శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.
శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం.
ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మండు వేసవిలో పరవళ్లుతొక్కే నీటి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాన్ని తప్పక దర్శించాలి .
బయో ఇంధనాలు బయోమాస్ ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాలనుంచి లేదా వంటనూనె, వనస్పతులను లను తిరిగి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారౌతాయి.బయో ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా,వాటిని ఏ మోతాదుల్లొనైనా కలిపి #Biodiesel #Diesel
ఒక బయో ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న మిశ్రమాన్ని మనయంత్రాల్లో పెద్ద మార్పులవసరం లేకుండానే వాటిని డీజిల్ ఇంజన్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.బయో ఇంధనాలని వాడటం సులభం,వదిలించుకోవడం సులభం, విషరహితం.దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది. #BiodieselDay 🌱🌵⛽🛢️
ప్రస్తుతం విచ్చలవిడిగా అవసరానికి మించి వాడుతున్న నేలబొగ్గు (భూమిగర్భం నుండి త్రవ్వితీసిన బొగ్గు) మరియు ముడిపెట్రోలియం నుండి ఉత్పత్తి కావించు ఖనిజ నూనెలు, వాయువులు, పెట్రోలియం బావుల నుండి ప్రారంభంలో వెలువడు సహజ వాయువు వంటివి అన్నియు శిలాజ ఇంధనాలు.
#summervibes#SummerHealth#Tips#Summer2022
వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రానురాను ఉష్ర్ణోగతల వల్ల జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ఎండలతో పాటు ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలో ఎక్కువ సమయం గడిపిన, సమయానికి ఆహారం తీసుకోకపోయిన, కలుషిత నీరు తదితర కారణాల వల్ల వ్యాధులు వచ్చే సూచన ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అతిసారం, నీళ్ల విరేచనలు, చికెన్‌ఫాక్స్, హైపటైటేస్ వంటి వ్యాధులు వస్తాయి.
ముందు జాగ్రత్తలు తీసుకుని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని వైద్యులు కొన్ని చిట్కాలను సూచించారు.
హీట్ ఫెరాసియా(ఎండ వేడితో వచ్చే జ్వరాలు)ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయాల్లో శరీర ఉష్ణోగ్రత పెరిగి హీట్ ఫెరాసియా వ్యాధి వస్తుంది.
#holi 🔫🔵🔴🟢🟡🟠💜💕👣
హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు..
బంగారు వర్ణం.. లేత ఆకుపచ్చ..ఇలా ఇన్నెన్నో వర్ణాల మిశ్రతంగా కన్పించే అరుదైనకాలంలో వచ్చే పండుగ హోళీ.
హోళీ ఎందుకు చేస్తారు?
ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీనగాథల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు అయిన
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. #Telugu#Poet
ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.
కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ
చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.