మన తెలుగుభాష మహోన్నత శిఖరం - కవిసామ్రాట్ - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి 125 వ జయంతి నేడు.

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
#తెలుగుభాష
#తెలుగువెలుగు
నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…

కవి సామ్రాట్టు విశ్వనాథ వారి మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఒక చిన్ని ఉదాహరణ చాలు..ఓ రోజు ఓ కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి బందరు నుండి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని
మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. అది అసలే ఎండాకాలం, అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది.ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ
లోపలికి వెళ్లి పోయింది. ఓ చిన్న అమ్మాయి వచ్చి మంచి తీర్థం ఇచ్చి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయింది.ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా. దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది.
దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు ముక్కలుగా తరుగుతున్నాడు.అసలే పెద్ద పేరు మోసిన కవి..ఇతను వాళ్ల ఇంటిలో వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తువ్వాలుతో తుడుచుకుంటూ తరిగేస్తున్నారాయన..
ఈ అబ్బాయి ఇదిగో పెద్దయ్య గారూ అని ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలికి రమ్మని పిలిచారు. ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు.అక్కడ ఉన్న ఎత్తు పీట మీద కూర్చోమని సైగ చేశారు ఆయన . ” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి.
ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు, ఏం చేస్తుంటావు…. మరి కాసేపు ప్రశ్నలు బందరు గూర్చి ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. ” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు.
”ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. ” పనేం లేదు. ఊరికే చూసి పోదామని అంతే,అదంతా మీకెందుకు.” అన్నాడా అబ్బాయి తాపీగా. ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది.. ” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు.నన్నేం చూస్తావు నా పిండాకూడు.ఎలాగూ ఇంత దూరం వచ్చావు
నాలుక్కాయలు తరిగేసి పో నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు. దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన్ని క్షమించమన్నాడు ఆ అబ్బాయి. . అంతే ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది
ఆ అబ్బాయిని లేవదీసి…” ఒరేయ్ లేరా అబ్బాయీ .. నువ్వేదో కష్టపడి నన్ను చూడాలని ఆతృతతో వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…… అని ఆ పూట మంచి భోజనం పెట్టి,
తిరుగు ప్రయాణానికి టికెట్లకు డబ్బుందో లేదో అడిగి కనుక్కుని ..సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారట.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

10 Aug
*ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారి జయంతి సందర్భంగా..*

*ఆ మహానుభావున్ని స్మరించుకుంటూ...నివాళులు అర్పిద్దాం.*

ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే
ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన.

ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో
ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.

ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.
Read 16 tweets
23 Apr
#EnglishLanguageDay #English
#ఆంగ్లభాషదినోత్సవం #ఇంగ్లీష్
మనం ఈ నాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి. వాటిలో ప్రజలని ఇంగ్లీషు వాళ్లు, బ్రిటన్ వాళ్లు, స్కాట్ వాళ్లు, పిక్ట్ వాళ్లు, లేటిన్ వాళ్లు అని పిలచేవారు. వీరు వేర్వేరు భాషలు మాట్లాడేవారు.
వీరందరిలోను ముందు ఈ దీవులలో నివసించటానికి వచ్చిన వాళ్లు బ్రిటన్ లు; అందుకనే ఈ దేశానికి బ్రిటన్ అనే పేరు సిద్ధించింది. తరువాత సా. శ. 43 లో రోము నుండి చక్రవర్తి క్లాడియస్ పంపిన వలస ప్రజలు వచ్చి బ్రిటన్ లో స్థిరపడటం మొదలు పెట్టేరు. చూరు కింద తలదాచుకుందుకని వచ్చి ఇంటినే ఆక్రమించిన
తీరులో రోమకులు బ్రిటన్ ని ఆక్రమించి ఐదు శతాబ్దాలు పాలించేరు. అప్పుడు గాత్ అనే మరొక తెగ వారు రోమకులని ఓడించి దేశం నుండి తరిమేశారు. అప్పుడు ఈ గాత్ తెగని పడగొట్టటానికి పిక్ట్ లు, స్కాట్ లు ప్రయత్నించేరు. వీళ్లని ఎదుర్కొనే శక్తి లేక బ్రిటన్ మళ్లా రోమక ప్రభువులని ఆశ్రయించక తప్ప లేదు.
Read 33 tweets
16 Apr
#CharlieChaplin
చాప్లిన్ చెప్పిన జీవిత సత్యాలు :

ఒక చోట చదివాను.చార్లీ చాప్లిన్ ఒక మారు స్విట్జర్లాండ్ వెళ్ళాడట. అక్కడ చాప్లిన్ వేషం వేసుకున్న వారికి పోటీ జరుగుతోందట. అంటే ఎవరు అచ్చం చాప్లిన్ లాగా నటించగలుగుతారో వారికి బహుమానం ఇచ్చే పోటీ అన్నమాట.
#ChaplinDay
ఉత్సాహం ఆపుకోలేక చాప్లిన్ కుడా ఆ పోటీ లో పాల్గొన్నాడట.కానీ ఆశ్చర్యమేమిటంటే,ఆ పోటీలో చాప్లిన్ కు 7 వ స్థానం లభించిది.

దీని అర్థం ఏమిటబ్బా అని కాస్తా ఆలోచించాను. నాకు ఈ విషయాలు తెలిసొచ్చాయి. మనలని ప్రపంచం తనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుంటుంది.
అంతేకాన, మనమేమిటో సరిగ్గా తెలిసినది మనకు మాత్రమే.ఒక్క చాప్లిన్ కు మాత్రమే తెలుసు చాప్లిన్ అంటే ఎవరు, చాప్లిన్ ఎందుకోసం జీవించాడు ,చాప్లిన్ ఏవిధంగా ఆలోచించేవాడు అని. 'చూడండి, నా
ఉద్దేశ్యమిది, నేనీ విషయాన్ని ఇలా ఆలోచించాను ,
Read 7 tweets
14 Apr
#RamanaMaharshi
శ్రీ రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు
బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నారు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు.
#Arunachalam
వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి
#Tiruvannamalai
Read 7 tweets
10 Apr
#SiblingsDay #siblingday
ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో,అహంకారంతో,మనస్పర్ధలతో విడిపోతున్నారు.ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి.
#InternationalSiblingsDay
#Ramayana
#SriRam
#jaisriram
రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.
ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన లక్ష్మణుడు అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.
నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు.
Read 8 tweets
9 Apr
#NameYourselfDay #నామకరణదినోత్సవం
“నామాఖిలస్య వ్యవహార హేతుః
శుభావహం కర్మసు భాగ్య హేతుః
నామ్నేవ కీర్తిః లభతే మనుష్య
స్తతః ప్రశస్తం ఖలు నామ కర్మ”

అని వీరమిత్రోదయ సంస్కార ప్రకాశికలో బృహస్పతి పేర్కొనటం జరిగింది.ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించటానికి పేరే కారణమవుతుంది.
తనదైన ప్రత్యేక నామం లేక సంజ్ఞ లేక పేరు లేక పోతే సమాజంలో వ్యవహరించటం కష్టం. పేరు వ్యవహారానికి వీలుగా ఉండటమే కాదు, శుభాలను, అదృష్టాన్ని కలిగిస్తుంది. కీర్తికి కారణమౌతుంది. ఒకప్పుడు గురువులు లేదా వంశ పురోహితులు జీవుడి లక్షణాన్ని బట్టి నామకరణం చేసేవారు.
తరువాతి కాలంలో తల్లి తండ్రులు కాని, ఇంటిలోని పెద్దలు కాని తమ అభిరుచులు, ఆదర్శాలు, ఇష్టాల ననుసరించి పేరు పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. పేరును బట్టి పెట్టిన వారి సంస్కారం వ్యక్తమౌతుంది. అంతే కాదు పేరుని బట్టి వ్యక్తి జీవితం ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఈనాడు కనపడుతోంది.
Read 19 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!