#summervibes#SummerHealth#Tips#Summer2022
వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రానురాను ఉష్ర్ణోగతల వల్ల జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ఎండలతో పాటు ఈ సీజన్లో వచ్చే వ్యాధులు జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలో ఎక్కువ సమయం గడిపిన, సమయానికి ఆహారం తీసుకోకపోయిన, కలుషిత నీరు తదితర కారణాల వల్ల వ్యాధులు వచ్చే సూచన ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అతిసారం, నీళ్ల విరేచనలు, చికెన్‌ఫాక్స్, హైపటైటేస్ వంటి వ్యాధులు వస్తాయి.
ముందు జాగ్రత్తలు తీసుకుని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని వైద్యులు కొన్ని చిట్కాలను సూచించారు.
హీట్ ఫెరాసియా(ఎండ వేడితో వచ్చే జ్వరాలు)ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయాల్లో శరీర ఉష్ణోగ్రత పెరిగి హీట్ ఫెరాసియా వ్యాధి వస్తుంది.
మనిషి 30 డిగ్రీలు ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటాడు. అది దాటితే వివిధ రకాల జ్వరాలొస్తాయి. సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకపోవడం మంచిది.
జాగ్రత్తలు: ఎండలో ఎక్కువగా తిరగకూడదు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. రసాయనాలతో తయారయ్యే శీతల పానీయాలను సేవించకూడాదు. ఐస్‌తో చేసే జ్యూస్‌లు, చెరుకు రంసం తాగవద్దు. కొబ్బరునీళ్లు తీసుకుంటే మంచిది. ఇంట్లో తయారుచేసే పండ్ల రసాలు సేవించడం ఉత్తమం. ఎండలోకి వేళ్లేటప్పుడు గొడుగును,
వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ వాడడం వలన ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎవరికైనా పనులు ఉంటే ఉదయం 6 గంటల లోపు పూర్తి చేసుకోవాలి. కార్యాలయాలకు వెళ్లేవారు ఉదయం 6 గంటలకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు వస్తే మంచిది. వడదెబ్బకు గురైన వారు ఓరల్ డీ హైడ్రేషన్ పౌడర్, కొబ్బరినీళ్లను తాగాలి
అతిసారం, నీళ్ల విరేచనాలు
ఆహారం, నీరు కలుషితమైతే అతిసారం, నీళ్లే విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా అతిసారం వచ్చే ప్రమాదం ఉంది. బయట తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యహరించాలి. సాధ్యమైనంద వరకు ఇంట్లో తయారు చేసే ఆహారాన్నే భుజించాలి.
లక్షణాలు: అతిసారం, నీళ్ల విరేచనాలు ఒకేవిధంగా ఉంటాయి. అతిసారం వచ్చిన వారిలో వాంతులు అవుతుంటాయి. మలవిసర్జన చేయడం తగ్గుతుంది, వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రం పూర్తిగా ఆగిపోతుంది. శరీరంలో లవణాలు అఽధికంగా విసర్జతమవుతాయి. ఈ వ్యాధి సోకినవారు త్వరగా నీరసిస్తారు.
జాగ్రత్తలు: నీటిని కాసి, వడబోసి చల్లార్చి తాగాలి. మట్టికుండలో నిల్వఉంచిన నీటిని తాగవద్దు, మట్టితో పాత్రలను కడగరాదు. సబ్బు, బూడిదతో శుభ్రపరచాలి. బయటకు వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడగాలి.
డీహైడ్రేషన్ వేసవిలో ఎక్కువ మంది చిన్నారులు, పెద్దలు డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు.
ఎండ తాపానికి శరీరంలోని సోడియం, పొటాషియం, క్లోరైడ్ లవణాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. అప్పుడు మజ్జిక, పండ్ల రసాలను తాగించాలి. పిల్లలను ఎక్కువ సమయం ఎండలో ఆడనివ్వకూడదు, అలా అడితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.
పిల్లలు నీరు ఎక్కువగా తాగేలా అలవాటు చేయాలి. వేసవిలో వీలైనంత వరకు వారిని నీడలోనే ఉంచే ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలతో బయటకు వెళ్తే మంచినీరు, గ్లూకోజ్ వాటర్‌ను వెంట తీసుకెళ్లాలి.
చికెన్‌ఫాక్స్(అమ్మతల్లి) వయస్సులో తేడా లేకుండా అందరికీ సోకే వ్యాధి ఇది. ముఖ్యంగా చిన్న పిల్లలు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారు. గాలి ద్వారా వచ్చే ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి సోకుతుంది.లక్షణాలు: శరీరంపై దద్దుర్లు వంటివి వస్తాయి.
కొన్నిసార్లు శరీరం లోపలి ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంది. స్వల్ప జ్వరంతో పాటు తల, వెన్ను, గొంతు నొప్పులు వస్తాయి.
జాగ్రత్తలు: వ్యాధి సోకిన వారిని ఒక గదిలేనే ఉంచాలి. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రందించాలి. ఈ వ్యాధి సోకిన వారికి వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
వ్యాధి తీవ్రత పెరిగితే న్యూమోనియకు దారితీసే ప్రమాదముంది. మెదడుకు, ఊరిపితిత్తులకు ప్రమాదం వాటిల్లుతుంది.
కామెర్లు (హెపటైటిస్)bమూత్రం పచ్చగా వస్తుంది. కళ్లు పచ్చబడతాయి. వ్యాధి కనిపించడానికి వారం రోజుల ముందే ఆకలి మందగిస్తుంది.
జ్వరం, నోరు పచ్చబడి నాలుక కింద పచ్చదనం స్పష్టంగా కనిపిస్తుంది. కాలేయం పెరుగుతుంది. కుడి వైపు కడుపు నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి పట్ల అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.
జాగ్రత్తలు: కలుషిత నీరు, ఆహారం తీసుకోవద్దు, కాచిన నీటిని సేవించాలి. చికిత్స కంటే నివారణే సరైన మార్గం.
వ్యక్తిగత శుభ్రత ఎంతో ముఖ్యం.
జాగ్రత్తలతో వేసవిని అధిగమించవచ్చు వేసవిలో ఎక్కువగా భయపడాల్సిన పనిలేదు. కచ్చితమైన జాగ్రత్తలతో వేసవిని అధిగమించవచ్చు. ముఖ్యంగా నీటిని ఎక్కువ మోతదులో రోజుకు 8 నుంచి 10 లీటర్లు తాగాలి. బయటకు వెళ్లేవారు గొడుగు తదితర రక్షణ కవచాలను తీసుకెళ్లాలి.
ఎండవేడికి శరీరం డీహైడ్రేడ్ అయితే గ్లూకోజ్ వాటర్, కొబ్బరినీరు తీసుకోవాలి. బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. నివారణ కోసం వైద్యుల సూచనలను పాటించాలి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.
శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం.
ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మండు వేసవిలో పరవళ్లుతొక్కే నీటి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాన్ని తప్పక దర్శించాలి .
బయో ఇంధనాలు బయోమాస్ ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాలనుంచి లేదా వంటనూనె, వనస్పతులను లను తిరిగి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారౌతాయి.బయో ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా,వాటిని ఏ మోతాదుల్లొనైనా కలిపి #Biodiesel #Diesel
ఒక బయో ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న మిశ్రమాన్ని మనయంత్రాల్లో పెద్ద మార్పులవసరం లేకుండానే వాటిని డీజిల్ ఇంజన్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.బయో ఇంధనాలని వాడటం సులభం,వదిలించుకోవడం సులభం, విషరహితం.దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది. #BiodieselDay 🌱🌵⛽🛢️
ప్రస్తుతం విచ్చలవిడిగా అవసరానికి మించి వాడుతున్న నేలబొగ్గు (భూమిగర్భం నుండి త్రవ్వితీసిన బొగ్గు) మరియు ముడిపెట్రోలియం నుండి ఉత్పత్తి కావించు ఖనిజ నూనెలు, వాయువులు, పెట్రోలియం బావుల నుండి ప్రారంభంలో వెలువడు సహజ వాయువు వంటివి అన్నియు శిలాజ ఇంధనాలు.
#holi 🔫🔵🔴🟢🟡🟠💜💕👣
హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు..
బంగారు వర్ణం.. లేత ఆకుపచ్చ..ఇలా ఇన్నెన్నో వర్ణాల మిశ్రతంగా కన్పించే అరుదైనకాలంలో వచ్చే పండుగ హోళీ.
హోళీ ఎందుకు చేస్తారు?
ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీనగాథల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు అయిన
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. #Telugu#Poet
ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.
కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ
చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.