#InternationalWhiskeyDay
విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం మాష్ నుండి తయారైన స్వేదన ఆల్కహాల్ పానీయం. బార్లీ, మొక్కజొన్న (మొక్కజొన్న), రై మరియు గోధుమలతో సహా వివిధ రకాల ధాన్యాలు (మాల్ట్ కావచ్చు) ఉపయోగిస్తారు. విస్కీ సాధారణంగా చెక్క పేటికలలో ఉంటుంది,
సాధారణంగా కాల్చిన వైట్ ఓక్‌తో తయారు చేస్తారు. విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు అంతర్జాతీయ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు. #InternationalWhiskyDay
🚫 మద్యపానం ఆరోగ్యానికి హానికరం🚫
ఈ లోపు విస్కీలలో కింగ్ అయిన స్కాచ్ విస్కీ గురించి కొన్నివిషయాలు తెలుసుకుందాం.
విస్కీ అనే మాట స్కాట్లండ్ నుంచి వచ్చింది. అక్కడ మాట్లాడే గేలిక్ బాషలో Usquebaugh (అస్క్విబో) నుంచి విస్కీ అనే మాట వచ్చింది.
అస్క్విబో అంటే జీవ జలం (water of life) అని అర్థం.
అదే విధంగా స్కాట్లండ్ లో తయారయ్యే విస్కీని మాత్రమే స్కాచ్ విస్కీ అంటారు. దీనికొక నిర్వచం ఉంది. దీనికి చట్టపరమయిన రక్షణ ఉంది.దేన్నంటే దాన్ని స్కాచ్ విస్కీ అనేందుకు వీల్లేదు.
శాసనంతో తన ప్రత్యేకతనుకాపాడుకుంటున్న లిక్కర్ స్కాచ్ విస్కీ ఒక్కటే.అంటే స్కాచ్ విస్కీ గొప్పతనాన్ని కాపాడుకోవాడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టం తీసుకువచ్చింది.
స్కాచ్ పవిత్రత అలాంటిది. చట్టం ఉల్లంఘించి రోడ్డు మీద కనబడిన మందునల్లా స్కాచ్ అని వూరించి అమ్మేస్తే శిక్ష పడుతుంది.
ఈ చట్టం పేరు Scotch Whisky Act,1988. ఈ చట్టం ప్రకారం కొన్ని నియమాలను రూపొందించారు. వాటిని Scotch Whisky Regulations 2009 అని పిలుస్తారు.
ఈ నియమాలలో స్కాచ్
విస్కీ చాలా స్పష్టంగా నిర్వచించారు.ఈ నిర్వచనం ప్రకారం అది తప్పనిసరిగా స్కాట్లండ్ లోనే తయారయి ఉండాలి. స్కాంట్లండ్ లో తయారీ అంటే డిస్టిల్లేషన్తో పాటు దీని తయారీ లో వాడే నీళ్లు కూడా స్కాట్లండ్ వే అయి ఉండాలి.స్కాచ్ విస్కీతయారీలో వాడే బార్లీ,
ఇతర ధాన్యాలు అన్నీ కూడా స్కాట్లండ్ సరుకే అయి ఉండాలి. స్కాచ్ విస్కీ ఏ ధాన్యంతో తయారయిందో ఆసువాసన కచ్చితంగా వచ్చేందుకు 94.8 శాతంలోపు అల్కహాలిక్ స్ట్రెంగ్త్ తో డిస్టిల్ చేయాలి.
ఇలా సేకరించిన కలి (fermentable substrate)ను 700 లీటర్ల కెపాసిటీ కి తక్కువ కాని పరిణామంతో ఉన్న ఓక్ పీపాలలోనే పులియబెట్టాలి. అపుడే అదే అధికారికంగా స్కాచ్ విస్కీ అవుతుంది.
స్కాచ్ విస్కీలో చాలా రకాలున్నాయి. అవి:
1.సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ: ఒకే డిస్టీల్లరీ లో తయారయింది.
2.సింగిల్ గ్రెయిన్ స్కాచ్ విస్కీ: ఇది కూడా ఒకే డిస్టిల్లరీలో నే తయారవుతుంది. దానికి తోడు మాల్టెడ్ బార్లీ నుంచి కాకుండా తృణ ధాన్యం నుంచి తయారవుతుంది.
3. బ్లెండెడ్ స్కాచ్ విస్కీ: పై రెండు రకాల స్కాచ్ విస్కీలను మిశ్రమం చేసి తయారుచేసేది. 4. బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీ: దీనిని రెండు లేదా మూడు రకాల వేర్వేరు డిస్టిల్లరీస్ లో తయారయిన సింగిల్ మాల్ట్ విస్కీలను కలిపి తయారుచేస్తారు.
5. బ్లెండెడ్ గ్రైన్ స్కాచ్ విస్కీ: వేర్వేరు డిస్టిల్లరీస్ లో తయారయిన సింగిల్ గ్రెయిన్ స్కాచ్ విస్కీలను కలిపి తయారుచేసేది.
ఒక 25 మిల్లీ లీటర్ల స్కాచ్ విస్కీలో అరటి పండంత క్యాలరీల శక్తి ఉంటుంది.
విస్కీ బాటిల్ సీల్ తీయకుండా ఉంటే ఎన్నాళ్లయినా అట్లే ఉంటుంది. కారణం దీనికి గాలిలోని ఆక్సిజన్ తగలకుండా బిరడా బిగించి ఉంటుంది.దీనివల్ల విస్కీ ఆక్సిడేషన్ కు లోనుకాదు. ఆక్సిడేషన్ ను నివారించేందుకు స్కాచ్ విస్కీ సీసాను టైట్ గా సీల్ చేసి బిగించేస్తారు.
దీన్ని షెల్ఫ్ స్టేబుల్ గా చేయడం అంటారు.
ఒక సారి స్కాచ్ విస్కీ బాటిల్ వోపెన్ చేశాక, ఆక్సిడేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అందువల్ల బాటిల్ వోపెన్ చేశాక ఒక ఏడాదిలోపు లేదంటే రెండేళ్ల దాకా వాడవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, సీసాఖాళీ అయ్యేకొద్ది ఆక్సిడేషన్ జరగడం స్పీడందుకుంటుంది.
విస్కీ బాటిల్ మూత తీసి ఒక పెగ్గు లాగింతర్వాత సీసాలో ఏ మార్పు వస్తుందని ఎవరికీ పెద్ద గా అసవరం లేని టాపిక్. అందుకే దీని మీద పెద్దగా రీసెర్చ్ జరగలేదు. విస్కీ ఫ్యాక్టరీలో బాటిల్ సీల్ చేసేటప్పటికి ఇందులో మొదటి చుక్కనుంచి చివరి చుక్క దాకా ఒకే రుచి ఉండేలా జాగ్రత్త పడి సీల్ చేస్తారు.
అయితే, ఒక సారి మూత తీసేశాక జిహ్వను బట్టి విస్కీ టేస్ట్ మారిపోతుంది. బాటిల్ ఆరింట అయిదొంతులు ఖాళీ అయ్యాక విస్కీ రచులు చాలా మారిపోతాయి.
ఆక్సిడేషన్ విస్కీరుచిని మార్కేస్తుంది. పీపాలో ఉన్నపుడు విస్కీ అణువులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆక్సిడేషన్ ప్రాసెస్ వీటిని తునాతునకలు చేస్తుంది.విస్కీలో ఇథనాల్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిడేషన్ బాగా నిదానంగా సాగుతుంది.
అదే వైన్ లో చాలా వేగంగా జరుగుతుంది. అందుకే మూత తీశాక వైన్ ను ఎక్కువ కాలం నిల్వ ఉంచలేం.స్కాచ్ విస్కీ తయారీ లో కొంత భాగం గాల్లోకి ఆవిరవుతంది.
దాన్ని ఏంజెల్స్ షేర్ (దేవుడి భాగం) అని పిలుస్తారు.స్కాట్లండ్ నుంచి ప్రతి సెకన్ కు 34 బాటిల్స్ ఎగుమతవుతాయి. ఇంగ్లండు ఎగుమతి చేసే ఆహారం, పానీయాలలో 20 శాతం వాటా స్కాచ్ విస్కీదే.
2017లో దీనివల్ల ఇంగ్లండుకు 4.359 బిలియన్ పౌండ్ల రాబడి వచ్చింది.
స్కాట్లండ్ జనాబా 53 లక్షలు. కాని అక్కడ నిల్వ ఉన్న విస్కీ పీపాలు రెండు కోట్లు. అంటే తలసరి నాలుగుపీపాలన్నమాట.
వీటన్నింటిని ఒక దాని తర్వాత ఒకటి పేర్చితే 30 వేల కిలో మీటర్లదాకా వస్తాయి.2017లో 30 సంవత్సరాలు మాగిన మాక్యాలన్ (Macallan) స్కాచ్ విస్కీ పీపా ధర 3,75,000 బ్రిటిష్ పౌండ్లు పలికింది. వేలంలో ఇంత ధర పలికిన స్కాచ్ విస్కీ పీపా మరొకటి లేదు.జానీ వాకర్ అనే స్కాచ్ విస్కీ పేరు విన్నారుగా.
ఇందులో జానీ అనే వాడు దీని నిర్మాత. ఆయన మొదట్లో ఒక కిరాణ కొట్టు నడిపేవాడు. అదే విధంగా టీబ్లెండ్ చేసే వాడు. తర్వాత విస్కీ బ్లెండ్ చేయవచ్చఅనుకుని మొదలు పెట్టాడు.
అంతే, జానీవాకర్ అనే బ్లెండెడ్ విస్కీ తయారయింది.అమెరికా స్థాపకుల్లో ఒక రైన జార్జి వాషింగ్టన్ కు ఒక డిస్టిల్లరీ ఉండేది. అయితే అది అగ్ని ప్రమాదంలో కాలిపోయింది.
🚫 Alcohol Consumption is Injurious to Health
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#WorldTheatreDay 🎭
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది.
1.ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం #TheatreDay
2.ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
3.విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
4.మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
5.నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం.
#EarthHour#EarthHour2022
భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి. #Earth
ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.
మార్చి 29 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఎర్త్ అవర్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒక్క దేశంలో ప్రారంభమైన మంచిపని ఇప్పుడు 7000 నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. డబ్లుడబ్లుఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా
#SpinachDay 🥬☘️ పాలకూర దినోత్సవం
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి.
ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర, #Spinach —ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి.
* విటమిన్ ' కె ' సమృద్ధిగా ఉంటుంది.
* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
* మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.
* దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి
* ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా,ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. #WorldEpilepsyDay #PurpleDay#EpilepsyAwareness
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం #WorldEpilepeyDay🎗️
మూర్ఛ వ్యాధి(epilepsy) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.
భారతీయ చిత్రలేఖన🎨 పితామహుడు శ్రీ ఎస్.ఎం. పండిట్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి 💐
ఎస్ ఎం పండిట్ : భారతీయ ఆత్మ
ఈ ప్రసిద్ధ చిత్రకారుని పేరు విననివారు కూడా ఆయన చిత్రాలు చూస్తే వెంటనే గుర్తుపడతారు. దాదాపు భారతదేశపు ప్రతి మనసులో ఎంతోకొంత ఆయన చిత్రాలు ఇంకి ఉంటాయి.
ఎస్ ఎం పండిట్ 1916 కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించారు, చిన్నతనము నుండే ఆయనలోని కళా నైపుణ్యం చుట్టుపక్కలవారు గమనించే స్థాయిలో ఉంది . యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో ఆయన పెయింటింగ్ ప్రస్థానం మొదలైంది, మొదట మద్రాస్ కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో,
తరువాత ముంబై ఆర్ట్స్ కాలేజీలో కళను అభ్యసించి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఇతివృత్తంగా తీసుకుని కొన్ని వేల బొమ్మలు చిత్రించారు, వాటిలో వివేకానందుడు, మేనక , శకుంతల, గాంధీ, నల దమయంతి, కురుక్షేత్రం