#EarthHour #EarthHour2022
భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి.
#Earth
ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.
మార్చి 29 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఎర్త్ అవర్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒక్క దేశంలో ప్రారంభమైన మంచిపని ఇప్పుడు 7000 నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. డబ్లుడబ్లుఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా
ఇదే రోజున రాత్రి 8.30 నుంచి 9.30 వరకు పవర్ కట్ చేసి ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు.ఎర్త్ అవర్ లో మనమూ భాగస్వాములం అవుదాం. కనీసం ఒక గంటపాటైనా కరెంట్ కట్ చేసి… కొన్ని లక్షల టన్నుల కాలుష్య కారకాలకు చెక్ పెడదాం.
భూకంపాలకు కూడా గ్లోబల్ వార్మింగ్ కారణమని వారు నమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో మార్చ్ 26 వ తేదీ శనివారం రాత్రి గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పివేయనున్నారు. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు
ఆయా దేశాల్లోని పలు వాణిజ్య సంస్థలు శనివారం రాత్రి 8.30 నుంచి 9.30గంటల వరకు భారీ విద్యుత్ దీపాలను నిలిపివేయనున్నాయి. అవసరమైన మేరకు చిన్నపాటి లైట్లతో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.
ఇంధన పొదుపు అవసరాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఎర్త్‌ అవ ర్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ గంట వ్యవధిలో అంతగా అక్కరకు రాని విద్యు త్‌ వస్తువుల వాడకాన్ని ఎర్త్‌ అవర్‌ మద్దతుదారులు నిలిపివేస్తారు. ఇది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. యావత్‌ ప్రపంచంలో అనేక దేశాలు వారి వారి కాలమా
నాల ప్రకారం నిర్దేశిత 60 నిముషాల కాలంలో కరెంట్ వస్తువులను స్విచాఫ్‌ చేస్తారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ అవగాహన కార్యక్రమానికి ఎర్త్‌ అవర్‌ కేవలం వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే పరిమితం కాదు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలకమైన ఇండియా గేట్‌, రాష్ట్రపతి భవ న్‌, తదితర చోట్ల ఆ గంటసేపు విద్యుత్‌ దీపాలను ఆర్పి వేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా 24 నగరాలు ఈ భూమి కోసం ఓ గంట కేటాయించడానికి సంసిద్ధమవుతున్నాయి. మరి ఈ గంట లో వాళ్ళు ఏమి చేస్తారు? విద్యుత్తుని ఆపేస్తారు. వారి వారి ఇండ్లలో విద్యుత్తుతో నడిచే పరికరాలన్నిటినీ ఆపేస్తారు.దీని వల్ల ఏమవుతోంది.
విద్యుత్తు వాడకం వల్ల కొన్ని పరికరాలు వదిలే గ్రీన్ హౌస్ వాయువులు ఆ గంట పాటు వెలువడవు. అలాగే మనం ఎన్ని రకాలుగా ప్రకృతిని నాశనం చేస్తున్నాము అన్నది ఆలోచించవచ్చు. అదే విధంగా ఇప్పటికైనా మేలుకుని ఎన్ని రకాలుగా మనం ప్రకృతికి హాని కలగించకుండా జీవించచ్చు అన్నది కూడా తెలుసుకోవడానికి
ప్రయత్నించవచ్చు.స్థూలంగా ఆలోచిస్తే మనకు కరెంటు ఆదా అవుతుంది. టి వి రొద ఉండదు కనుక, ఫాను, ఏ సి వగైరాలు ఉండవు కనుక మనం మన కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడుపుతాము.ఆరు బయటకు వచ్చి ఆకాశాన్ని, చందమామని, నక్షత్రాలని చూస్తాము. కలుషితమైన గాలి ఉంటుంది. చెట్లు పెద్దగా కనపడకపోవచ్చు.
అప్పుడు మెల్లిగా మన ఆలోచనలు మన బాల్యం వైపు మళ్ళుతాయి. చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుకొస్తాయి. వర్షాలు కురవాలంటే చెట్లు ఎంత అవసరం. చెట్లు మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. మనకు హానికరమైన కార్బన్ డై ఆక్సైడ్ ని అవి తీసుకుంటాయి.చెట్లెక్కి ఆడుకోవడం,
చెట్ల నీడన సేద తీరడం ఇవన్నీ మన పిల్లలకి మనం అందిస్తున్నామా!! ఈ కాంక్రీట్ జనారణ్యాలలో వృక్షాలకు చోటు లేకుండా చేస్తున్నామా? మన బాధ్యత ఎంత? ఇలా ఆలోచించవచ్చు. కొవ్వొత్తుల వెలుగులో అందరూ కలిసి భోజనం చేయచ్చు. సరదాగా పాటలు పాడుకోవచ్చు. అపార్ట్మెంటులోని సభ్యులందరినీ
కూడగట్టి అందరూ పాల్గొనెలా ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టచ్చు. చీకటి ద్వారా ప్రకృతి కోసం చిరు దీపాలు ఎలా వెలిగించవచ్చు అన్నది ఆలోచించి అమలు జరపచ్చు.ఏమైనా చేయచ్చు. ఓ ఆహ్లాదకరమైన మార్పు దిశగా మొదటి అడుగు వేయండి.🌍 #EarthHour 💡

మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా..

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

Mar 27
#NeighbourDay2022
#Neighborday #neighbourday
* ఇరుగుపొరుగు * దినోత్సవం
#NationalNeighborDay
ఆవానసం కలిపిన ఆత్మీయ బందువులు వీరు
అవసరార్థం మనం ఇంటి వారిని వదిలి వెళ్ళాల్సి
వచ్చినప్పుడు దైర్యన్నిచ్చే ఆప్తులు వారు

కష్టం ఎదురైనప్పుడు కొండంత మనోబలాన్ని
ఇచ్చే నహవాన స్నేహితులు వీరు Image
అన్యోన్యత కరువయ్యి అయినవారు అందనివారు
అయినప్పుడు మేమున్నాం అంటూముందుకు వచ్చే
మాన్యులు వారు

విలువైన మైత్రి, ఐక్కత, అనుబంధాలు కలబోసినా
మనుషులు కలినసి జరిపే సాముహిక ఆద్యాత్మాక
కార్యక్రమాలు కు ఆలంబనా వీరు

పక్కింటి విన్నిగారు ఇచ్చిన గోంగూర
ఎదురింటి బామ్మగారు వండిన ఆవ పెట్టిన అరటి
కూర

సెలవల్లో పొరిగింటి చుట్టాలు మనతో గడిపిన
నందర్భాలు చిన్నప్పుడు చిట్టి చిట్టి తప్పులకు

ముందింటి అత్తమ్మ అమ్మ కు చెప్పిన చాడీలు
వర్ణించతరమా మర్చిపోగలమా
Read 4 tweets
Mar 27
#InternationalWhiskeyDay
విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం మాష్ నుండి తయారైన స్వేదన ఆల్కహాల్ పానీయం. బార్లీ, మొక్కజొన్న (మొక్కజొన్న), రై మరియు గోధుమలతో సహా వివిధ రకాల ధాన్యాలు (మాల్ట్ కావచ్చు) ఉపయోగిస్తారు. విస్కీ సాధారణంగా చెక్క పేటికలలో ఉంటుంది, Image
సాధారణంగా కాల్చిన వైట్ ఓక్‌తో తయారు చేస్తారు. విస్కీ ని ఆనందంగా ఆహ్లాదంగా సేవిచండం, విస్కీని దుర్వినియోగ పర్చకుండా జాగ్రత్తపడటం కోసం విస్కీ ప్రియులు అంతర్జాతీయ విస్కీ దినోత్సవ జరుపుకుంటారు.
#InternationalWhiskyDay
🚫 మద్యపానం ఆరోగ్యానికి హానికరం🚫

ఈ లోపు విస్కీలలో కింగ్ అయిన స్కాచ్ విస్కీ గురించి కొన్నివిషయాలు తెలుసుకుందాం.
విస్కీ అనే మాట స్కాట్లండ్ నుంచి వచ్చింది. అక్కడ మాట్లాడే గేలిక్ బాషలో Usquebaugh (అస్క్విబో) నుంచి విస్కీ అనే మాట వచ్చింది.
Read 23 tweets
Mar 27
#WorldTheatreDay 🎭
ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడింది.
1.ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
#TheatreDay Image
2.ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
3.విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు మరియు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
4.మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
5.నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం.
Read 32 tweets
Mar 26
#SpinachDay 🥬☘️ పాలకూర దినోత్సవం
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి.
ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర, #Spinach —ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి.
* విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది.
* ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి.
* మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు.
* దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి
* ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
Read 14 tweets
Mar 26
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా,ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. #WorldEpilepsyDay
#PurpleDay #EpilepsyAwareness
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
#WorldEpilepeyDay🎗️
మూర్ఛ వ్యాధి(epilepsy) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.
Read 18 tweets
Mar 26
భారతీయ చిత్రలేఖన🎨 పితామహుడు శ్రీ ఎస్.ఎం. పండిట్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి 💐

ఎస్ ఎం పండిట్ : భారతీయ ఆత్మ

ఈ ప్రసిద్ధ చిత్రకారుని పేరు విననివారు కూడా ఆయన చిత్రాలు చూస్తే వెంటనే గుర్తుపడతారు. దాదాపు భారతదేశపు ప్రతి మనసులో ఎంతోకొంత ఆయన చిత్రాలు ఇంకి ఉంటాయి.
ఎస్ ఎం పండిట్ 1916 కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించారు, చిన్నతనము నుండే ఆయనలోని కళా నైపుణ్యం చుట్టుపక్కలవారు గమనించే స్థాయిలో ఉంది . యూరోపియన్ చిత్రకారుల ప్రభావంతో ఆయన పెయింటింగ్ ప్రస్థానం మొదలైంది, మొదట మద్రాస్ కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో,
తరువాత ముంబై ఆర్ట్స్ కాలేజీలో కళను అభ్యసించి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఇతివృత్తంగా తీసుకుని కొన్ని వేల బొమ్మలు చిత్రించారు, వాటిలో వివేకానందుడు, మేనక , శకుంతల, గాంధీ, నల దమయంతి, కురుక్షేత్రం
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(