#PencilDay ✏️📝
పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడు తుంది. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక
ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి,
దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి.
తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు కానీ "సాధారణంగా" పంచభుజి, అష్టభుజి
రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.
* ఈ రోజు గురించి తెలుసుకోవాలంటే మొదటిసారిగా చెక్కతో పెన్సిల్ తయారుచేసినదెవరో గుర్తు తెచ్చుకోవాలి. 'హైమెన్ లిప్‌మ్యాన్' అనే వ్యక్తి. తను చేసిన పెన్సిల్‌పై ఈయన మార్చి 30నే పెటెంట్ హక్కు తీసుకున్నాడు.
అందుకే ఆ రోజు పెన్సిల్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. మొదటిసారిగా 1858లోనే ఈయన పెన్సిల్ వెనుకే రబ్బరును జోడించి సరికొత్త పెన్సిల్ని తయారు చేశాడు.
* నిజానికి పెన్సిళ్ల వాడకం మొదలైంది 1565కు ముందేనట. అప్పట్లో ఇంగ్లాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో గ్రాఫైట్ గనులు ఉండేవి. స్థానికులు ఆ గ్రాఫైట్ ముక్కలతో గొర్రెలపై గుర్తులు పెట్టుకునేవారు. అలా మెల్లగా ఆ రాయిలాంటి గ్రాఫైట్‌నే పెన్సిల్ ములుకుగా మార్చారు. ఈ కొత్త రాత సాధనం
ప్రపంచమంతా పాకిపోయింది. తర్వాత గ్రాఫైట్‌తో చాలా ప్రయోగాలు జరిగాయి. గ్రాఫైటును పొడిచేసి దానికి కొన్ని పదార్థాలు కలిపి సన్నని కర్ర ముక్కల మధ్య పెట్టి, రాసుకోడానికి అనువుగా ఉండేలా హైమెన్ లిప్‌మ్యాన్ తయారు చేశాడు. ఆపై రంగు రంగుల పెన్సిళ్లు కూడా రూపొందాయి.
* పెన్సిల్ అనే పదం లాటిన్ భాష పెన్సిల్యూస్ నుంచి వచ్చింది. దీనర్థం 'లిటిల్ టేల్'. అంటే చిన్న తోక. మరి కొందరేమో ఫ్రెంచ్ పిన్‌సెల్ అనే పదం నుంచి వచ్చిందంటారు. దీనిర్థం బొమ్మలేసే చిన్న కుంచె అని.
* గురుత్వాకర్షణ శక్తి లేని చోట, నీటిలో కూడా పెన్సిల్ రాస్తుంది. అందుకే వ్యోమగాములు అంతరిక్షంలోనూ వాడతారు.
* ఐరోపాలో 1622 నుంచి, అమెరికాలో 1812 నుంచి పెన్సిళ్ల వాడకం మొదలైంది.
* మొదటి పెన్సిల్ ఫ్యాక్టరీని ఇంగ్లాండ్‌లో స్థాపించారు.
* ఒక్క పెన్సిల్ సుమారు 45 వేల పదాలు రాస్తుంది. సుమారు 56 కిలోమీటర్ల గీత గీస్తుంది.
* ఇంగ్లాండ్‌లో 'కుంబర్‌ల్యాండ్ పెన్సిల్ మ్యూజియం' ఉంది. ఇక్కడ అతి పెద్ద రంగుల పెన్సిల్ ఉంది. ఇది 26 అడుగుల ఎత్తు, 446.36 కిలోల బరువు ఉంటుంది.
* ఎమిలియో అనే ఆయన 1956 నుంచి 2013 వరకు 16,260 పెన్సిళ్లు సేకరించి రికార్డు కొట్టాడు.
* యూకేకు చెందిన ఎడ్ డగ్లస్ మిల్లర్ 1,061 అడుగుల పొడవైన పెన్సిల్‌ని తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించాడు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#Rajasthan is a state that is known for its magnificent architecture, vibrant and colorful culture and beautiful arts and handicrafts. Rajasthan was earlier called Rajputana or the land of the kings.
Aapno Rajasthan
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు.
మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం.
#DoctorsDay 👨⚕️⚕️🥼💊🚑😷
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన
వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు
నాటు వైద్యులు
యునానీ వైద్యులు
ఆయుర్వేద వైద్యులు
హోమియోపతీ వైద్యులు
ఆధునిక వైద్యులు
#WorldIdliDay#WorldIdlyDay 😋
(ఇడ్డలిగే)920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది.ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది.తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు
దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు.
మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
#PianoDay 🎹
పియానో (Piano) అనేది ఒక తీగల సంగీత వాయిద్యం, దీనిలో తీగలు హెమ్మర్‌లచే చలిస్తాయి. దీనిని ఒక కీబోర్డు ఉపయోగించి వాయిస్తారు. దీని "కీ"లు (చిన్న మీటలు) వరుసగా ఉంటాయి. దీనిని రెండు చేతుల యొక్క అన్ని వేళ్లతో (బ్రొటనవేళ్లతో సహా)
కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు, దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి.
కీబోర్డ్ స్వరూపం :
ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!!
శ్రీ నారాయణరెడ్డి గారు సరస్వతీపుత్రునికి సమర్పించిన పై కవితా నీరాజంతో ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుకుందాం🙏🌹💐🌷🌺🌼🏵️🇮🇳
అయనను తెలుగు వారు గుర్తించింది లేదు. ఈ జాతికి పండితులను గుర్తించే సంస్కారం కానీ, వైవిధ్యతను అనుశీలించే చాతుర్యం కానీ, ప్రాధాన్యతలను తెలుసుకునే తెలివి కానీ లేవు.ఐనా అయన తాను పుట్టిన తెలుగుజాతి కోసం చారిత్రక విషయాలను ఇతివృత్తంగా సృజనాత్మకతతో సాహిత్యీకరించగలిగిన