పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608 - 1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు
పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి,
వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ
ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి.
నేడు వైశాఖ శుక్ల దశమి స్వామివారు సజీవ సమాధి అయిన పవిత్రమైన రోజు. ఈ రోజు నుండి బ్రహ్మంగారి మఠం నందు
బ్రహ్మం గారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి..🙏💐💐🌹🚩
Sree Pothuluru Veerabrahmendra Swami popularly known as Brahmamgaru was the Hindu saint and Philosopher born in 1610 in #Kadapa dist of #AndhraPradesh #Brahmamgari Aaradhana utsavalu held on vaisakha shukla dasami, on this day he entered into Jeeva samadhi.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#FatherOfIndianCinema#DadasahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల
నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.
#vasavijayanthi
మిత్రులకు, శ్రేయోభిలాషులకూ, అందరికీ శ్రీ వాసవీ మాతా జయంతి శుభాకాంక్షలు ✨💐🌹🌹🙏 జై మాతా!! జై జై మాతా!!!
ఆమె- మేరు నగ ధీర. స్థైర్య, ధైర్యాల నిండైన కలగలుపు. నిలువెల్లా ఆత్మాభిమానం ఆమె సొత్తు. ఆత్మాభిమానాన్ని కాపాడుకోడానికి తృణప్రాయంగా ఆత్మ బలిదానం చేయడానికి
వెనుకాడలేదు. అంతకు మించి ఆమెది విశాల హృదయం. సమాజ హితమే తన హితమనుకుంది. రక్తపాతాన్ని నిరసించింది. శాంతిని అణువణువునా కోరుకుంది. ఆమె ఎవరో కాదు, వాసవీ దేవి. ఆర్యవైశ్యుల నుంచి కులదేవతగా నీరాజనాలందుకుంటున్న తల్లి. ఇప్పటి పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ ఆమె పుట్టిన ఊరు.
తండ్రి కుసుమ శ్రేష్టి. వైశ్యగణానికి రాజు. 11వ శతాబ్దం నాటి కథ ఇది. సంగీత, సాహిత్యాల వంటి కళల్లో ఆరితేరిన వాసవీ దేవి అపురూప సౌందర్య రాశి. అప్పట్లో పెనుగొండ రాజ్యం వేంగీ చాళుక్య సామ్రాజ్యంలో అంతర్భాగం. విష్ణువర్ధనుడనే మహారాజు రాజమహేంద్ర వరం రాజధానిగా వేంగీ దేశాన్ని పాలించేవారు.
#WorldDanceDay 💃🕺 #InternationalDanceDay
ప్రతి సంవత్సరము ఏప్రిల్ 29 న అంతర్జాతీయ నృత్య దినోత్సవం యునెస్కో (UNESCO) లో భాగమైన అంతర్జాతీయ డాన్స్ కౌన్సిల్ (CID) ఆద్వర్యములో 1982 నుండి జరుపు కుంటున్నారు .
నాట్యము (ఆంగ్లం : #Dance) (ఫ్రెంచి పదము డాన్సెర్ నుండి ఉద్భవించింది):
సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు
నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది.
ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. నాట్యం 4 విధాలైన అభినయాలతో కూడి ఉండును. నృత్తమందలి అంగ విన్యాసమును, నాట్యమందలి
#GoBirdingDay#birdwatching
మన చుట్టూ ఉన్న జీవవైవిధ్యంలో పక్షులు చాలా ఆకర్షణీయమైనవి. పక్షుల గురించి మనకి ఏమి తెలుసు? మనల్ని ఇంతగా ఎలా ఆకర్షిస్తాయి ? రండి.... పక్షుల ప్రపంచంలోకి చూద్దాం, మన చుట్టూ ఉన్న పక్షుల గురించి తెలుసుకుందాం.
మనుషులకు ఎన్నో పండుగలు ఉండగా,పక్షులకు ఒక పండుగ ఎందుకు ఉండకూడదు..
నేడే #GoBirdingDay
పక్షులు మరియు పక్షి వీక్షణ దినోత్సవం
ఎండలు మండుతున్నాయి. నీటి వనరులు అడుగంటుతున్నాయి. ఉష్ణతీవ్రతకు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తరచూ దప్పిక తీర్చుకోవాల్సి వస్తోంది.
జనాలకైతే ఎక్కడికెళ్లినా తాగు నీరు అందుబాటులో ఉంటుంది. పశుపక్షాదులకు ఈ కాలంలో ఇబ్బందిగానే ఉంటుంది. మన ఇళ్ల చుట్టూ తిరిగే పక్షులు నల్లాల వద్ద రాలే నీటి చుక్కలతో గొంతు తడుపుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. ఎండాకాలంలో అవి పడే అవస్థలు చూసి కొందరు చిన్న పాత్రలు,
#InternationalAstronomyDay
ఖగోళ శాస్త్రము (#Astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది.
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి:
పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy):
టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము.
సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన
ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే
మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన.
ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని
వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.
ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.