కొడుకు లేరు కాబట్టి, మొదటి మనవడు,నా బాబు కాబట్టి) రూపం లో పెడుతూ ఆ రుణం తీర్చుకుంటున్నారు అనిపిస్తుంది.
(10/n)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి. @Collector_MBNR @VSrinivasGoud
Great days ahead for Government schools.
Such a great programme initiated by Telangana government..
Taken 12 priorities to be taken care.
Furniture,Water supply,Sanitary,Compound wall,kitchen room,painting etc
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి.
Proud to say..... Allocated as executive agency for Mahabubnagar Rural mandal....13 schools selected for phase I..
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి.
Attending orientation programme at Telangana Accademy of Rural Development, Rajender nagar.
Proudly saying I have studied class I to engineering.......all levels in Government organization's only...
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n)
వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)
#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు. 2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి. 3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా. 4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n)
#శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n)
#శ్రీశైలం
హఠకేశ్వరం. కేసప్ప అనే భక్తుడు కి కుండ పెంకులో బంగారు శివలింగ రూపం లో దర్శనం ఇచ్చిన స్థలం.
ఇది ఫాల ధార పంచదార ల కి 200mts దూరం లో వుంటుంది.
(3/n)