#WorldIdliDay#WorldIdlyDay 😋
(ఇడ్డలిగే)920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది.ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది.తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు
దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు.
మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి.
అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.దోశకు, వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి.
చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (7వ శతాబ్దము) రచనల వలన భారత దేశములో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న
కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 - 1200 మధ్య కాలములో ఇండోనేషియాకు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు, వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు
ఇడ్డెన అని తెలుగు దేశ్యపదం ఉన్నది.ఇప్పటికీ పల్లెటూరివాళ్ళు ఇడ్డెన, ఇడ్డెన్లు, ఇడ్నీలు అంటుంటారు.పల్లెటూరి వాడుక ప్రకారం ఇడ్నీ క్రమంగా ఇడ్లీ అయిఉండవచ్చును.నలారానికి లకారం వాడుకలో ఉన్నది.తెనుగు;తెలుగు, మునగ;ములగ, చాలా;చానా ఇట్లాంటివి కొన్ను చూపవచ్చును.ఈపద్దతిలో ఇడ్లీ ఏర్పడి ఉండాలి.
ఇంతకీ ఇడ్డెన ఎలా ఏర్పడినది అన్న ప్రశ్నకి దువ్వెన, ఈర్చెన, నిచ్చెన, బచ్చెన వంటి పదాలతో ఇడ్డెనకు సామ్యం చూపవచ్చును.దువ్వు+ఎన దువ్వుటకు ఉపయుక్తమైన సాధనమని శబ్దరత్నాకరం అర్ధం ఉన్నది. ఉబ్బు=ఉప్పు, ఉప్పు+ఎన= ఉప్పెన, దువ్వు+ఎన=దువ్వెన, వడ్డించు=వడ్డెన, వడ్డి+ఎన=వడ్డెన. @tuxnani
వడ్డి+ఎన=వడ్డెన.కావున ధాతువుల ప్రకారం "ఎన" అనే కృత్ ప్రత్యయం వచ్చి కృదంతరూపం ఏర్పడుతుంది. దువ్వు అనే మాట క్రియ. దువ్వడం అనే పనిని తెలుపుతుంది. దీనిమీద సదరు ప్రత్యయం వచ్చి దువ్వెన అయింది. దువ్వే సాధనము అని అర్ధం ఏర్పడింది.
ఇట్లానే ఇడ్డెన ఏర్పడుతుంది? ఇడ్డెన అంటే వాసెన కుడుము అని అర్ధం. అనగా ఆవిరి కుడుము ఆని అర్ధమన్నమాట.సారాంశ మేమిటంటే ఇడ్లీ అనేది ఆవిరి గుడ్డమీద పెట్టి (ఇడి) ఉడికించిన పదార్ధం అన్నమాట.ఇడు అంటే ఉంచు, పెట్టు అన్న అర్ధం. ఇడ్లీ పెట్టారు అంటాము.
పెట్టడం (ఇడుట) ఇక్కడ ముఖ్యమన్నమాట.ఆవిరి గుడ్డపై పెడ్డనడినది (ఇడ్డ-) కాబట్టి ఇడు+ఎన అయివుంటుందని భావించవచ్చును. ఊతకోసం ఇడు డకారానికి ద్విత్వం చెప్పుకోవాలి. అప్పుడు ఇడ్డు+ఎన=ఇడ్డెన ఏర్పడుతుంది.ఉపయోగించే ఇడ్లీ పళ్లెంఇడ్లీలు ఉడకబెట్టేందుకు ప్రస్తుతం ప్లేట్లు లభ్యమవుతున్నాయి.
గతంలో వీటిని ఆవిరిపోకుండా గుడ్డతో మూత కట్టిన పాత్రల్లో (వాసెన) ఉడికించే వారు. పాత్రలో సగం వరకూ నీరు పోసి దాని అంచుకు గట్టిగా ఓ బట్ట కట్టి అందులో ఒకటే ఇడ్లీ పోసి ఉడికించే వారు. తరువాత దానిని ముక్కలుగా కోసి తినేవారు. తమిళనాడులో ఇప్పటికీ చాలామంది పిండిని నేరుగా ప్లేటులో కాకుండా
దాని మీద బట్ట వేసి పిండి మిశ్రమాన్ని వేసి ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల ప్లేట్లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాల్సిన అవసరం ఉండదు.
ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మద్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి.
ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి.ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.
కంచి దేవరాజ స్వామి ఆలయంలో ఒకటిన్నర కిలో బరువున్న ఇడ్లీ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం బియ్యం, మిరియాలు, కొత్తిమీర, అల్లం, ఇంగువ, జీలకర్ర, తగినంత పెరుగు కలిపి మెత్తగా రుబ్బి ఓ పెద్ద ఇడ్లీగా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని రామస్సెరి అనే గ్రామం ఇడ్లీలకు పెట్టింది పేరు. స్పాంజిలా మృదువుగా ఉండే ఈ ఇడ్లీ ఒకటో శతాబ్దం నుంచీ ఒక కుటుంబం ఈ విధానాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.
ఇప్పటికీ కట్టెలపొయ్య మీద బట్ట కట్టిన మట్టి పాత్రలోనే ఇడ్లీని వండుతారు.
ప్రస్తుతం ఇడ్లీ రకరకాల రూపంలోకి మారిపోయింది.కొందరు రాగి పిండితో ఇడ్లీ చేస్తుంటే మరికొందరు గోధమలు, కూరగాయలతో కూడా చేస్తున్నారు. తాజాగా మరో ఇడ్లీ అందుబాటులోకి వచ్చింది. అదే స్టఫ్డ్ ఇడ్లీ మరియు ఇన్స్తంట్ ఇడ్లీ.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PencilDay ✏️📝
పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడు తుంది. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక
ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి,
దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
#Rajasthan is a state that is known for its magnificent architecture, vibrant and colorful culture and beautiful arts and handicrafts. Rajasthan was earlier called Rajputana or the land of the kings.
Aapno Rajasthan
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు.
మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం.
#DoctorsDay 👨⚕️⚕️🥼💊🚑😷
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన
వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు
నాటు వైద్యులు
యునానీ వైద్యులు
ఆయుర్వేద వైద్యులు
హోమియోపతీ వైద్యులు
ఆధునిక వైద్యులు
#PianoDay 🎹
పియానో (Piano) అనేది ఒక తీగల సంగీత వాయిద్యం, దీనిలో తీగలు హెమ్మర్‌లచే చలిస్తాయి. దీనిని ఒక కీబోర్డు ఉపయోగించి వాయిస్తారు. దీని "కీ"లు (చిన్న మీటలు) వరుసగా ఉంటాయి. దీనిని రెండు చేతుల యొక్క అన్ని వేళ్లతో (బ్రొటనవేళ్లతో సహా)
కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు, దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి.
కీబోర్డ్ స్వరూపం :
ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!!
శ్రీ నారాయణరెడ్డి గారు సరస్వతీపుత్రునికి సమర్పించిన పై కవితా నీరాజంతో ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుకుందాం🙏🌹💐🌷🌺🌼🏵️🇮🇳
అయనను తెలుగు వారు గుర్తించింది లేదు. ఈ జాతికి పండితులను గుర్తించే సంస్కారం కానీ, వైవిధ్యతను అనుశీలించే చాతుర్యం కానీ, ప్రాధాన్యతలను తెలుసుకునే తెలివి కానీ లేవు.ఐనా అయన తాను పుట్టిన తెలుగుజాతి కోసం చారిత్రక విషయాలను ఇతివృత్తంగా సృజనాత్మకతతో సాహిత్యీకరించగలిగిన