హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం #HappyHoli#HolikaDahan
శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు..
బంగారు వర్ణం.. లేత ఆకుపచ్చ..ఇలా ఇన్నెన్నో వర్ణాల మిశ్రతంగా కన్పించే అరుదైనకాలంలో వచ్చే పండుగ హోళీ.
హోళీ ఎందుకు చేస్తారు?
ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీనగాథల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు
తన చెల్లెలు అయిన హోళీకాకు పురమాయిస్తాడు. ఆమె ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలోకి దూకుతుంది. కానీ ఆమె మాయాశక్తులు పనిచేయకపోగా స్థితికారకుడైన విష్ణువు ప్రహ్లాదుడిని రక్షిస్తాడు.
హోళికా అగ్నికి భస్మమవుతుంది. దుష్టశక్తిని అగ్ని దహించి వేయడంతో ఆ తర్వాతి రోజును హోళీగా నిర్వహిస్తున్నారని
ప్రతీతి. మరోగాథ ప్రకారం శ్రీకృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో ఈ పండుగను 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు.
మరోగాథ ప్రకారం శివుడి తపస్సు భంగం చేసేందుకు మన్మథుడు (కాముడు) ప్రేరేపించడం, శివుడు ఆగ్రహించి తన మూడోకన్నుతో భస్మం చేసినరోజు అని, ఆ సందర్భంలో పార్వతీ మాత కోరిక మేరకు
మన్మధుడిని శివుడు మళ్లీ బ్రతికిస్తాడు, కానీ భౌతికంగా కన్పించకుండా కేవలం రతిదేవికి మాత్రమే కన్పించేలా వరమిస్తాడు. కామం కంటే నిజమైన ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.
ఈ పండుగరోజున ఆటలు, నవ్వులేకాకుండా ప్రేమతో తప్పులను క్షమించి
అంతాకలిసి పోవడమే కాకుండా క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించుకునే పవిత్ర హృదయాలను ఆవిష్కరించే రోజు ఇది. మొదట్లో భారత్, నేపాల్ దేశాల్లో ఉండే ఈ పండుగ క్రమేపీ ప్రపంచమంతా వ్యాపించింది.
హోళీ అంటే తియ్యని పదార్థాలకు (స్వీట్స్)కు ప్రత్యేకం. ఉత్తరాదిన ప్రత్యేకమైన పానీయాలు,
స్వీట్లు తయారుచేసి అందరికీ పంచుతారు. సాయంత్రం అందరూ దగ్గర్లోని పార్క్‌లు, దేవాలయాలు,క్రీడామైదానాల్లో,ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.ఆనందంగా రాబోయే ప్రకృతిలోని మార్పులను ఆస్వాదించడానికి మానసికంగా,శారీరకంగా సిద్ధమవుతారు.ఇలా ప్రకృతితో మమైకమయ్యే అద్భుతమైన పండుగ
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PencilDay ✏️📝
పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడు తుంది. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక
ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి,
దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
#Rajasthan is a state that is known for its magnificent architecture, vibrant and colorful culture and beautiful arts and handicrafts. Rajasthan was earlier called Rajputana or the land of the kings.
Aapno Rajasthan
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు.
మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం.
#DoctorsDay 👨⚕️⚕️🥼💊🚑😷
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన
వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు
నాటు వైద్యులు
యునానీ వైద్యులు
ఆయుర్వేద వైద్యులు
హోమియోపతీ వైద్యులు
ఆధునిక వైద్యులు
#WorldIdliDay#WorldIdlyDay 😋
(ఇడ్డలిగే)920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది.ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది.తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు
దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు.
మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
#PianoDay 🎹
పియానో (Piano) అనేది ఒక తీగల సంగీత వాయిద్యం, దీనిలో తీగలు హెమ్మర్‌లచే చలిస్తాయి. దీనిని ఒక కీబోర్డు ఉపయోగించి వాయిస్తారు. దీని "కీ"లు (చిన్న మీటలు) వరుసగా ఉంటాయి. దీనిని రెండు చేతుల యొక్క అన్ని వేళ్లతో (బ్రొటనవేళ్లతో సహా)
కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు, దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి.
కీబోర్డ్ స్వరూపం :
ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు