*రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.*
*రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద
వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!*
*'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.*
*
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.*
*అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు.
పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.*
*చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.*
*"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని
పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.*
*ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు.*
*"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.*
*"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా,
చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.*
*"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి.*
*పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"*
*అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా
నచ్చలేదు.*
*"వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది.*
*నేనేం మాట్లాడలేదు.*
*"అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి
చూపులూ మావేపే ఉన్నాయి.*
*రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది.*
*మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు
నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.*
*మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!*
*మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి,
అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.*
*"పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు
మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.*
*ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.*
*నిలబడి ప్రయాణం చేస్తున్నప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్నిచూస్తూ కూర్చున్నాను.*
*అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు.* *'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.*
*రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.*
"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు.*
*ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.*
*"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!"* *నిజాయితీగా అన్నాను.*
*"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"* *మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.*
*"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"*
*"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి
డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు.*
*"నువ్వూ"*
"వాళ్ళబ్బాయినండీ!'*
*ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..*
*"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో
చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి.* *వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి
వెనక్కి వెళ్ళిపోతానండి.* *అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"*
*ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.*
*నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.*
*"చదువుకుంటున్నావా?" అడిగాను.*
"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి,
మధ్యాహ్నం నేనుంటానండి!"*
*ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.*
*"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.*
*నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.*
*"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు.
నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.*
*"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను.
అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"*
*ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.*
*" అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.*
"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు
లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి,
మరోసారి అభినందించి, అబ్బాయి బుజం తట్టెను.*
*ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.*
*‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి
వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!*
*****
*సేకరణ: కెయస్వీకృష్ణారెడ్డి, జిహెవ్ఎం, గంటి, తూర్పుగోదావరి,9492146689*
*అడ్మిన్, బెస్ట్ సోషల్ టీచరచ వాట్సాప్ గ్రూప్స్* bestsocialteacher.com
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
_*You are requested to forward my messages to your near and dear without editing my details and writers name. It is the respect we have to pay for the writer n collector of good stories. Thank you*_
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*
పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*
పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..
వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..
ఇప్పుటి తరం పిల్లలు..
(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)
🔥 తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..
🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..
🔥 లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు
శుభ్రం చేసుకోరు..
🔥 కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...
🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...
🔥 గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..
🔥 తిడితే వస్తువులను విసిరి కొడతారు..
చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకురావాలి?
ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో
మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్లో #దోశ తినిపిస్తాను, అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను."
మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకురావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది.
నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని
భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ. చదివితే.. మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది. నేను హామీ...!
👳 భక్తుడు : స్వామీ.. ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి...?
👼 భగవంతుడు : ఏం జరిగింది...? నా వల్ల వచ్చిన ఇబ్బందేమిటీ...?
👳 భక్తుడు : ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే..! ఆఫీసులో అర్జంటు పని ఉందని... తొందరగా నిద్ర లేచేందుకు అలార్మ్ పెట్టి పడుకున్నాను... అది మ్రోగలేదు... దాంతో నేను లేటుగా లేచాను.
👼 భగవంతుడు : అంతేనా...?
👳 భక్తుడు : ఇంకా ఉంది. ఈరోజే ఎప్పుడూ మొరాయించని నా కారు కూడా ఇబ్బంది పెట్టింది.
దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది.
👼 భగవంతుడు : అంతేగా...?
👳 భక్తుడు : అప్పుడేనా...? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ కు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేటయ్యి మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం వృథా అయింది.
ధర్మసూక్ష్మమ్ :-
************
కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు
మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక
కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి
వాటిని తినడం మానేస్తాం.పైగా
"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో
వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటాం.
నిజానికి పెద్దలు వదలమన్నది, "కాయాపేక్ష, ఫలా పేక్ష "
*వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*
కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి
ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి
సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీవదిలేసి సాధువులా బతకమని అర్ధం.
ఫలాపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ధ్వారా
లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.
ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం. యజ్ఞం చేసి ఏదో
ప్రస్తుతం పార్లమెంట్ లో పాస్ ఐన రైతుల బిల్లు రాష్ట్రపతిఆమోదంతో చట్టం అయ్యింది. దీని మీద నేను ఏమి వ్యాఖ్యానించదలచలేదు. ఐతే ఈ చట్టాలు చేసేవారు అమెరికా యూరోప్ తదితర దేశాల లో వ్యయసాయ సరళి గమనించారో లేదో తెలియదు కానీ నేను వెబ్ విహారం లో ఆయా దేశాల్లో వున్న ఒక చిన్న ఆలోచనతో నేను మా
ఆగ్రో ఫార్మ్ నష్టాలను తగ్గించుకుని లాభాల బాటలో పయనించాను. ప్రస్తుతం ఆ ఆగ్రో ఫార్మ్ అమ్మేయడం జరిగింది. ఇది 1999-2005 మధ్య జరిగింది. మొదట్లో అందరి లాగే ఎరువులు, కలుపు తీతలు మొదలైన ఖర్చులు చేసి గిట్టుబాటు ధర రాక నష్టాలు పొందాము. 2001 లో వెబ్ లో మనదేశంలో 1925 ప్రాంతంలో బాగా
అవలంబించిన బయో డైనమిక్ ఆగ్రో పద్ధతులు గురించి తెలుసుకుని వివరాలు సేకరించాను. అప్పటికే అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4000 కోట్ల పైగానే ఈ విధాన వ్యవసాయం లో పరిణితి సాధించింది. దక్షిణ భరతం లో కోడై కెనాల్ లో biodynamic సొసైటీ ఆధ్వర్యంలో 30 రోజుల శిక్షణ ఇస్తున్నారని మా పెద్దబ్బాయి