ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా,ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. #WorldEpilepsyDay #PurpleDay#EpilepsyAwareness
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం #WorldEpilepeyDay🎗️
మూర్ఛ వ్యాధి(epilepsy) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.
మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూ తెలుసుకోలేరు.
అపుడప్పుడు కొందరు క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహతప్పిపోతుంటారు. వారిచేతిలో తాళాల గుత్తి పెట్టే ప్రయత్నం పక్కవారు చేస్తుంటారు. కొందరికి ఈ సమయంలో నోట్లోనుంచి నురగ రావడం కూడా కనిపిస్తుంటుంది. వీరిని మూర్ఛవ్యాధి గ్రస్తులుగా మనం గుర్తిస్తాం.
ఈ మూర్ఛనే ఫిట్స్‌గా వైద్యులు చెప్తారు. ఆయుర్వేద శాస్త్రం మాత్రం ఈ ఫిట్స్‌ను గాని స్పృహను కోల్పోయి పడిపోవడం లాంటి లక్షణాలను అపస్మారకం అంటోంది. స్మారకం అంటే జ్ఞాపకశక్తి, అప అంటే నాశనం కావడం అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడమే నంటారు..
వ్యాధి లక్షణాలు
మూర్చ పోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుండి చొంగ కారుట ఒక్కోసారి నాలుక కరుచుకొనుట జరుగును. ఆ తర్వాత కొంత సేపటికి మరల మామూలు స్థితికి వస్తారు.
మూర్ఛ వ్యాధి ఎవరికి వస్తుంది...?
ఒక వ్యక్తిలో మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చు.
0.5 శాతం నుండి 2 శాతం వరకు ప్రజలలో తమ జీవిత కాలంలో మూర్ఛ వ్యాధి వృద్ది అవుతుంది. మన దేశంలో దాదాపు 10 మిలియన్ ప్రజలకు ఈ వ్యాధి ఉంది. దీని అర్థం ప్రతి 1000 మందిలో 10 మందికి ఉందన్న మాట.
మూర్ఛ వ్యాధిని కలిగించేది ఏది...?
మెదడులో విద్యుత్ కార్యకలాపాల ను ప్రారంభింపచేసే అంశాలకు, దానిని నియంత్రించే అంశాలకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యం ఉంది. విద్యుత్ కా ర్యకలాపాలను వ్యాపింపచేయడాన్ని పరిమితం చేసే వ్యవస్థలు కూడా ఉంటాయి. మూర్ఛ వచ్చిన సమయంలో ఈ పరిమితులు విచ్చిన్నమవుతాయి.
దీంతో పాటు విపరీతమైన విద్యుత్ విడుదలలు సంభవించవచ్చు. ఒక వ్యక్తికి కనీసం ఈ మూర్ఛ రెండు సార్లు వచ్చి నప్పుడు దానిని మూర్ఛ వ్యాధి అని అంటారు.
వ్యాధి రావడానికి కారణాలు...
జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల (కష్టమైన ప్రసూతి) వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు.
మెదుడలో లోపాలు లేదా మెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు (మెనింజైటీస్), వేడి నీళ్లతో తలంటుకోవడం, మందుల పరస్పర చర్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా మద్యపానం, నిద్రలేకపోవడం, ఆకలితో మాడడం, తారుమారు చేసే ఉద్రిక్తత, రుతు క్రమాల సమయాల్లో లోపాల మూలంగా ఈ వ్యాధి వస్తుంది.
మూర్చవ్యాధి సోకితో గతంలో వ్యాధి సోకిన వారికి మెడలో ఇనుప వస్తువును వేసేవారని, చేతిలో ఇనుప తాళాలు పెట్టడం, నోటిలో వస్తువులు దూర్చడం వంటి పనులు చేసేవారన్నారు. అయితే రానురాను పెరుగుతున్న ఆధునిక వైద్య విధానాల వలన మూర్చ వ్యాధి నివారణకు మార్గం సుగమం అయిందన్నారు.
అయినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిపట్ల అవగాహన కొరవడిందని, ప్రజల్లో మూర్చ వ్యాధిపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మూర్చ వ్యాధి వంశపారపర్యంగా వస్తుందని, బ్రెయిన్‌లో ట్యూమర్లు ఏర్పడి వచ్చే అవకాశాలున్నాయని,
ఆహారం ద్వారా వచ్చే క్రిముల వలన ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక నిమిషం కన్నా ఎక్కువ సేపు మూర్చలో ఉన్నట్లైతే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు 1. క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒకటి, రెండ్రోజులు మందులు ఆపినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 2. రోజుకు 6-8 గంటలు నిద్ర ఉండేట్లు చూసుకోవాలి. 3. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం; చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఫిట్స్‌రాకుండా ఉపయోగపడతాయి. టీవీ వీక్షించడం కూడా తగ్గించాలి. 5. మత్తు మందులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. 6. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
7. పదే పదే ఫిట్స్ వచ్చేవారు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది.
8 ఎత్తయిన ప్రదేశాలకు, నీటిలోనికి, నిప్పు దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి. 9. పెళ్ళయిన అమ్మాయిలు ఫిట్స్ మందులతోపాటు, ఫోలేట్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వాడాలి.
దీనివలన వారికి కలిగే పిల్లల్లో ఎటువంటి లోపాలు రాకుండా ఉంటాయి. 19. మూర్ఛవ్యాధి ఉన్న వారందరూ వారి పర్స్‌లో వారి జబ్బును గూర్చి తెలియజెప్పే కార్డుని పెట్టుకుంటే మంచిది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#InternationalWhiskeyDay
విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం మాష్ నుండి తయారైన స్వేదన ఆల్కహాల్ పానీయం. బార్లీ, మొక్కజొన్న (మొక్కజొన్న), రై మరియు గోధుమలతో సహా వివిధ రకాల ధాన్యాలు (మాల్ట్ కావచ్చు) ఉపయోగిస్తారు. విస్కీ సాధారణంగా చెక్క పేటికలలో ఉంటుంది,
సాధారణంగా కాల్చిన వైట్ ఓక్‌తో తయారు చేస్తారు. విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు అంతర్జాతీయ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు. #InternationalWhiskyDay
🚫 మద్యపానం ఆరోగ్యానికి హానికరం🚫
ఈ లోపు విస్కీలలో కింగ్ అయిన స్కాచ్ విస్కీ గురించి కొన్నివిషయాలు తెలుసుకుందాం.
విస్కీ అనే మాట స్కాట్లండ్ నుంచి వచ్చింది. అక్కడ మాట్లాడే గేలిక్ బాషలో Usquebaugh (అస్క్విబో) నుంచి విస్కీ అనే మాట వచ్చింది.
#WorldTheatreDay 🎭
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది.
1.ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం #TheatreDay
2.ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
3.విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
4.మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
5.నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం.
#EarthHour#EarthHour2022
భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి. #Earth
ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.
మార్చి 29 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఎర్త్ అవర్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒక్క దేశంలో ప్రారంభమైన మంచిపని ఇప్పుడు 7000 నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. డబ్లుడబ్లుఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా
#SpinachDay 🥬☘️ పాలకూర దినోత్సవం
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి.
ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర, #Spinach —ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి.
* విటమిన్ ' కె ' సమృద్ధిగా ఉంటుంది.
* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
* మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.
* దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి
* ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
భారతీయ చిత్రలేఖన🎨 పితామహుడు శ్రీ ఎస్.ఎం. పండిట్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి 💐
ఎస్ ఎం పండిట్ : భారతీయ ఆత్మ
ఈ ప్రసిద్ధ చిత్రకారుని పేరు విననివారు కూడా ఆయన చిత్రాలు చూస్తే వెంటనే గుర్తుపడతారు. దాదాపు భారతదేశపు ప్రతి మనసులో ఎంతోకొంత ఆయన చిత్రాలు ఇంకి ఉంటాయి.
ఎస్ ఎం పండిట్ 1916 కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించారు, చిన్నతనము నుండే ఆయనలోని కళా నైపుణ్యం చుట్టుపక్కలవారు గమనించే స్థాయిలో ఉంది . యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో ఆయన పెయింటింగ్ ప్రస్థానం మొదలైంది, మొదట మద్రాస్ కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో,
తరువాత ముంబై ఆర్ట్స్ కాలేజీలో కళను అభ్యసించి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఇతివృత్తంగా తీసుకుని కొన్ని వేల బొమ్మలు చిత్రించారు, వాటిలో వివేకానందుడు, మేనక , శకుంతల, గాంధీ, నల దమయంతి, కురుక్షేత్రం