శరదృతువు,ఆశ్వీయుజ మాసం మొదటి తొమ్మిది రోజులని "దేవీ నవరాత్రులు"గా జరుపుకుంటాం.
ఇది వర్షాకాలం,చలికాలంకి మధ్యలో వచ్చే సంధికాలం.వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే రోజులు.
యమధర్మరాజు దంష్ట్రలు(కోరలు) సంవత్సరంలో రెండు సార్లు బైట పెడతాడట!అందువల్ల
ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.కానీ ఆ బాధలు లేకుండా చెయ్యడానికి ప్రకృతిలో దొరికే ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించవచ్చు.
ఉగాది సమయంలో,ఎండాకాలం మొదలయ్యే ముందు ఒకసారి,మళ్ళీ దసరా సమయంలో రెండో సారి ఇలా జరుగుతుంది.
వాటికి నివారణగా ప్రకృతి ఇచ్చిన ఓషధాలే -వేపపువ్వు &ఉసిరికాయలు.వీటిని ఆయా
సమయాల్లో ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటాము.
నవదుర్గ పూజ
అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరణ చేసి, పూజిస్తాము. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం.
ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, పూజిస్తారు.
అన్ని ప్రముఖ దేవాలయాల్లో, ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్లో చాలా ఘనంగా చేస్తారు దేవీ నవరాత్రులు.
ధనం,ధాన్యం,ధైర్యం,విద్య,సంతానం,ఆయుష్షు,ఐశ్వర్యం,విజయం అన్నీ ప్రసాదించేది అమ్మ.
ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం,దేవీ ఖడ్గమాల,లలితా త్రిశతి, మొదలగు స్తోత్రాలు,అష్టోత్తరాలు చదివి పూజ చెయ్యాలి.
కుదరని వారు కనీసం "శ్రీ మాత్రే నమః" అని జపం చేసినా పుణ్యమే.
#బొమ్మలకొలువు
దసరా ఉత్సవాలలో భాగంగా బొమ్మలకొలువు పెడతారు కొన్ని ప్రాంతాలలో.
బేసి సంఖ్య వరుసల్లో రకరకాల
బొమ్మలు అందంగా అలంకరించి,పేరంటాళ్లను పిలిచి తాంబూలాలు పంచిపెడతారు.ఒకప్పుడు బొమ్మలు ఏదైనా పెద్ద దేవాలయాల దెగ్గర కానీ,తిరునాళ్ళ అంగడిలో కానీ దొరికెవి.సాధారణంగా రకరకాల భంగిమల్లో ఉన్న దేవతామూర్తులు,పురాణాల్లో ఉన్న ఘట్టాలు తెలియచేసే బొమ్మలు పెట్టేవాళ్ళు బొమ్మలకొలువులో.ఆయా దేవాలయాల
విశేషాలు,రామాయణ భాగవతాల్లోని వ్యక్తుల వివరాలు,మొదలైనవన్ని తెలిసేవి పిల్లలూ పెద్దలకు ఆ బొమ్మలు చూడటం ద్వారా.
ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్ని గుమ్మడిపువ్వులతో(ఈ కాలం లో బాగా దొరుకుతాయి)పసుపు కుంకుమలతో అలంకరించి,చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటాలు ఆడుతూ దైవ సంబంధమైన పాటలు పాడతారు.తర్వాత వాటిని నీళ్ళల్లో కలపడం ద్వారా వర్షాకాలం లో అపరిశుభ్రంగా మారిన నీళ్లు
శుభ్రపడేవి వినాయక చవితి పూజ పత్రితో చేస్తే,దసరా ఉత్సవాలలో పువ్వులకి ప్రాధాన్యత ఎక్కువ.
#జమ్మి_చెట్టు
దసరా రోజు సాయంత్రం జమ్మి/శమీ వృక్షానికి పూజ చేస్తారు.వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ'అని పేరు.అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం.
పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి
వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు.
త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది.
అదే విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు.
విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం వద్ద గల "అపరాజితాదేవి"ని పూజించి,
ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు.
"శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ, కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."
పైశ్లోకం వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు
తగిలిస్తారు.
ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి , తెలంగాణా ప్రాంతంలో శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి.
ఒక పళ్లెంలో గుమ్మడి ఆకులు పరిచి,వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి తంగేడుబీర,గన్నేరు,నిత్యమల్లె, బంతిపూలను ఒక్కో వరుసలో ఉంచుతారు.
అలా ప్రకృతి నుంచీ ప్రత్యక్షమయ్యే పూలమాత బతుకమ్మ.
బతుకమ్మ పూలు,పత్రిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అవి చెరువుల్లోని నీటిలో కలుస్తాయి.అలా కలిసిన నీరు పొలాలకు వెళ్తుంది. ఆ నీటిలో ఔషధ గుణాల వల్ల క్రిములు నశించి,పంట పొలాలు చక్కగా పెరుగుతాయి.తద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ఇదే బతుకమ్మ పండుగలో ఔన్నత్యం.
అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు💐💐
అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🏻(అ ల సు)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#లలితాసహస్రనామాల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల గురించిన నామాలు ఉన్నాయి..వాటిని పెట్టడం అన్నిటి కంటే శ్రేష్ఠదాయకం
1.పాయసాన్నప్రియా(పాలతో చేసిన పాయసం)
2.స్నిగ్ధౌదనప్రియా(నెయ్యి వేసిన అన్నం,బెల్లంముక్క)
3.గుడాన్నప్రీతమానసా(బెల్లంతో చేసిన అన్నం-పరవాణ్ణం.
4.దద్యన్నాసక్తహృదయా(పెరుగు అన్నం(దద్ధోజనం)
5.ముద్గౌదనాసక్తచిత్తా(పెసరపప్పుతో కలిపి వండిన అన్నం-పులగం/కట్టె పొంగలి.
6.హరిద్రాన్నైకరసికా(పసుపుపచ్చని అన్నం-పులిహోర(చింతపండు,నిమ్మకాయ,దబ్బకాయ,నారింజకాయ,ఉసిరికాయ,మామిడికాయ.
రెండవ పద్ధతి #విజయవాడ_కనకదుర్గ అమ్మవారి అలంకారాల పద్ధతి.
1.పాడ్యమి-స్వర్ణాలంకృత కనకదుర్గ-వడపప్పు,పానకం,పరవాణ్ణం
2.విదియ-బాలాత్రిపురసుందరి -చింతపండు పులిహోర.
3.తదియ-గాయత్రీదేవి -కట్టె పొంగలి.
4-చవితి-లలితాదేవి-బెల్లంతో చేసిన పొంగలి.
5-పంచమి-అన్నపూర్ణ-పూర్ణాలు.
మంచి ప్రశ్న అడిగారు రవిగారూ...
మనం ఇంట్లో శ్రాద్దం పెట్టడానికి వీలు పడనప్పుడు కదా #స్వయంపాకం(భోజనానికి అవసరమైన పదార్థాలు-బియ్యం,పప్పుదినుసులు,ఉప్పు, కూరగాయలు, నెయ్యి,నూనె వంటివి )ఇస్తాము.
శ్రాద్దం పెట్టినప్పుడు కూడా ఇద్దరు బ్రాహ్మణులకి భోజనం పెడతారు -ఒకళ్ళు మన పితృదేవతల స్వరూపం,
ఇంకొకరు విష్ణుమూర్తి స్వరూపం గా భావించి.వారు ఇద్దరూ సంతృప్తిగా భోజనం చేసి,మన వంశం అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇస్తారు.
స్వయంపాకం ఇచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది indirect గా!!తీసుకున్న బ్రాహ్మణుడు, వంట చేసిన ఆయన భార్య, పిల్లలు కూడా తృప్తిగా భోజనం చేస్తారు ఆ పూట మీరు ఇచ్చిన
స్వయంపాక వస్తువులతో!!
ఆయన "ఏవోయ్,ఇవాళ వంకాయ కూర అద్భుతంగా ఉంది"అంటే ,ఆవిడ "ఇవి మొన్న రవిగారు ఇచ్చిన వంకాయలండీ,చాలా లేత గా ఉన్నాయి, బహుశా వారి తోటలోవి కాబోలు "అందనుకోండి..అప్పడు ఇద్దరూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించినట్లే కదా!!🙂🙂
మీరు చెప్పింది కరెక్టే కల్యాణి గారూ,శ్రావణ మాసం చివర్లో వచ్చే అమావాస్యని #పోలాల_అమావాస్య అంటారు.నిజానికి అది #పొలాల_అమావాస్య !!
శ్రావణ భాద్రపద మాసాలు వర్షఋతువు కదా..అందుకే ఆ రోజు ఇంట్లో కంద పిలక కి పూజ చేసి,తీసుకువెళ్ళి పొలాల్లో నాటుతారు.కందే ఎందుకు అంటే ఒక్క కంద దుంప పైన ఎన్ని
కణుపులు ఉంటాయో అన్ని పిలకలు వేసి,అన్ని మొక్కలు వచ్చి మళ్ళీ అన్ని దుంపలుగా పంట పండుతుంది. మనకి ఏరువాక పౌర్ణమి రోజు దుక్కి దున్ని పొలం నాట్లు వెయ్యడానికి సిద్ధం చేసాక అన్ని రకాల #విత్తనాలు,#నారు లాంటివి నాటుతారు. దుంపకూరలు ఐన కంద,చేమదుంపలు, అల్లం,ఆలూ, ముల్లంగి లాంటివి నాటాలంటే భూమి
వర్షంతో బాగా తడిసి ఉండాలి కాబట్టి శ్రావణ అమావాస్య (పొలాల అమావాస్య)రోజు (ఆషాఢం నుంచి తొలకరి జల్లులు మొదలవుతాయి) పూజ తో మొదలు పెడితే పంట బాగా వస్తుంది.
ఏ పంట ఎప్పుడు వెయ్యాలి తెలియజెయ్యడానికి వీలుగా,ఒక పండగ లాగా ఉంటే అందరికీ గుర్తు ఉంటుంది కదా!!!పైగా గమ్మత్తుగా చదువురాని
ఒకసారి అమెరికాలోని సబ్బులు ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది.
కవర్ ప్యాక్ అయింది కాని అందులో సబ్బు లేదు.
డీలర్లు, కస్టమర్లు గొడవతో పెద్ద గోలయింది. దానితో ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీలో ఇంకెప్పుడూ ఇలాంటి సమస్యతో పరువు పోకూడదని జాగ్రత కోసం “ఆరు”కోట్లు ఖర్చు పెట్టి ఎక్సరే మిషన్
కొన్నారు.ప్యాకైన సబ్బులు లైన్ మీద వెళ్తుంటే అందులో సబ్బు ఉన్నదీ, లేనిదీ ఆ మిషన్ ద్వారా తెలుసు కుంటున్నారు. ఈ విషయం విన్న మన తెలుగోడు హైదరాబాద్లో సబ్బుల కంపెనీ వాడు,అలాంటి సమస్య రాకూడదని 3 వేలు పెట్టి పెడెస్టల్ ఫ్యాన్ కొని లైన్ మీద వెళ్తోన్న సబ్బుల వైపు ఫుల్ స్పీడ్ తో పెట్టాడు
గాలికి సబ్బు ఉన్న ప్యాక్ లు మాత్రమే ఉంటున్నాయి.. ఖాళీ కవర్లు ఆ గాలికి ఎగిరిపోతున్నాయి.
పని ఒక్కటే ఆరు కోట్లు ఎక్కడ? మూడు (3)వేలు ఎక్కడ ??
అదీ తెలుగోడి తెలివితేటలు !!
అందుకే పిజ్జాలూ, బర్గర్లూ మానేసి ఆవకాయ అన్నం, పులిహోరలూ వంటివి తినండి.
#గడ్డికి#గరిక కీ చాలా తేడా ఉందండీ.
గరిక పొడవుగా,రెండు పక్కలా చాలా పదునుగా (rajor sharpness)ఉంటుంది.
గడ్డి పొట్టిగా, మెత్తగా ఉంటుంది.
మొదటి చిత్రం గరిక,రెండోది గడ్డి
పచ్చి గరిక ని ఎండపెడితే పవిత్రమైన దర్భలు గా తయారవుతాయి.వాటికి అప్పుడు పూజల్లో వాడే #అర్హత,#పవిత్రత వస్తుంది.గరుత్మంతుడు అమృతం తెచ్చి గరిక మీద ఉంచాడు.. #పవిత్రత పోకుండా ఉండేలా...పాములు ఆత్రంగా ఆ పాత్ర ని కదిలిస్తే అమృతం గరిక మీద ఒలికి పోవడం,దానిని నాకిన పాముల నాలుక రెండు గా
చీలిన సంగతి తెల్సిందే కదా!!
అసలు గురుకులంలో చదివే విద్యార్థులకు మొట్టమొదట ఈ దర్భలు ఎంత జాగ్రత్తగా, చేతులు తెగకుండా ఎలా కోయాలో,ఎలా జాగ్రత్తగా ఎండబెట్టి దర్భలు గా తయారుచేసి నిల్వ చేయాలో నేర్పిస్తారు.చాలా నైపుణ్యం కావాలి ఆ పని చెయ్యడానికి.అందుకే ఏ పని ఐనా చాలా జాగ్రత్తగా,
ఇవాళ #రాధాష్టమి(#భాద్రపద_శుద్ధ_అష్టమి)
రాధాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
🕉రాధాదేవి అమ్మవారి 5
పూర్ణబ్రహ్మస్వరూపాల్లో ఒకళ్ళు.(దుర్గ-లక్ష్మీ-సరస్వతి-గాయత్రి-రాధ)
🕉ఈ 5 స్వరూపాలు మనలో ఉండే 5శక్తులకి ప్రతిరూపాలు(ఇచ్చాశక్తి, ఐశ్వర్యశక్తి,జ్ఞానశక్తి,వేదశక్తి, ఆనందశక్తి)
🕉బృందావనం లో నంద,యశోదాదేవి పుత్రుడుగా
శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి రోజు జన్మించాడు.
🕉బృందావనం లోనే, వృషభానుడు & కళావతి అనే దంపతులకు రాధాదేవి భాద్రపద శుక్ల అష్టమి రోజు జన్మించింది.
🕉వృషభానుడు,కళావతి పితృదేవతల లోకానికి చెందినవాళ్ళు పూర్వ జన్మలో.
🕉అమ్మవారు 3 సార్లు ముగ్గురికి కుమార్తెగా వచ్చింది.
1.మేనాదేవి,హిమవంతులకు గౌరీదేవిగా,
2.కళావతి,వృషభానుడికి రాధాదేవిగా,
3.ధన్యా(సుమేధా),జనకమహారాజుకి సీతాదేవిగా.
🕉రాధాదేవి, ఉసీరవ మహారాజు తపస్సుకు ఫలితంగా ఒక చిన్న శిశువుగా(అయోనిజ)ప్రత్యక్షమయ్యి తనని ఒక కమలంలో ఉంచి వెళ్ళమని చెప్పి