ఘంటసాల - బాలూ

ఇద్దరూ స్వయంకృషి తో వచ్చినోళ్ళే
ఇద్దరూ తెలుగు మట్టి బొమ్మలే
ఇద్దరూ వారాల బిక్షువులే
ఇద్దరి జీవితం సినీమాతోనే
ఇద్దరి జీతం సినీ గీతమే
ఇద్దరికీ పద్మ అవార్డులు
ఇద్దరి అర్ధాంగులూ సావిత్రులే
ఇద్దరి చివరి మజిలీ చెన్న పట్నమే!

వాళ్ళని పరిచయం చేసింది పాట!
వారి బ్రతుకు పాట
వారి మాట పాట
వారి నడక పాట
వారి నడత పాట
వారి వశం పాట
వారి పాశం పాట
వారి ఊపిరి పాట
వారి గమనం పాట
వారి మననం పాట
వారి ఆహారం పాట
వారి ఆహార్యం పాట
వారి అర్ధం పాట
వారి పరమార్ధం పాట
వారి సామ్రాజ్యం పాట
వారి సాయుజ్యం పాట
వాళ్ళని రగిల్చింది -
వాళ్ళని మిగిల్చింది -
పాట గదరా శివా!

తెలుగు సినీ గీతానికి ఘంటసాల పల్లవి అయితే, ఎస్ పీ చరణం కదా!
తెలుగు సినీ భాగవతంలో ఘంటసాల రాముడైతే, బాలూ కృష్ణుడు!
వారిద్దరి మధ్య మాటా మంతీ సాగితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందనుకుంటే ఎలా ఉంటుంది!!
దానికి తెర తీస్తే …..

ఘ: రావయ్యా అప్పదాసూ…. ఎవరో అనుకోని అతిథి వస్తున్నాడన్నారు. ఎవరా అనుకుంటుంటే నీ అకాల ఆగమనం. అప్పుడే నీకు పాటలు చెల్లి పోయాయంటే బాధన్పిస్తుందయ్యా! రా కూర్చో! (క్రింద కూర్చోబోతుంటే) ఇక్కడ … ఈ సీటు నీది.
బా: మీతో సమానంగానా… ఇక్కడే బాగుంటుంది గురువు గారూ.. (క్రింద కూర్చుంటూ)

అయితే నేనూ కింద కూర్చోవాల్సొస్తుందిప్పుడు. నన్ను కష్ట పెట్టకయ్యా!

అయ్యో ఎంత మాట! నేనే అక్కడ కూర్చుంటాను లేండీ.

తెలుగు వాళ్ళే మనిద్దరికీ వాళ్ళ హృదయాన్ని సగం సగం పంచేశాక, నువ్వు సమానం కాదంటే ఒప్పుకుంటానా?
మాష్టారూ, తెలుగోడి హృదయం చాలా విశాలమైంది. మనవేమన్నా మామూలు శరీరాలా? అయినా ఇద్దర్నీ పట్టించేశాడు ఆ గుప్పెడంత జాగాలో. మీ కంటే ఎక్కువ జాగా నేనే ఆక్రమించుకున్నానేమో భారీ కాయం వల్ల!
సహజమే సుమా! మరి యాభై ఏళ్ళ పైన సుస్థిర స్థానం నీది వాళ్ళ గుండెల్లో. బాలా…. ముందుగా నీతో నే చెప్పుకోవాల్సిందేంటంటే - నేను నీకు ఋణపడి ఉన్నానయ్యా, అంత పట్టుబట్టి నా విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించిన దానికీ, పాడుతా తీయగా లో నా ఫోటోని పెట్టి ఆపాటలన్నీ నాకు వినిపించినందుకూ!
మళ్ళీ పాటల మాటికొస్తే నేను వదిలేసింది ప్రసాదంగా తీసుకున్నానన్నావట? మరీ ఇంత నిరాబండరం గా ఉంటే ఎట్లా?

ప్రసాదం మాట నిజమేగా? తెలుగు సినిమా పాటంటే ముందు గుర్తొచ్చేది మీరు, ఆ తర్వాతే నేను. అక్షర మాలలో కూడా "ఘ" ముందు తర్వాతనే "బా" కదా. అందుకే మీరు ఆద్యుడు!
నువ్వు ? అసాధ్యుడు..,. నీ టాలెంట్ ముందు నేనే పాటి? దక్షిణ భారతంలో ఏ భాష వాళ్ళయినా గానీ నీ పాట పాడుకోని వాళ్ళు ఉన్నారా? అదే మాదిరి ఉత్తర భారతంలోనూ నువ్వెవరో తెలియని వాళ్ళెవరు?

మాష్టారూ… మీ ముందు నేనెంతండీ! దేశం మిమ్మల్ని తపాలా బిళ్ళలో భద్రపర్చుకునే ఖ్యాతి మీది!
కాదు బాలా… పదహారు భాషల్లో నలభై వేల పై చిలుకు పాటలు పాడావట గదయ్యా… అనితర సాధ్యం. ఆ వైవిధ్యం ఆ భావవక్తీకరణ!

ఏదో మీరులేక, నేను ఆముదపు చెట్టునే అయినా, మహావృక్షంలా చేసేశారు.
నేననుకుంటానూ, మాతృభాషలో కాక పరాయి భాషల్లో ఎక్కువ పాటలు పాడిన రికార్డు కూడా నీదే నేమో! దక్షిణ భారద్దేశపు భాషలన్నీ నీకు మాతృ భాషలే నయ్యా బాలా.

అందులో నా గొప్పేం లేదు మాష్టారూ, వాళ్ళ హృదయాలు పెద్దవి, అంతే!
మళ్ళీ అదే నిరాడంబరత… నువ్వు పాడిన భక్తి పాటలు ఎంత రక్తిగా ఉన్నాయో కూడా తెల్సు.

మీరు పాడిన లలిత, దేశభక్తి గీతాల మాటేంటీ? పుష్పవిలాపం, కుంతికుమారి, నిన్నునేను మరుమలేమురా అవే వినిపిస్తుంటాయ్ తెలుగునాట అంతటా! మాష్టారూ మీ పాట మళ్ళీ మళ్ళీ వినేలా ఉంటుంది!
బాలా మరి నీ పాట?… మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంటుంది! క్లాసూ, మాసూ తేడా లేకుండా!
మాష్టారూ, మీ పాటలో మాధుర్యం ఎవరికొస్తుంది చెప్పండి. మీ మాటల్లో స్పష్టతా… ఇంకెవరన్నా "హాయి" అనే మాటని మీరన్నంత హాయిగా అని, హాయిని కల్పించారా ? చెప్పండీ… లేరు మాష్టారి సాటీ… సరి గాయకులు ధారుణిలో…(లవకుశులు పాడి నట్లుగా పాడాడు)
నా ట్యూన్ నాకే అప్పచెబుతున్నావా?
అయినా నేనొప్పుకోను బాలా! అంతర్యామి అలసితి…, ఓ పాపా లాలీ...ఒక్కడై రావడం ...ఇట్లా ఎన్నని చెప్పనూ? మరొకరి వల్ల అవుతుందా?

అంతా మీ కృప మాష్టారూ!
నీ చేత నా డైరక్షన్ లో పాడించుకునే అవకాశం రాకపోయే! అది నాకు వెలితిగా ఉంటోంది బాలా.

నేనొచ్చే సరికి మీకు చేసే తీరిక లేకపోయింది మరి! అయినా మీతో పాడిన కొద్ది పాటలైనా నాకు పదివేలు!

మనం పాడిన "ప్రతీ రాత్రీ వసంత రాత్రీ " ఎంత ఇష్టపడ్డారో మన వాళ్ళు.

మరి పోటాపోటీగా సాగిందికదా ఆ పాట!!
అవునూ… ఒక్కరోజులో ముఫ్ఫై పాటలు పాడి రికార్డు పెట్టేశావట? ఎంత గొప్ప విషయమయ్యా బాలా!!

మాష్టారూ మీరు ఒక్క టేకులో " శివవంకరి " పాట పాడేశారట! దాని ముందు ఇదెంత మాష్టారూ!!

సర్లే…. నువ్వు మంచి మాటకారివి, నువ్వంటే నువ్వంటూ ఇబ్బంది పెట్టేస్తున్నావ్ !
మరి మీరు మోస్తే, నేను మోయద్దా, చెప్పండి.

అదే తీరుగా అదృష్టవంతుడివి బాలా! నాలుగు తరాల వాళ్ళు నీ పాటలు పాడుకుంటారు. నేను యాభై రెండేళ్ళు బ్రతికితే, నువ్వు సుమారు యాభై నాలుగేళ్ళు పాటల సేద్యం చేశావు సినీ క్షేత్రంలో. అంటే నా జీవితకాలం దాటి పోయింది నీ పాటల ప్రయాణం. ఎంత గొప్ప విషయం!!
పాటల సంగతి పక్కన పెడితే, నువ్వెంత బాగా యాక్టింగ్ కూడా చేస్తావయ్యా. "మిథునం "లో అప్పదాసు పాత్ర నీ కోసమో సృష్టించబడిందా అన్నంతగా పరకాయ ప్రవేశం చేసేశావుట! రమణ నీ కోసమే రాసాడా? ఆయన కోసం నువు చేశావా?
అద్తెలియదు గానీండీ, భరణి మాత్రం నా కోసమే అది తీశాడనిపిస్తుంది. నటుడిగా నాకు చాలా, చాలా తృప్తి నిచ్చింది మాష్టారూ ఆ పాత్ర నాకు. అదో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అవకాశం నాకు!

పాత్ర ధారణ సరే, గాత్ర ధారణ మాటేంటీ! నీ గొంతుతో ఆ అరవ అతన్ని తెలుగు వాళ్ళ సొంతం చేసేశావే!
కమల్ హసన్నేనా మీరనేది! వాడు నా తమ్ముడు మాష్టారూ, మేమిద్దరం సినిమా విషయంలో వేరు చేయలేని ఒక రూపం. వాడు శరీరం నేను వాణిగా అయి పోయాం. అదేదో గత జన్మ బంధం అనిపిస్తుంది. మీ లాంటి పెద్దల ఆశీర్వాదం వల్లే ఇలాంటివి జరుగుతయ్ అనుకుంటా!
సరే కానీ, తెలుగు సినీ గీతానికి నువ్వు చేసిన సేవ నేను చెయ్యలేదోమో బాలా…. "పాడుతా తీయగా", "పాడాలని ఉంది", స్వరాభిషేకం ద్వారా ఎంతమంది కొత్త గాయకులని బైటికి తెచ్చావు! ఎంత తర్ఫీదు ఇచ్చావ్ ! మలుచు కొచ్చావు గాయనీ గాయకుల్ని. ఆ తల్లి ఋణం తీర్చేసుకున్నావయ్యా వడ్డీతో సహా!
ఏంటి మీరనేది! తెలుగు పాటని ప్రజల ఇళ్ళల్లో, నోళ్ళల్లో నానేలా చేసింది మీరు. మీరు అంత మధురంగా పాడారు కనుకనే ప్రజలు వాటిని ఇష్టపడ్డారు… కాదు కాదు మరిగారు! తర్వాత నాకూ మనసిచ్చారు. మీరు తెలుగు సినీమా పాటల నారు పెడితే నేను నీరిచ్చాను అంతే మాష్టారూ!
"పాడుతా తీయగా"లో నువ్వు పిల్లలతో పిల్లాడివై పోతావే అది భలే ముచ్చటేస్తుంది బాలా. ఒక ఎపిసోడ్ లో ఒక చిన్నమ్మాయి పోటీలో పాల్గొనడానికి వచ్చినప్పుడు చాలా నగలు పెట్టుకొచ్చింది.
ఆ అమ్మాయిని వస్తుంటే నువ్వు అన్న మాట ఎప్పటికీ మర్చి పోలేను - "నడిచొచ్చే నగల కొట్టు లా ఉంది చిట్టితల్లి" అన్నావు. ఎలా తడతయ్ నీకు అలాంటివి అంత ఆశువుగా? మరెవరి వల్లా కాదు బాలా అలా!

గొప్పవాళ్ళ సహవాస దోషం మాష్టారూ… నేరం నాది కాదు!
ఎంత ఒదిగి పోతున్నావయ్యా! నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. పాట పదికాలాలు మ్రోగేలా చేశావు బాలా! పాడుతా తీయగా కార్యక్రమంలో, ఇంకా వేరే వాటిలో నువు చెప్పే విషయాలు, వ్యాఖ్యానానికి ఎంతమంది చెవి కోసుకుంటారో తెల్సా? అసలా ప్రోగ్రామే నీలోని వేరే బా సు ని పరిచయం చేసింది జనానికి.
గురువు, శిష్యుడు, స్నేహితుడు, శ్రోత, అభిమాని, కృతజ్ఞుడు, చమత్కారి, విమర్శకుడు, జ్ఞాని, ప్రేమికుడు, బోధకుడు ఎన్ని రూపాల్లో కనిపించావో తెల్సా, ఇది అనితర సాధ్యం బాలా! సకల కళా వల్లభుడివి, సకల శ్రోతల మానస చూరుడవి.
కానీ మాష్టారూ తెలుగు పద్యం మాత్రం ఇంకా పాదులో పడిపోయిన తీగె మాదిరే ఉండి పోయింది.

పరిస్థితుల ప్రభావం. ఇవి పద్యాలు చదివే రోజులా! ఇంక పాడుకునేదెవరు? నీ వంతు నువ్వు చేశావు బాలా, పాడుతా తీయగాలో పద్యాన్నీ ఒక వృత్తంగా పెట్టావు. పిల్లలు తర్ఫీదు తీసుకుని ఎంత బాగాపాడేరో!
మీ నర్తనశాల, పాండవ వనవాసం, లవకుశ… ఓహ్ ఒకటేమిటి, ఆ పద్యాలు వింటుంటే వళ్ళు పులకించాల్సిందే, తెలుగుతనం తలెత్తుకు తిరగాల్సిందే!

తెలుగు భాషకి నువ్వు చేసిన సేవ నేనెక్కడ చేశాను బాలా? ఎంత తపించే వాడివి!
మాట అర్ధం చెప్పడంలో, పలకడంలో నీ కృషి అమోఘం. "చ" అక్షరం సరిగ్గా పలకించడానికి ఎంత పట్టుపట్టే వాడివి? ఎంత మంది తెలుగు చక్కదిద్దావో కదా!

ఏదో ఉడతా భక్తిగా మాష్టారూ…..
ఇంకొటి నాకు ఆశ్చర్యం బాలా! పని.. పని… పని… అది తప్ప వేరే ధ్యాస లేదే నీకు. నీ భాషలో చెప్పాలంటే పని రాక్షసుడివయ్యా నువ్వు. పాడడం, వ్యాఖ్యానం, డబ్బింగు, యాక్టింగు, ఇంకో ఇంగూ, ఇంకో టింగూ ఇంత సమయ మెక్కడిది నీకు బాలా. వాళ్ళకి జ్ఞాపకాలు మిగల్చడం కోసం నువ్వు బ్రతకడం మర్చిపోయావేమో బాలా!
వాళ్ళ జ్ఞాపకాల్లో బ్రతికి పోవాలనే దురాశ మాష్టారూ!

నీ కీర్తి గంధం భువి నుండి దివికి గుబాళిస్తోంది బాలా. నువ్వు విశ్వనాధన్ ఆనంద్ కు చేసిన సౌజన్యం, నెల్లూరులో వున్న మీ ఇంటిని వేద పాఠశాల కోసం అర్పించడం, శబరి మల బోయీల పాదాలకు నమస్కరించడం, - ఒకటేమిటి బాలా మాకు అన్నీ తెలిసినయ్ .
ఇంత ఎదిగిపోయి కూడా నువ్వు ఎంత వినమ్రంగా ఉన్నావ్ ! నువ్వు జీవితాన్ని ఓ పండగ లా సంబరంగా గడుపుకున్నావ్ బాలా! నీలాగ పరిపూర్ణ తృప్తితో జీవించడం మరెవరి వల్లా కాదు. పుట్టుకుని ఎలా సార్ధకం చేసుకోవాలో చూపించావు! నువ్వు ధన్యజీవివి బాలా.
మాష్టారూ… ఒక చిన్న కోరిక!

చెప్పు …

ఆరోగ్యం తిరిగి పొందడానికి పోరాడి పోరాడి అలసి పోయాను. ఒక్కసారి మీ ఒళ్ళో పడుకొని , మీ నోట "పాడుతా తీయగా చల్లగా" వినాలనుంది. వినిపించరూ"

నువ్వు ఒక మాటిస్తే ….

చెప్పండి...
నువ్వు "యాతవేసి తోడినా ఏరు ఎండదు" పాడాలి మరి, నీ కోసం పొగిలి పొగిలి ఏడ్చే తెలుగువాళ్ళుకు ఊరడింపులా! నువ్వు వాళ్ళని వదిలి పది రోజులు కావస్తున్నా వాళ్ళ గుండె గాయం ఉపశమించలా!

( వాళ్ళిద్దరు గంధర్వ గాయకులూ ఒకరి కొకరు ఏమౌతారో తెలియదు గానీ, తెలుగు శ్రోతలకు మాత్రం ప్రాణ నాడు లయ్యారు )👏
Thread Reader App
@threadreaderapp"unroll "

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -V.V. Apparao

వింజమూరి -V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

8 Oct
🚩🚩రజనీకాంతరావు గారి ఓ విభావరి ఓహో విభావరి!
-
ఎదో తెలియని ,కమ్మని పాత సువాసన జల్లినట్లుగా ,సుపరిమాళాలు వేదజల్లినట్లుగా ,
అప్పటి గానామృతం ఎంత విన్న ఇంకా వినాలనిపించే తీరు ,
ఆ మహానుభావునికి పాదాభివందనం. Image
(ఈ పాట రచన - సంగీతం .. సాలూరి వారి గాత్రం .
ఇక్కడ ఈ పాట మరిచిపోతారో అని youtube.లో . up లోడ్ చేసాను .)

ఓ విభావరి ఓహో విభావరి.
.
నీహార తీర నీలాంబరధారిణి మనోహారిణి ఓ విభావరి ఓహో విభావరి
.
నీ చెంచెల- చేలాంచల నిభృత స్వప్నసీమలలో
.
ఎలా- భయ ఛాయ జాల మేల సౌఖ్య రో చెర్నీల ఓ విభావరి ఓహో విభావరి
.
సంతత శాంత తరంగిణి మదభరయువ- కురంగిణి
.
ఎలా అలసగమనమ్ము- ఎలా నవ విలసనమ్ము -ఓ విభావరి ఓహో విభావరి
.
ధరణీ తలా చంద్ర శిలా ధరల మంటపమున నిలచి
.
యుగములుగ -పరీభ్రమింతు -వగమ్యుడవ్ ఎవని వలచి -ఓ విభావరి ఓహో విభావరి!!
Read 5 tweets
7 Oct
🚩🚩రసాలూరు నారాయణీయం!🚩🚩

ప్రఖ్యాత నవలా రచయిత్రి #శ్రీ దేవి రాసిన ‘’కాలాతీత వ్యక్తులు ‘’
నవలకుఅన్నపూర్ణా వారు సొగసు లద్డిన సినిమా ‘#చదువుకున్న అమ్మాయిలు ‘’.
సాలూరి వారి సరళ స్వరాలు ,నారాయణ రెడ్డి గీత రచన తో మది పులకించిపోతుంది
.
ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది .
.
.’’విని పించని రాగాలే ‘’అన్న పాట అందరూ మెచ్చుకోన్నదే .
మిగిలిన గీతాలు హాయి చేకూర్చేవే .అయినా నాకు బాగా నచ్చిన గీతం
కిలకిల నవ్వులు చిలికిన –పలుకును నాలో బంగారు వీణ
కరిగిన కలలే నిలిచిన –నింపెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవళులు పిలిచే –ఆణువణువూ బృందావని లో నిలిచే
తళతళ లాడే తరగల పైన –ఆందీ అందని అందాలు మెరిసే
నీ ఉన్న వేరే సింగారములేల? –మమతలు నీ పాద ధూళి సిందూరము కాదా ?
Read 6 tweets
5 Oct
🚩కల భాషిణి!
-
ప్రబంధాలు అపురూప కవితాకళాఖండాలు.చదవండి .అడుగడుగునా రసధునులే!
కల భాషిణి యంద చందాలు!
ప్రబంధయుగంలో కవులు ఒకరినిమించినవారు మరొకరు.హేమాహేమీలు. వారిలో పింగళిసూరనయొకడు.
.
కలభాషిణి సూరన సృష్టించిన యొక యందారభరణి!
విటజనహృదయమనోహారిణి. ద్వారకా నగరమునందలి యొకవేశ్య!
ఆపాత్రను కళాపూర్ణోదయంలో పరిచయంచేస్తూ,కవియీపద్యంవ్రాశాడు.
.
ఉ: కూకటి వేణితో కురులు కూడకమున్నె, కుచ ప్రరోహముల్
పోకల తోటి సామ్యమును పొందకమున్నె, నితంబ సీమకున్
వ్రేకఁ దనంబొకింత ప్రభవింపక మున్నె, బ్రసూనబాణు డ
ర్రాకల బెట్టె, దా నరవ నామెత బాలికకై విటావళిన్;
.
Read 6 tweets
5 Oct
మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడ ైనా ఆలోచించారా………?
గధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి,
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.
కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడైనా ఆలోచించారా………?
మైదా పిండి ఎలా వస్తుంది……..
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
Read 5 tweets
5 Oct
🚩🚩సామజిక దృక్పధం !
#గ్రామం లో కి వెళ్లి ఒక రైతు ని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి అని అడగండి . వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు . పట్టణం లో వెళ్లి ఒక హోటల్ యజమాని ని అడగండి .. కూక్స్ వైటర్స్ ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు ."
అసలు ఈశాన్య భారత దేశం వారు ఉండబట్టి సరిపోయింది .. లేక పొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని మొన్న కేరళ లో ఒక హోటల్ యజమాని అన్నాడు . భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు .
నేను మారిషస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు పురోహితుడు , కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడిగారు .
ఒక పక్క దేశం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు . మరో పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు .
Read 14 tweets
4 Oct
🚩🚩మరపు రాని మధురగీతం..🚩🚩
.
‘’చిగురాకులలో చిలకమ్మా ‘’
.
హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట
పెండ్యాల నాగేశ్వర రావు త న సంగీత సరళ స్వరాలతో

హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట ,
పెండ్యాల నాగేశ్వర రావు తన సంగీత సరళ స్వరాలతో
మనసు గిలి గింతలు పెట్టాడు.
అలా విరిసినఒక పుష్ప గీతమే
సావిత్రి ,నాగేశ్వరరావు ల మధ్య నడిచిన యుగళ గీతం
.
ప్రేమించిన అమ్మాయి ని చిగురాకులలో చిలకమ్మ తో పోల్చటం భలే తమాషా గా ఉంది
తన మనసులో ఉన్నది చిన్న మాటే –దాన్ని వినమని బతిమాలుతున్నాడు .
వింటే సరిగ్గా స్పందిస్తున్దని ఆశ, ఆరాటం అత గాడికి .
ఆమె కూడా పల్లె టూరిదే .కాయా, కసరూ అమ్ముకోనేదే .అయినా ఆమె భావమూ
అతి సున్నితం గా ఉండటమే సముద్రాల చూపిన ప్రత్యేకత
.ప్రియుడిని మరు మల్లెలలో మామయ్యా అంది అంతే లలితం గా .ఆ చెప్పే మంచి మాటేదో సెలవీవయ్యా అని భలేగా అడిగింది .
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!