#WeedAppreciationDay 🍃🍀
ప్రధాన పంటను నష్ట పరిచే ఇతర గడ్డి మొక్కలను కలుపు అంటారు. కలుపు వలన చీడ పీడలు పెరుగుతాయి, అంతేకాక ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను ఇవి స్వీకరిస్తాయి, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
చేతితో ఏరి వేయుట ద్వారా కలుపు నివారణ:-
పంటలో అంతర కృషిగా కలుపును ఏరి కలుపు మొక్కలను నాశనం చేయటం ద్వారా కలుపును నివారించవచ్చు.
దుక్కుల ద్వారా కలుపు నివారణ:-
నాగలి ద్వారా, లేక గొర్రు ద్వారా దుక్కి దున్ని పంటలో అంతర కృషి చేయట వలన కలుపు నివారించవచ్చు.
ప్రకృతిలో, ఖచ్చితంగా పనికిరాని మొక్కలు ఉండవు, మరియు సంవత్సరానికి మన పొలంలో లభించే అత్యంత హానికరమైన కలుపును లాభం కోసం ఉపయోగించవచ్చు..
వీటిని అలంకరణ పూల కోసం, ప్రదర్శన కోసం ఉద్యాన వనాలలో, దేవాలయలలో, విద్యాలయాలలో, ఇండ్లలో, ప్రకృతిదృశ్యం అందంగా కనపడేందుకు ఖాళీ ప్రదేశం ఉన్న అనేక రకాల ప్రదేశాలలో వీటిని పెంచుతారు మరియు వీటిని ఆయుర్వేదం, హెల్త్ సైన్స్, వంటలలో ఉపయోగిస్తారు.
ఒకసారి మీ గార్డెన్ లోని కలుపు మొక్కలను తుంచి వాటి గురించి అన్వేషించండి మీకు వాటి ఉపయోగాలు లేదా మొక్కల పై జ్ఞానాన్ని పొందుతారు.
నేడు కలుపు ప్రశంసా దినోత్సవం సందర్భంగా వాటి ఉపయోగాలు..
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు
అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు.
ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు.
కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో..
ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు
ఎండిపోతున్నాయని చెబుతున్నారు.
ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్‌లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు.
ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’ పర్యావరణానికి ఎంతో మేలు...
వాటర్ హయసింత్ అనే నీటిమొక్క చాలా వేగంగా పెరుగుతుంది. ఇది దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందినదైనా ఇంచుమించు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీనికి గుంట ఆకారంలో ఉండే పువ్వులు పూస్తాయి. అందుకే మొదట్లో దీనిని ఇతర ప్రాంతాల వారు కూడా పెంచడానికి ఇష్టపడ్డారని భావిస్తున్నారు.
ఈ మొక్కలు చాలా త్వరగా పెరగడం వల్ల వీటి సంఖ్య రెండు వారాల్లోనే రెట్టింపవుతుంది. సరస్సులో వీటి పెరుగుదల పడవ ప్రయాణాలకి, చేపలు పట్టడానికి అడ్డంకిగా మారుతుంది. ఈ మొక్కల వల్ల దోమలకు మంచి నివాసం దొరికి వాటి సంఖ్యతో పాటు వ్యాధులు కూడా పెరుగుతాయి.
అందువల్ల వీటిని కలుపు మొక్కలుగా భావించి వీటి నిర్మూలనకి ప్రయత్నిస్తుంటారు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ పైలట్లు ఈ మొక్కలతో నిండి ఉన్న చెరువులను పొలాలుగా భావించేవారట. దానితో యుద్ధ విమానాలను అక్కడ దించడానికి ప్రయత్నించడంతో అవి కూలిపోయేవట.అందుకే వాటిని జపాన్ జబారా అంటారు. #Weed
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#PencilDay ✏️📝
పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడు తుంది. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక
ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి,
దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
#Rajasthan is a state that is known for its magnificent architecture, vibrant and colorful culture and beautiful arts and handicrafts. Rajasthan was earlier called Rajputana or the land of the kings.
Aapno Rajasthan
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు.
మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం.
#DoctorsDay 👨⚕️⚕️🥼💊🚑😷
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన
వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు
నాటు వైద్యులు
యునానీ వైద్యులు
ఆయుర్వేద వైద్యులు
హోమియోపతీ వైద్యులు
ఆధునిక వైద్యులు
#WorldIdliDay#WorldIdlyDay 😋
(ఇడ్డలిగే)920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది.ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది.తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు
దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు.
మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
#PianoDay 🎹
పియానో (Piano) అనేది ఒక తీగల సంగీత వాయిద్యం, దీనిలో తీగలు హెమ్మర్‌లచే చలిస్తాయి. దీనిని ఒక కీబోర్డు ఉపయోగించి వాయిస్తారు. దీని "కీ"లు (చిన్న మీటలు) వరుసగా ఉంటాయి. దీనిని రెండు చేతుల యొక్క అన్ని వేళ్లతో (బ్రొటనవేళ్లతో సహా)
కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు, దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి.
కీబోర్డ్ స్వరూపం :
ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు