శ్రేయస్సు కోసం ఐదు మార్గాలు. 1. చురుకుగా ఉండండి 2. కొత్తవి నేర్చుకోండి 3. సాయం చేయండి 4. కలుపుగోరుగా ఉండండి 5. పరిసరాలను గమనించండి
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ లో ప్రచురితమైన ఒక వ్యాసంలో వీటి గురించి వివరంగా చర్చించారు. ఆస్ట్రేలియా లో వీటిని జనబాహుళ్యంలో కి తీసుకురావటానికి
ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. ఇవి చాలా సులభంగా అందరూ పాటించదగినవి. వీటివలన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నిరూపితం అయింది. వీటిని ఆంగ్లంలో ఫైవ్ వేస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు.
1. చురుకుగా ఉండటం - అంటే శారీరక శ్రమ కలిగిన, ఏదైనా ఉల్లాసవంతమైన పని చెయ్యటం. ఉదాహరణకు స్నేహితులతో ఆడటం, వ్యాహ్యాళికి వెళ్ళటం. పిల్లలతో బయట ఆడటం. వ్యాయామం చెయ్యటం. వీటివలన విటమిన్ డి స్థాయి పెరగటం, ఎముకలు దృఢం అవ్వటం, మనసు తేలిక పడటం మొదలైన లాభాలు ఉన్నాయి.
2. కొత్తవి నేర్చుకోవటం - ఏదైనా కావచ్చు, ఉదా, కొత్త భాష, కొత్త ఆట, సంగీతం, కుట్లు, అల్లికలు, పదవినోదం మొదలైనవి. వీటివలన మతిమరుపు, డిమెన్షియా వచ్చే అవకాశం తక్కువ. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఎక్కువ.
3. సాయం చేయటం - డబ్బు ఇవ్వటమే కాదు, ఇతరులకోసం మన సమయాన్ని వెచ్చించటం. చిన్న చిన్న సహాయం అందించటం. ఉదా, వృద్ధులకు కుర్చీ ఇవ్వటం, ఇతరులకు తలుపు తీయటం, వంటింట్లో అమ్మకు, నాన్నకు సహాయపడటం. వీటివలన ఆత్మ సంతృప్తి వస్తుంది, తద్వారా కుంగుబాటు వచ్చే అవకాశాలు తక్కువ.
4. కలుపుగోరుగా ఉండటం - అంటే ఇతరులను పలకరించడం, చిరునవ్వు ఇవ్వటం, అప్పుడప్పుడు కబుర్లు చెప్పటం, స్నేహితులతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం. అలాగే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనటం. వీటివలన మనం ఒంటరి అనే భావన తొలగిపోతుంది.5
5. పరిసరాలను గమనించటం - అంటే మనం ఎక్కడున్నా చుట్టూ ఉన్న వాటిని ఒకసారి పరికించి చూడటం. అప్పుడు మీకు ఒక పక్షి అరుపు కానీ, గాలి వీచటం కానీ, పచ్చిక బయళ్ళు కానీ, ఆకాశం, మబ్బులు ఇలా చుట్టూ ఉన్న ప్రకృతి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది లేదా స్వాంతన చేకూరుస్తుంది.
పైవన్నీ పాటించండి, కొన్ని రోజుల్లో మీలో మార్పును మీరు గుర్తిస్తారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
డేల్యుజనల్ డిజార్డర్ - ఒక వ్యక్తి బలీయమైన,దుర్భేద్యమైన ఒక అపనమ్మకం పెంపొందించుకుని,ఆ నమ్మకం దృష్ట్యా ప్రవర్తించటం.ఇదొక మానసిక వ్యాధి. దీనికి వైద్యం ఉంది.ఉదాహరణకి,సాధారణంగా అనుమానం జబ్బు కొంతమందికి ఉంటుంది.భార్య ఏతప్పూ చేయనప్పుడుకూడా ఎటువంటి ఆధారం లేకుండా అనుమానించే భర్తలు ఉంటారు.
వీళ్ళు భార్య సెల్ ఫోన్లో నంబర్లను, సందేశాలను అనుమతి లేకుండా చూడడం, వెంబడించటం, నిఘా పెట్టించటం, నిజం చెప్పమని నిలదీయటం, మరీ మితి మీరితే హింసించడం, చివరకు హతమార్చడం జరుగుతుంది. ఆల్కహాల్ కి అలవాటు పడ్డవారిలో ఇది కొంచెం ఎక్కువ. దీనినే ఒథెల్లో సిండ్రోమ్ అని కూడా అంటారు.
వీరికి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వారి అపనమ్మకం గానీ, అనుమానం గానీ మార్చుకోరు. ఈ మానసిక వ్యాధి రావటానికి చదువు, స్థాయి, డబ్బు, ఉద్యోగం ఏవీ అడ్డంకి కావు. ఎవరికైనా రావచ్చు. ఒంటరి జీవితం, అభద్రతా భావం, ఆత్మన్యూనత మొదలైనవి కారణాలు కాకపోయినా అవి ఈ జబ్బు కి దోహద పడొచ్చు.
Long thread ahead.
Maternity is one of the sacred roles that women achieve. So is the bone in the pelvis where the foetal head lies named as "Sacrum". Going through the ordeal of giving birth makes the mother tired, but also pushes her into new role of carer for newborn.
Now thisrole is one of the most complex transition in human life because this is the foundation for life of another human being.After delivery there is sudden drop of hormone levels and the urgency to shift to the role of being mother puts immense stress on mother's mental state
A mixed state of joy of becoming mother and being stressed about taking care of new born baby, will put new mothers vulnerable for mental illness. This often manifests as post partum blues characterized by anxiety, withdrawn behaviour, crying spells, easily becoming irritable etc
భారత దేశం - ఆరోగ్య వ్యవస్థ ఒక ఆలోచన. 1. ముందుగా మనదేశం మొత్తం బడ్జెట్ లో ఆరోగ్యం కోసం రెండు శాతం కంటే తక్కువ కేటాయిస్తారు. దీనివలన ప్రజలే వాళ్ళ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. 2. నాయకత్వ లేమి - మన దేశంలో వైద్యం ఎలా చెయ్యాలి? అన్న దాని గురించి వైద్యుల కన్నా మిగిలిన వాళ్లే
ఎక్కువ మాట్లాడతారు. ఐ ఎ యస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీసు ని ప్రారంభించామని అరవై ఏళ్ల క్రితం మొత్తుకున్నా ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు. ఎంబీబీఎస్ సిలబస్ లో కూడా నాయకత్వ లక్షణాలు నేర్పే పాఠం ఒక్కటీ ఉండదు. దానివలన వైద్యులు ప్రాథమిక అరోగ్య కేంద్రం నుంచి, వైద్య విద్యా సంచాలకులు
వరకు ఎక్కడా నాయకత్వ లక్షణాలు చూపలేక వారి అభిప్రాయాన్ని గట్టిగా చెప్పలేక పోతున్నారు. 3. తీవ్రమైన ఆర్థిక, భౌగోళిక, సంకృతిక, భాషా పరమైన భేదాలు ఒక ఐక్య ప్రణాళికను అమలు పరిచేందుకు తీవ్ర అడ్డంకి గా మారాయి. 4. భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి
ఆస్ట్రేలియా కరోనా పై పట్టు సాధించటానికి తీసుకున్న కొన్ని నిర్ణయాలు. 1. అత్యంత త్వరగా నిర్బంధం లోకి వెళ్ళటం, చాలా జాగ్రత్తగా దాన్ని స్థాయిల వారీ సడలించడం. 2. అన్ని అనావశ్యక సేవలను నిలిపివేత. 3. ఉద్యోగం లేని వారికి భృతి. 4. పరిశ్రమలు, సంస్థలు మూతపడి ఉద్యోగాలు కోల్పోకుండా ఉద్దీపన.
5. రాష్ట్రాల సరిహద్దులు మూసివేత, అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత. 6. ప్రజలు నిర్బంధ నియమాలు పాటించేలా ఖచ్చితమైన సమాచారం అందించటం. పాటించని వారికి 1600 డాలర్ల జరిమానా విధించటం. 7. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చెయ్యటం. అన్నిరకాల ప్రజలకి ఉచితంగా, స్వచ్ఛందంగా, త్వరితగతిన చెయ్యటం.
8. కావలసిన మానవ వనరులను సిద్ధం చేసి ఉంచటం. అలాగే ఆసుపత్రుల్లో ప్రత్యేకించి " జ్వరాల చికిత్స" జరిగేలా ఏర్పాటు చేసి, మిగిలిన రోగులను విడిగా ఉంచటం. 9. రహదారులపై స్తంభాలను, బస్సులను, రైళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యటం. 10. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పరిస్థితి ఎలా ఉన్నా ప్రతిరోజూ
చైనా - మూడో ప్రపంచ యుద్ధం, ఒక ఆలోచన.
జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం ఓడిన తర్వాత ముందు తన ఆర్థిక పుష్ఠి పైన దృష్టి పెట్టింది. ఆ తర్వాత పక్కనున్న బలహీన దేశాలైన పోలాండ్, ఆస్ట్రియా మొదలైన దేశాల్ని ఆక్రమించింది. చైనా కూడా అలాగే . ముందుగా చైనా నలభై ఏళ్ల క్రితం ఒక పేద, అభివృద్ధి చెందుతున్న
దేశం. ఆ తర్వాత కమ్యూనిస్టు నినాదం కొంచెం పక్కన పెట్టి పరిశ్రమలు స్థాపించి స్థూల జాతీయ ఉత్పత్తి లో ఈరోజు అమెరికా ని చేరింది. ఆ తర్వాత నార్త్ కొరియా ని ఒక పెంపుడు కుక్కలా పక్కన పెట్టుకుంది. సైనిక బలం లేని టిబెట్ ని ఆక్రమించింది. ఆర్థిక బలం లేని పాకిస్తాన్ ని కోరకోరం హైవే పేరుతో
లోబరుచు కుంటోంది. ఇప్పటికి రవణాకి వాడినా తర్వాత కరాచీలో కచ్చితంగా నావికా స్థావరం ఏర్పాటు చేస్తుంది, లేదా ఇప్పటికే చేసి ఉంటుంది. పక్కనే ఉన్న నేపాల్ ని భయపెట్టి, వాళ్ళ పాఠ్యాంశాల్లో మాండరిన్ తప్పనిసరి చేసింది. ఇది ప్రపంచంలో ఏకైక పూర్తి హిందూ దేశం అయిన నేపాల్ సంస్కృతిని దెబ్బతీసే