పులగం

రాయలసీమలో పులగం పేరు తెలియని వారు ఉండరు. శనివారాల్లో, పండగ దినాల్లో ( ముఖ్యంగా సంక్రాంతి పండుగకు) సీమ ఇండ్లల్లో ఎక్కువగా పులగం చేసుకుంటూ ఉంటారు. అందరూ సాధారణంగా చేసుకునే వంటకమైనా, పులగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.

పులాక అనే సంస్కృత పదము నుండి పులగము అనే పేరు వచ్చింది.
పులాకము అంటే అన్నపు మెతుకు అని అర్థము. పెసర పులాకము / పెసర పులగాన్నే సంక్షిప్తంగా పులగం అంటున్నారు. బియ్యానికి, పొట్టుతో కూడిన పెసరపప్పు (పెసర బేడలు) కలిపి చేసే అన్నమే పులగం. పులగాన్ని ముద్గాన్నాము లేదా ముద్గలాన్నాము అని కూడా అంటారు.
ముద్గలు అంటే పెసలు అని అర్థం. అందుకే పెసర పులగానికి ముద్గాన్నము అని కూడా పేరు. పిండిపదార్థం (carbohydrates) (బియ్యం) , మాంసకృత్తులు(preoreins) (పెసలు) కలగలిపి చేసే పులగం రుచిపరంగానే కాక, ఆరోగ్య రీత్యా కూడా శ్రేష్టమైనది.
పులగం ఎక్కువగా శనివారమే ఎందుకు చేసుకుంటారు ? దానికీ ఒక చరిత్ర ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో ఈ పెసర పులగం కూడా ఒకటి.

అందుకని స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు ఆయనకు ఇష్టమైన నైవేద్యం పులగం చేసి, స్వామివారికి సమర్పించి ఆ తరువాత తినేవారు.
అలా పులగం శనివారం చేయడం అలవాటయ్యింది. ప్రత్యేకించి ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువుకు పులగం నైవేద్యంగా పెడితే స్వామివారిని వెయ్యి సంవత్సరాలు పూజించిన ఫలం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.

॥ కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |

సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి ||
తమకు నచ్చిన రుచికి అనుగుణంగా బియ్యం, పెసర బేడల పరిమాణంతో పులగం చేస్తూ ఉంటారు. కొందరు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు వాడితే, మరికొందరు అరకప్పు, పావు కప్పు పెసర బేడలు వాడుతూ ఉంటారు. అయితే బియ్యం, పెసరపప్పు సరిసమానంగా తీసుకుని చేసే పులగం ఉన్నతమైనది అంట.
పులగం - నెయ్యి జానపద పిట్ట కథ

పులగం లోకి చెనిక్కాయ పచ్చడి (వేరుశనగ / పల్లీ పచ్చడి) మరియు నెయ్యి అద్భుతమైన కాంబినేషన్. రాయలసీమలో ఈ కాంబినేషన్ ఎంత ప్రాచుర్యం పొందినదంటే పులగం - నెయ్యి గురించి ఏకంగా జానపద కథలు అల్లేంతగా.. అలా చిన్నప్పుడు విన్న జానపద పిట్ట కథలలో ఒకటి👇
ఒక ఊరిలో దంపతులు ఉండేవారు. ఆమె పేరు పులగం, అతని పేరు నెయ్యి. వారికి ఒక ఎనుము ఉండేది దాని పేరు దొంగ. ఒకరోజు ఒక దొంగ వాళ్లింట్లో దొంగతనం చేయాలని భావించి నెయ్యి(భర్త) దగ్గరికి వెళ్లి తాను వాళ్ళ దూరపు బంధువును అని చెప్తాడు. ఇంటికెళ్లన్నా, ఇంట్లో పులగం(భార్య) ఉంది అని చెప్తాడు నెయ్యి
దొంగ విషయం తెలీక తినే పులగం అనుకుంటాడు. ఇంటికివెళ్లి పులగాన్ని(భార్యని) కలిసి తాను వారి దూరపు బంధువునని, ఆమె భర్త ఇంటికి వెల్లమన్నాడని చెప్తాడు. అప్పుడు ఆమె అన్నా, భోజనం ఇప్పుడే చేస్తారా లేక నెయ్యి(భర్త) వచ్చాక చేస్తారా అని అడుగుతుంది. వచ్చిన దొంగతనం గురించి మరచిపోయి
కమ్మగా పులగంలో, నెయ్యి వేసుకుని తినొచ్చు అని అనుకుని నెయ్యి వచ్చాకే తింటాను అని చెబుతాడు. కాసేపటికి పొలం నుండి నెయ్యి (భర్త) వస్తాడు. వచ్చీ రాగానే బయట తిరుగుతున్న ఎనుమును చూసి, ఏమే, దొంగను (ఏనుమును) అట్లా వదిలేశావ్, తాడు ఇట్లా పట్టకరా, కట్టేస్తా అని అరుస్తాడు.
పులగం, నెయ్యి తిందాము అని ఎదురుచూస్తున్న దొంగ ఈ మాటలు విని, తాను దొంగ అనే విషయం వాళ్లకు తెలుసిపోయిందేమో అని అక్కడి నుండి పరిపోతాడు. ఇప్పటికీ పులగం, నెయ్యిలకి వాళ్లింటికి వచ్చిన దూరపు బంధువు అన్నం తినకుండానే ఎందుకు పరిపోయాడో తెలీదు.

చాలామంది పులగం, పొంగలి ఒకటే అనుకుంటూ వుంటారు.
రాయలసీమలో రెండింటినీ చేసే విధానం పూర్తిగా భిన్నమైనది. పులగం ఎలా చేస్తారో ఇంతకు ముందే రాశాను. ఆ తీగ ఇక్కడ పొందుపరుస్తున్నాను.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

Jun 12
హిందూపురం - సూగూరు

రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో,
వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు
సిద్ధోజీ, అతని సైన్యం సూగూరును వదిలిపెట్టి వెళ్లినా, వారు అక్కడే స్థిరపడినారు. తరువాత గుంతకల్ - బెంగళూరు రైల్వే లైను హిందూపురం మీదుగా వెళ్లడం వల్ల, బెంగుళూరుకు సమీపంగా ఉండటం వల్ల, కాలక్రమేణా హిందూపురం / సూగూరు వాణిజ్య కేంద్రంగా ఎదిగి, పెద్ద పట్టణం అయ్యింది.
Read 5 tweets
Jun 11
రాయలసీమను పాలించిన కొన్ని రాజవంశాల చిహ్నాలు / లాంఛనాలు / పతాకాలు

1. రేనాటి చోడులు
2. బాదామి చాళుక్యులు
3. చోళులు
Read 9 tweets
Jun 10
*Vakuḷamāta temple inscription from Pērūru,Tirupati district,A.P*

This inscription is engraved on a rock in front of the gopura of Vakuḷamāta temple,Pērūru, Tirupati district, Andhra Pradesh.
It is written in Tamil language and characters and belongs to the 20th regnal year (1198 C.E) of Kulottuṅga Chola III

It is damaged and records the installation of the deities Añchādavinna(Kara)pperumāl and his wife (pirāttiyār) in the Añchādavinnakar temple of
Talaiyur-perur in Kudavūr-nādu of Tiruvēńgada kōttam, Jayańgondachōlamandalam by a certain person from Puliyūr kōttam.

#సీమశాసనాలు #సీమచరిత్ర

Source : ASI
Read 4 tweets
May 31
శ్రీకృష్ణదేవరాయల ఆగ్రహం - పుష్పగిరి అగ్రహారం

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి ImageImage
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.
Read 14 tweets
May 31
కంబదూరులోని కళ్యాణి చాళుక్య చక్రవర్తి నాలుగవ సోమేశ్వరుడి శాసనం

Sōmēśvara IV inscription from Kambaduru, Anantapur District, Andhra Pradesh

This inscription is found near the Akkamma temple in the village Kambaduru, Anantapur district, Andhra Pradesh.
It is written in Kannaḍa language and characters, dated in Śaka 1108, Viśvāvasu, Chaitra Śu 15, Monday (Irregular) = 1186 C.E. April 5, (However the week day was Saturday)

Records the gift of 6 Khanduga _ of wet land to the god Kamblēśvara of Kambadahola after laving the feet
of Yogiramadeva of Rumam, on the occasion of lunar eclipse by mahāmaṇḍalēśvara Tribhuvana Malla Bhōgadēva Cholamahārāja ruling from Henjēṛu under the Kalyāni Chālukya king Sōmēśvara IV.

#సీమశాననాలు #సీమచరిత్ర

కర్టెసీ: ASI
Read 4 tweets
May 22
రాయలసీమలో భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులు

1. శ్రీకాళహస్తి కలంకారీ
2. ఆంధ్రప్రదేశ్ (నిమ్మలకుంట) తొలుబొమ్మలు
3. తిరుమల శ్రీవారి లడ్డు
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(