పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! Image
శ్రీ నారాయణరెడ్డి గారు సరస్వతీపుత్రునికి సమర్పించిన పై కవితా నీరాజంతో ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుకుందాం🙏🌹💐🌷🌺🌼🏵️🇮🇳
అయనను తెలుగు వారు గుర్తించింది లేదు. ఈ జాతికి పండితులను గుర్తించే సంస్కారం కానీ, వైవిధ్యతను అనుశీలించే చాతుర్యం కానీ, ప్రాధాన్యతలను తెలుసుకునే తెలివి కానీ లేవు.ఐనా అయన తాను పుట్టిన తెలుగుజాతి కోసం చారిత్రక విషయాలను ఇతివృత్తంగా సృజనాత్మకతతో సాహిత్యీకరించగలిగిన
అద్వితీయ ప్రజ్ఞ ఉన్న ప్రతిభామూర్తిగా కీర్తిని పొందిన ఆ సరస్వతీపుత్రుడు డా పుట్టపర్తి నారాయణాచార్యులు.వారి జయంతి(24 -3 -1914 )నేడు. పుట్టపర్తి నారాయణాచార్యులు పద్నాలుగు భాషల్లో పండితుడు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాల్లో దిట్ట. గొప్ప వక్త. శతాధిక గ్రంథకర్త.
కానీ, ఆయన ‘శివతాండవం’ గ్రంథకర్తగానే చాలామందికి తెలుసు. అయితే అంతకు ముందే చిన్నతనంలో చారిత్రక కావ్యాలే పుట్టపర్తిని కవిగా తెలుగు సాహితీ లోకంలో నిలబెట్టాయి.‘పెనుగొండలక్ష్మి’ పుట్టపర్తి తొలి రచన. దీన్ని ఆయన పన్నెండేళ్ల వయసులో (1926) రచించారు.
ఓ సందర్భం లో ఇలా అంటారు"ఆ రచనా కాలం నాటికి నాకు ఛందస్సు కూడా రాదు. తిక్కన భారతాన్ని బాగా చదువుతుండటం వల్ల ఆ వాచక శక్తి దీనికి పునాది అయింది. ఆంధ్రమహాభారతం శక్తి అలాంటిది" .పుట్టపర్తి గారి ఈ తొలి రచనే ఆ తర్వాత కాలంలో ఆయనకు విద్వాన్‌ పరీక్షలో పాఠ్యగ్రంథమైంది!.
మరి ఇంతటి ప్రతిభాశాలి గూర్చి మన పిల్లలకు చెప్పడం వాళ్ళ బాగు చూసుకునే తల్లిదండ్రుల భాద్యత కాదా! పందొమ్మిదేళ్ల వయసులో... తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ‘షాజీ’ కావ్యరచన చేశారు పుట్టపర్తి. సహధ్యాయులే దీన్ని అచ్చొత్తించారు.
విశేషం ఏంటంటే, ఈ కావ్యమూ నాడు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ఎంపికైంది. ఇంతటి ప్రతిభగల మహనీయులను పరిచయం చేసినప్పుడే గురువుల భాద్యత నిర్వహించిన వాళ్ళు అవుతారు!ఓ సందర్భం లో డా।। సినారె మాటల్లో చెప్పాలంటే-
కవిత్వాన్నీ, పాండిత్యాన్ని కలిసి ఆపోశన పట్టిన అగస్త్యుడు పుట్టపర్తి. చరిత్రకు తన కల్పనాశక్తిని జోడించి చిక్కటి చారిత్రక రచనలను వెలువరించాయన. మల్లంపల్లి సోమశేఖరశర్మ లాంటి వారు ఆ సరస్వతీపుత్రుణ్ని ‘చారిత్రకుడి’గా గౌరవించడానికి కారణం ఈ కృషే.
బహుముఖ ప్రజ్ఞ అన్న పదానికి పర్యాయంగా భాసించిన పుట్టపర్తి... ఓ అరుదైన సాహితీమూర్తి. పుట్టపర్తి వారు సాహిత్య రంగంలోనే కాదు, నిజ జీవితంలోనూ పండితుడు. పండితుడు అంటే –
విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని lశుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||
(విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మని విషయంలో, ఏనుగు విషయంలో, శునకం, శునకమాంసము తిను వాని విషయంలోనూ సమానత్వం పాటించెడు వాడు పండితుడు) మరి అలంటి పండితులు మానవజీవితంలో కూడా ఉండాలి ఆలా ఉండేలా మన బిడ్డలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ...
సరస్వతీ పుత్రుడు డా పుట్టపర్తి నారాయణాచార్యులకి ప్రణమిల్లుతూ..వారి గూర్చి కనీస పరిజ్ఞానమ్ లేని మన పాలకులనుచూసి ఆవేదన చెందుతూ..
* సవరణ 28-03-1914*

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

30 Mar
#PencilDay ✏️📝
పెన్సిల్ రాయడానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్ నుంచి తయారు చేయబడు తుంది. పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక Image
ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి,
దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
Read 13 tweets
30 Mar
#Rajasthan is a state that is known for its magnificent architecture, vibrant and colorful culture and beautiful arts and handicrafts. Rajasthan was earlier called Rajputana or the land of the kings.
Aapno Rajasthan

#RajasthanDiwas #RajasthanDay #राजस्थान_दिवस Image
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు.
మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం.
Read 13 tweets
30 Mar
#DoctorsDay 👨‍⚕️⚕️🥼💊🚑😷
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన Image
వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు
నాటు వైద్యులు
యునానీ వైద్యులు
ఆయుర్వేద వైద్యులు
హోమియోపతీ వైద్యులు
ఆధునిక వైద్యులు
Read 8 tweets
30 Mar
#WorldIdliDay #WorldIdlyDay 😋
(ఇడ్డలిగే)920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది.ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది.తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు Image
దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు.
మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
Read 18 tweets
29 Mar
#PianoDay 🎹
పియానో (Piano) అనేది ఒక తీగల సంగీత వాయిద్యం, దీనిలో తీగలు హెమ్మర్‌లచే చలిస్తాయి. దీనిని ఒక కీబోర్డు ఉపయోగించి వాయిస్తారు. దీని "కీ"లు (చిన్న మీటలు) వరుసగా ఉంటాయి. దీనిని రెండు చేతుల యొక్క అన్ని వేళ్లతో (బ్రొటనవేళ్లతో సహా) Image
కిందికి నొక్కడం లేదా తట్టడం ద్వారా ఉపయోగిస్తారు, దీని హెమ్మర్లు తీగలకు తగలటం ద్వారా సంగీత ధ్వనులు ప్రదర్శితమవుతాయి.
కీబోర్డ్ స్వరూపం :
ప్రతి కీబోర్డ్ లోను కొన్ని ''తెల్ల మెట్లు'' కొన్ని ''నల్ల మెట్లు'' కనిపిస్తాయి. ఒక సాధారణ కీబోర్డ్ లో మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మంద్ర స్థాయి, మధ్య స్థాయి, తార స్థాయి అని చెబుతారు. కొన్ని కీబోర్డ్ లలో ''అతి మంద్ర స్థాయి'' ''అతి తార స్థాయి'' లు
Read 8 tweets
28 Mar
హోళీ పండుగ శుభాకాంక్షలు ✨👣🔫
ఫాల్గున మాసం.. పౌర్ణమి సమయం
గడిచినయేటికి వీడ్కోలు పలికే
వేడుకైన వార్షికోత్సవం
వసంతాగమనంలో వచ్చేను రంగుల హోలీ
నింపేను జీవితంలో సంతోషపు కేళి

మురిపాల బాలకృష్ణున్ని యశోద ఊయలలూపిన
డోలోత్సవం

రాక్షసపీడ పోయేందుకు హోలికాశక్తిని కొలిచే
హోలికోత్సవం
#HoliHai Image
రాధకు ప్రేమరంగులద్దిన కృష్ణుని ప్రేమోత్సవం
కామునిపై శంకరుడు త్రినేత్రం గురిపెట్టి
గెలిచిన విజయోత్సవం

కాముని పున్నంగా చెప్పుకునే ఈ సంబరం
రంగుల హరివిల్లులైన స్వరజతుల సమ్మేళనం

చిలకముక్కు ఆకారం కొమ్మ అంతటా గుత్తులుగా
పూసే మోదుగు చెట్ల పూలతో చేసిన
రంగునీళ్లతో ఆడేద్దాం హొలీ Image
చిన్నా పెద్దా, కులమతా , భాషాబేదం లేకుండా
ప్రేమను పంచే హోళీ
రంగునీళ్లల్లో తడిసి ముద్దవుతూ
కేరింతలతో తుళ్లిపడుతూ
చెమ్మకేళలిలు ఆడుకునే ఆనందాల హోలీ

సహజ రంగుల్ని వాడుదాం
పర్యావరణాన్ని కాపాడుదాం
సప్త వర్ల కాంతులతో ఆనందమయం కావాలి
మనజీవితం
ప్రేమను పంచే హోలి రంగుల రంగేలి Image
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!