🚩 సైంధవుడు !

💥

సైంధవుడు లేదా జయధ్రదుడు(సంస్కృతం:जयद्रथ) మహాభారత

ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సల కి పతి. జయధ్రదుడు

సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు

కాబట్టి సైంధవుడు అయ
ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒకరాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన

పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్నిఅగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి

తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను.
ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనినిచక్కఁగ మర్దించి అవమానించి పంపిరి.

అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపముసలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడుపాండవులను
పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడు

పడకుండ అడ్డగించి గెలుపుకొనెను.

కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి.

ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడువిని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని
తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.
మఱియు ఇతఁడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు

అశరీరవాణి వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడునుఅని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడువిని ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివానిశిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకుగోచరము అగునట్లు పలికెను.
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది.

సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడిఅర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహంపన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు
అర్జునుడిని చేరకుండా చేస్తుంది.
అర్జునుడు చాలా చింతితుడయి

సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారిశ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచిసూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు.
అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయంఅయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడుఅసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండితొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాముపన్నిన వ్యూహం నుండి సడలుతారు.
ఆ విధంగా సడలడం వల్ల

సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు

సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం

ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది.
అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపైపడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్నసైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని
చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారిశిరస్సు నూరు చెక్కలు అవుతుంది.
ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి

చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరుచెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు.

ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -V.V. Apparao

వింజమూరి -V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

24 Oct
💐🙏🏼కాళిదాసు గర్వభంగం🙏🏼💐

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.

మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.

బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.

ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.
ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది.

నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...

‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు:

‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?

పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.*
అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...

‘మీరు అసత్య మాడుతున్నారు.

ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.

వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...

‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.

ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు.
Read 9 tweets
23 Oct
🚩🚩వర్షం కురిసిన రాత్రి.!🚩🚩

#విక్కీరావు ఆఫీసు పనిమీద ఓ పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది.
రాత్రికి అక్కడే బస ఏర్పాటుచేసుకున్నాడు.

ఆఫీసు పని చేసుకుంటూ సిగరోబీస్ అయిపోయినాయి అని గమనించి విసుక్కుని వాటికోసంబయలుదేరాడు.
బస నుండి కిలోమీటర్ నడిస్తేనే కానీ సిగరోబీస్ దొరకలేదు. అవి తీసుకునివస్తుంటే వర్షం మొదలయ్యింది.

కాస్తంత దూరంలో గొడుగుతో ఓ వ్యక్తి వెడుతుంటే #విజిల్ వేశాడు.

ఆ వ్యక్తి విజిల్ వినబడి ఆగి వెనక్కి చూశాడు. విక్కీరావుని రమ్మని సైగ చేశాడు.
విక్కీరావు గొడుగులోకివచ్చి "థాంక్స్" అని " సారీ! విజిల్ వేశినందుకు" అన్నాడు.

" పర్వాలేదు! అలా విజిల్ వేశే నన్ను అంజలి నన్ను ఆకట్టుకున్నది " అన్నాడా వ్యక్తి

" అలాగా ! #అంజలి అదృష్టవంతురాలు . మీలాంటి పరోపకారులను చేసుకున్నది"
Read 4 tweets
22 Oct
🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹

(బాలకాండ మందరమకరందం..సర్గ-49)

#రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా,

ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది.

అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో
#"ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు

. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

"ఓ రామా! ఇది #గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య #అహల్య.

ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని

వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను

అడిగాడు.
తన భర్త వేషంలో వచ్చింది #దేవేంద్రుడని అని తెలుసుకున్నది

అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది.

అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తననుచూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు.
Read 10 tweets
22 Oct
🙏కల్పవృక్షం... ఖండనం 🙏
సందర్భం వచ్చింది కాబట్టి ‘#శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ గురించి
కొన్ని విషయాలు...

👉#విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) పద్యకావ్యంగా దీన్ని రాశారు.

👉ఈ రచన 1932లో ప్రారంభమైంది. 1944- 1962ల మధ్య

అన్నికాండలముద్రణా పూర్తయింది.
👉ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ

వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974)

#కల్పవృక్ష ఖండనము’ రాశారు.

👉ఈ విమర్శ #భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై,

సంచలనం సృష్టించింది.

👉దానిపై ‘#ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది
👉ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో

పాటు అందించారు.

ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి

#జ్ఞానపీఠ బహుమతి వచ్చింది!

మరి ‘#రామాయణ విషవృక్షం’ సంగతేమిటి?
Read 4 tweets
22 Oct
🚩🚩అప్పారావు - అద్భుత దీపం.🚩🚩

" ఈ కరెంట్ కట్లు విపరీతమై పోయాయి ! ఓ ఓల్డ్ టైపు దీపం బెస్ట్ " అనుకుని అప్పారావు ఓల్డ్ సిటీ కి బయలుదేరాడు.

అక్కడ పేవ్మెంట్ మీద ఓ దీపాలబ్బీ కనబడితే " ఇదెంత అనడిగాడు "

" వాడు ఓ వంద కొట్టండి సార్ " అన్నాడు

"
ఊహూ ! తొంబై తొమ్మిదిస్తా " అన్నాడు చిన్నప్పటి ఎకనామిక్స్ కన్సూమర్ సర్లప్లస్ పాఠం గుర్తుకొచ్చి.

" సార్ ! మీ కివ్వాల్సిన రూపాయి నేనెక్కడ తెచ్చేది " అన్నాడు దీపాలబ్బీ

" అయితే అదిగో ఆ చిన్న దీపం ఇచ్చేయ్యి" అన్నాడు అప్పారావు.
" సరే సార్ ! పొద్దున్నే భలే బేరం దొరికింది " అనుకుంటూ రెండూ ఇచ్చేశాడు.

అప్పారావు ఇంటికొచ్చి, చందమామ కధ గేపకమొచ్చి, ఇంట్లో నడి హాలులో కూర్చుని, పెద్ద దీపాన్ని రుద్దాడు.

భూతం రాలేదు. చిన్న దీపాన్ని రుద్దాడు.

" ఏం కావలి మీకు " అన్నాడు భూతమొచ్చి.
Read 6 tweets
22 Oct
🚩🚩దేశమంటే మట్టి కాదోయ్!🚩🚩
.
*ఒక సారి ఒక బెంగాలి , ఒక పంజాబి " మేమే గొప్ప దేశ భక్తులం అంటే, కాదూ మేమే అంటూ " వాదించుకుంటున్నారు
. ఇద్దరూ ఒక ఒప్పొందానికి వచ్చారు .
బెంగాలి " నువ్వు
మీ వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నా నెత్తి మీద ఒక వెంట్రుక పీకేయ్ , నేనూ మా వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నీ తల వెంట్రుక పీకేస్తా.
..దేశ సేవ చేసిన వాళ్ళెవరైనా , దేశం కోసం చని పోయిన వారైనా " .సరే అంటె సరే అనుకొన్నారు.
#బెంగాలి " బకీంచంద్ర" అంటు ఒకటి#
#పంజాబి " లాలా లజ్ పత్ రాయ్ " అంటూ ఒకటి
బెంగాలీ " బిపించంద్ర పాల్ " ఒకటి
పంజాబి " భగత్ సింఘ్ " ఒకటి.
.......................
.......................
.........................
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!