#రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా,
ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది.
అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో
#"ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు
. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
"ఓ రామా! ఇది #గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య #అహల్య.
ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని
వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను
అడిగాడు.
తన భర్త వేషంలో వచ్చింది #దేవేంద్రుడని అని తెలుసుకున్నది
అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది.
అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తననుచూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు.
ఇంతలో గౌతముడు దర్భలను, సమిధలను తీసుకొని ఆశ్రమానికివచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసాడు. జరిగినవిషయం గ్రహించాడు.
"ఓ దుర్మతీ! నేను ఆశ్రమంలో లేని సమయంలో నా వేషంలో నా
ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించినందుకు నీకెదే నా
శాపం. నీ వృషణాలు కింద పడిపోవుగాక" అని శపించాడు
గౌతముడు. అతని శాపం ఫలితంగా ఇంద్రుని వృషణాలు నేల మీదపడిపోయాయి.
తరువాత గౌతముడు తన భార్య అహల్యను చూసాడు.
అహల్యా! నువ్వు పాపం చేసావు. కాబట్టి నువ్వు అదృశ్యరూపంలోమట్టిలో దొర్లుతూ, కేవలం గాలినే ఆహారంగా స్వీకరిస్తూ, తపస్సుచేసుకుంటూ వేల సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే ఉండు.
దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినపుడు
నీకు శాపవిముక్తి కాగలదు. రాముని పూజించిన తర్వాత నీలో
మోహం నశించి పరిశుద్ధురాలై నన్ను చేరగలవు" అని పలికాడు.
వెంటనే గౌతముడు ఆశ్రమం విడిచి హిమత్పర్వతానికి
వెళ్ళిపోయాడు.
గౌతముని శాపంతో వృషణాలు పోయిన ఇంద్రుడు ఎంతో
దు:ఖించాడు.
అగ్ని మొదలగు దేవతలతో, ఋషులతో,
"నేను మీకోసమే ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి
అతని తపస్సు వృధా చేసాను. దేవకార్యన్ని సాధించాను.
కానీ నా వృషణాలను పోగొట్టుకున్నాను. కాబట్టి మీరే నా వృషణాలుమరల వచ్చేటట్టు చేయాలి" అని అడిగాడు.
దేవేంద్రుని మాటలు విన్న దేవతలందరూ పితృదేవతల వద్దకు వెళ్ళివారికి యజ్ఞములో అర్పించిన మేషముల వృషణాలు ఇంద్రునికిఇవ్వవలసిందిగా అడిగారు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకుయజ్ఞములో అర్పించిన మేషము యొక్క వృషణాలను ఇంద్రునికి
ఇచ్చారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.
రామా! ఇక మనము ఆశ్రమంలోకి వెళ్దాము. అక్కడ అహల్యకు
శాపవిమోచనం కలిగించు." అని చెప్పాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. అప్పటిదాకా గౌతముని శాపం వల్ల ఎవరికీ కనపడని అహల్య, రామునికికనిపించింది. రామ పాద ధూళి సోకిన అహల్యకు శాపవిమోచనంఅయింది.
రామలక్ష్మణులు అహల్యకు నమస్కరించారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌతముడు రామ దర్శనం చేసుకొని
పునీతయైన భార్యను స్వీకరించాడు. దంపతులిద్దరూ రాముని
🚩🚩దేశమంటే మట్టి కాదోయ్!🚩🚩
.
*ఒక సారి ఒక బెంగాలి , ఒక పంజాబి " మేమే గొప్ప దేశ భక్తులం అంటే, కాదూ మేమే అంటూ " వాదించుకుంటున్నారు
. ఇద్దరూ ఒక ఒప్పొందానికి వచ్చారు .
బెంగాలి " నువ్వు
మీ వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నా నెత్తి మీద ఒక వెంట్రుక పీకేయ్ , నేనూ మా వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నీ తల వెంట్రుక పీకేస్తా.
..దేశ సేవ చేసిన వాళ్ళెవరైనా , దేశం కోసం చని పోయిన వారైనా " .సరే అంటె సరే అనుకొన్నారు. #బెంగాలి " బకీంచంద్ర" అంటు ఒకటి#
#పంజాబి " లాలా లజ్ పత్ రాయ్ " అంటూ ఒకటి
బెంగాలీ " బిపించంద్ర పాల్ " ఒకటి
పంజాబి " భగత్ సింఘ్ " ఒకటి.
.......................
.......................
.........................