*పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*

పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*

పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..
వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..

ఇప్పుటి తరం పిల్లలు..
(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)

🔥 తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..
🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..
🔥 లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు
శుభ్రం చేసుకోరు..
🔥 కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...
🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...
🔥 గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..
🔥 తిడితే వస్తువులను విసిరి కొడతారు..

ఎప్పుడు అయినా దాచుకోమని
డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు

🔥 ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
🔥 ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
🔥 అతిథులు వస్తే కనీసం గ్లాసుడు
మంచి neellu ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..
🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..
🔥 బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..
🔥 కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..
వారిస్తే వెర్రి పనులు..
మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,
కానీ కారణం మనమే..
ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..
గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*..
*కష్టం గురించి తెలిసేలా పెంచండి*
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*

ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్,
రేప్ లు, హత్యలు చేస్తున్నారు..
మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..

*అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన
కూడా వాళ్లకు అనవసరం...

కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..
చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి
శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను
సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే *తల్లిదండ్రులు మారాలి..*

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*

ఒక్కసారి ఆలోచన చేయండి...

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు
అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉 *బాధ్యత*
👉 *మర్యాద*
👉 *గౌరవం*
👉 *కష్టం*
👉 *నష్టం*
👉 *ఓర్పు*
👉 *సహనం*
👉 *దాతృత్వం*
👉 *ప్రేమ*
👉 *అనురాగం*
👉 *సహాయం*
👉 *సహకారం*
👉 *నాయకత్వం*
👉 *మానసిక ద్రృఢత్వం*
👉 *కుటుంబ బంధాలు*
👉 *అనుబంధాలు*
👉 *దేశ భక్తి*

*ఈ భావనలు సంప్రదాయాలు అంటే.*

కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..*
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన
వారమవుతాం..*

పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...

మనం కూడా మమేకమవుదాం...

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం..
💐💐💐💐💐

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

9 Oct
చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకురావాలి?

ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో
మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌లో #దోశ తినిపిస్తాను, అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను."

మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకురావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది.
నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని
Read 9 tweets
9 Oct
భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ. చదివితే.. మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది. నేను హామీ...!

👳 భక్తుడు : స్వామీ.. ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి...?

👼 భగవంతుడు : ఏం జరిగింది...? నా వల్ల వచ్చిన ఇబ్బందేమిటీ...?
👳 భక్తుడు : ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే..! ఆఫీసులో అర్జంటు పని ఉందని... తొందరగా నిద్ర లేచేందుకు అలార్మ్ పెట్టి పడుకున్నాను... అది మ్రోగలేదు... దాంతో నేను లేటుగా లేచాను.

👼 భగవంతుడు : అంతేనా...?

👳 భక్తుడు : ఇంకా ఉంది. ఈరోజే ఎప్పుడూ మొరాయించని నా కారు కూడా ఇబ్బంది పెట్టింది.
దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది.

👼 భగవంతుడు : అంతేగా...?

👳 భక్తుడు : అప్పుడేనా...? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ కు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేటయ్యి మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం వృథా అయింది.

👼 భగవంతుడు : సరే..ఇంకా...?

👳 భక్తుడు : పని ముగించుకుని
Read 9 tweets
9 Oct
😂 😁 😆 😝

జంధ్యాల గారు కొన్నాళ్ళు ఆంధ్ర ప్రభ లో "జంధ్యా మారుతం " అన్న శీర్షిక నిర్వహించేవారు అందులో పాఠకుల ప్రశ్నలకి విట్టీ గా సమాధానం ఇచ్చేవారు..

అందులో ఒక పాఠకురాలి ప్రశ్న :

- జంధ్యాల గారూ! మామూలుగా మగవాళ్ళు

"నా భార్య" అనీ, ఆడవాళ్ళు " మా ఆయన " అని అంటూంటారు కదా!!
మరి మగవాళ్ళు " మా భార్య " అని ఆడవాళ్ళు " నా ఆయన" అని ఎందుకనరు ???

దానికి జంధ్యాల గారి సమాధానం:

- ఎందుకనరూ!! పరభాష వాళ్ళు తెలుగు మాట్లడేప్పుడు అంటూ ఉంటారు..

1985 వ ప్రాంతంలో నేను, గాయకులు బాలసుబ్రమణ్యం గారు, ప్రముఖ hypnotist B.V పట్టాభిరాం గారు మరి కొందరం అమెరికా వెళ్ళాం..
మేము దిగిన ఇంటాయన అరవాయన..

ఆయన, ఆయన భార్య ఉద్యోగానికి వెళుతూ -

నేను, మన పెండ్లాం పనికి పూడుస్తా ఉండాం..

ఫుడ్ అంతా టేబుల్ మీద ఉండాది- మీరు సిగ్గు లేకుండా తినండి. ఇంకా ఏమైనా కావాలంటే మా అబ్బాయిని అడుక్కు తినండి...

ఇంకా ఏవైనా కావాలంటే రాత్రికి మన పెళ్ళాం మీ కోరిక తీరుస్తాది
Read 4 tweets
8 Oct
*రచన: జయంతి ప్రకాశ శర్మ*
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

*రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.*

*రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద
వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!*

*'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.*

*
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.*
*అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు.
Read 26 tweets
7 Oct
ధర్మసూక్ష్మమ్ :-
************
కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు
మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక
కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి
వాటిని తినడం మానేస్తాం.పైగా
"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో
వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటాం.

నిజానికి పెద్దలు వదలమన్నది, "కాయాపేక్ష, ఫలా పేక్ష "

*వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*

కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి
ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి
సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీవదిలేసి సాధువులా బతకమని అర్ధం.

ఫలాపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ధ్వారా
లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.

ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం. యజ్ఞం చేసి ఏదో
Read 4 tweets
2 Oct
ప్రస్తుతం పార్లమెంట్ లో పాస్ ఐన రైతుల బిల్లు రాష్ట్రపతిఆమోదంతో చట్టం అయ్యింది. దీని మీద నేను ఏమి వ్యాఖ్యానించదలచలేదు. ఐతే ఈ చట్టాలు చేసేవారు అమెరికా యూరోప్ తదితర దేశాల లో వ్యయసాయ సరళి గమనించారో లేదో తెలియదు కానీ నేను వెబ్ విహారం లో ఆయా దేశాల్లో వున్న ఒక చిన్న ఆలోచనతో నేను మా
ఆగ్రో ఫార్మ్ నష్టాలను తగ్గించుకుని లాభాల బాటలో పయనించాను. ప్రస్తుతం ఆ ఆగ్రో ఫార్మ్ అమ్మేయడం జరిగింది. ఇది 1999-2005 మధ్య జరిగింది. మొదట్లో అందరి లాగే ఎరువులు, కలుపు తీతలు మొదలైన ఖర్చులు చేసి గిట్టుబాటు ధర రాక నష్టాలు పొందాము. 2001 లో వెబ్ లో మనదేశంలో 1925 ప్రాంతంలో బాగా
అవలంబించిన బయో డైనమిక్ ఆగ్రో పద్ధతులు గురించి తెలుసుకుని వివరాలు సేకరించాను. అప్పటికే అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4000 కోట్ల పైగానే ఈ విధాన వ్యవసాయం లో పరిణితి సాధించింది. దక్షిణ భరతం లో కోడై కెనాల్ లో biodynamic సొసైటీ ఆధ్వర్యంలో 30 రోజుల శిక్షణ ఇస్తున్నారని మా పెద్దబ్బాయి
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!